రామగుండం (కరీంనగర్): విద్యుత్ బిల్లులు చెల్లించలేదని కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయానికి టాన్స్‌కో అధికారులు శనివారం విద్యుత్‌ను నిలిపివేశారు. బకాయిలు పడ్డ రూ.33 లక్షల బిల్లులు వెంటనే చెల్లించాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు.
బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ సరఫరా చేయలేమని స్పష్టం చేశారు. కరెంటు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు చెల్లించని ప్రతీ కార్యాలయానికి కరెంటు సరఫరా నిలిపేస్తామని ట్రాన్స్‌కో అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.