ఖమ్మం : ఇప్పటికే అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. అవి చాలవన్నట్లు సోమవారం నుంచి మరిన్ని గంటల పాటు కోత విధిస్తూ ట్రాన్స్‌కో అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వర్షాలు లేక పంటలు అంతంతమాత్రమే సాగు చేసినా.. విద్యుత్ కోతల బాధలు మాత్రం జిల్లా ప్రజలకు తప్పడంలేదు. జిల్లా కేంద్రం.. మండల సబ్‌స్టేషన్, మున్సిపాలిటీ కేంద్రాలు దేన్నీ వదలిపెట్టకుండా కోతల వాతలు పెడుతున్నారు. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వ్యవసాయ సీజన్‌లో ఇంకెలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు.
పెరిగిన విద్యుత్ కోతలు
జిల్లాకు సరఫరా చేసే విద్యుత్ కంటే వినియోగం ఎక్కువగా ఉండటంతోపాటు విశాఖపట్నం, కేటీపీఎస్‌లో 10 యూనిట్లు మరమ్మతులకు గురికావడంతో మరిన్ని గంటల పాటు కోతలు విధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో 4 గంటలు, మున్సిపల్, మండల సబ్ స్టేషన్ కేంద్రాల్లో 6గంటల కోత ఉండేది. అయితే సోమవారం నుంచి జిల్లాకేంద్రంలో 6 గంటలు, మండల, సబ్‌స్టేషన్, మున్సిపల్ కేంద్రాల్లో 8 గంటల పాటు కోతలు విధించేందుకు రం గం సిద్ధం చేశారు.
ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ఆ రంభంలో జిల్లా కేం ద్రంలో రెండు గం టలు,మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఆరు గంటల కోత ఉండేది. వర్షాలు లేకపోవడం, వేసవిని తలపించే ఎండలతో ఈ కోతలకే ప్రజలు విలవిలలాడారు. అయితే జూలై చివరి నుంచి జిల్లా కేంద్రంలో 4 గంటలు, మున్సిపల్, పట్ట ణ కేంద్రాల్లో 6 గంటల పాటు కోత విధిం చారు. ఇక సోమవారం నుంచి జిల్లా కేంద్రం లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3గంట లు, మండల, మున్సిపల్, సబ్‌స్టేషన్ కేంద్రా ల్లో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంట లు కోత విధించనున్నారు.
అయితే ఉదయం విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, ఉద్యోగులు కార్యాలయాలకు, ఇతరులు తమ దైనందిన కార్యక్రమాలకు వెళ్లేందుకు బాక్సు లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కోత విధిస్తే బడిపిల్లలతోపాటు ఉద్యోగులకు బాక్సులు తయా రు చేయడం కష్టమేనని మహిళలు అంటున్నారు. ఇక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు కోత విధిస్తే తమ వ్యాపారాలు కష్టమేనని చిల్లర దుకాణాల వారు, వెల్డింగ్ షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోత..వాత !
Published Mon, Aug 4 2014 5:19 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement