అంతా ఆన్‌లైన్
ఓడీ చెరువు: ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల కోసం బిల్ పే, పేమెంట్ రిమైండర్, గత చెల్లింపుల వివరాలు, కస్టమర్ కేర్ సేవలు, సరఫరా, కార్యాలయం సంప్రదింపు వివరాలు తదితర సేవల కోసం మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. విద్యుత్ బిల్లును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్ , నగదు కార్డు, వాలెట్ ద్వారా నగదు చెల్లించే విధానాన్ని తీసుకువచ్చింది. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏపీఎస్‌పీడీసీఎల్ యాప్‌ను ఉపయోగించే విధానాన్ని అధికారులు వివరించారు.
ూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏపీఎస్‌పీడీసీఎల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆండ్రాయిడ్ మొబైల్‌లో స్టోర్ చేసుకోవాలి.
ూ యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ దిగువన ‘సైన్ అప్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
ూ పేరు, మొబైల్ నంబర్, ఈమైల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సైన్‌అప్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ూ తర్వాత హోమ్ స్క్రీన్‌పైన రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. 13 అంకెల సర్వీస్ నంబర్‌ను అందులో నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేస్తే సర్వీసు నంబర్ ప్రక్రియ పూర్తీ అవుతుంది. ఒక యూజర్ ఐడీతో ఐదు సర్వీసుల వరకు నమోదు చేసుకోవచ్చు.
ూ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు హోమ్ స్క్రీన్‌పై ‘బిల్‌పే’ ఐకాన్ మీద క్లిక్ చేయాలి.
ూ బిల్లు మొత్తం తెలుసుకోవడానికి నమోదు చేసిన సర్వీస్ నమోదుపై క్లిక్ చేస్తే అవసరాన్ని బట్టి బిల్‌పే రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు.
ూ బిల్లు చెల్లించేందుకు ‘పేమెంట్’ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘ఓకే’ బటన్ క్లిక్ చేయడం ద్వారా నిబంధనలను అంగీకరించాలి. తర్వాత యూజర్ చెల్లింపు పద్ధతి ఎంపిక స్క్రీన్ కనిపిస్తుంది. వినియోగదారుడు, క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్, నగదు కార్డు, వాలెట్ ఏదో ఒకదాన్ని ఎంచుకుని చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తర్వాత రసీదు కనిపిస్తుంది. దాన్ని వినియోగదారుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబర్ – 1800425155333 సంప్రదించవచ్చు