
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 2017లో జారీచేసిన నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ లైన్‌మన్ల నియామకాలను నెలరోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. వీటికి సంబంధించిన మరో ఏడు పిటిషన్లను కూడా కొట్టివేసింది. ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్ ఇంజనీర్ల నియామకాలకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. లైన్‌మన్ల నియామకాల్లో 20 మార్కులు వెయిటేజీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వెయిటేజీ మార్కులను సమర్థించింది. మరో ధర్మాసనం తప్పుబట్టింది. దీంతో ఈ వివాదం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ముందుకు రాగా అది కూడా వెయిటేజీని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment