
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులతో పాటు 2000 జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం) పోస్టులు ఇందులో ఉండనున్నాయి.
150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులుండనున్నాయి. ఈ పోస్టుల సంఖ్య స్వల్పంగా మారవచ్చని, మొత్తానికి 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించి ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. అనంతరం ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment