నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో జరిగిన అవకతవకలకు నిరసనగా దాదాపు 200 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీఈ నరేశ్ కుమార్ రెడ్డి ఉద్యోగులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల బదిలీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
Published Fri, Aug 7 2015 1:38 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement