విద్యుత్ అధికారులతో కేసీఆర్ భేటీ | kcr meets transco, genco officials | Sakshi
Sakshi News home page

విద్యుత్ అధికారులతో కేసీఆర్ భేటీ

Published Sun, Nov 9 2014 2:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

kcr meets transco, genco officials

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌వాటా రాకుండా అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరును తెలంగాణ అసెంబ్లీలో ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై సోమవారం శాసనసభ రెండో సెషన్‌లో చర్చ జరగనుంది. దీంతో విద్యుత్ వివరాల కోసం శనివారం కేసీఆర్ తెలంగాణ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషీ, తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులతో భేటీ అయ్యారు. తెలంగాణ హక్కులు, ఏపీ ఉల్లంఘనలపై పలు డాక్యుమెంట్లను ఈ భేటీలో అధికారులు సీఎంకు అందించారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement