సాక్షి, మంచిర్యాల : డిమాండ్ల సాధన కోసం విద్యుత్ స్పాట్ బిల్లింగ్ ఆపరేటర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తాత్కాలిక పరిష్కారాన్ని సిద్ధం చేశారు. ఇం దులో భాగంగా విద్యుత్‌శాఖ సిబ్బందితో గురువారం నుంచి వినియోగదారులకు బిల్లులు అందించేందుకు స మాయత్తమయ్యారు. టాన్స్‌కో శాఖ ఎంపిక చేసిన కాం ట్రాక్టర్లకు చెందిన ఆపరేటర్ల ద్వారా వినియోగదారులకు బిల్లులు అందజేసే సేవలను పొందుతోంది.
జిల్లాలోని 3,77,592 సర్వీసులకు చెందిన బిల్లులు వినియోగదారులకు అందిస్తున్నందుకు రూ.9.21 లక్షలను ఆయా కాం ట్రాక్టర్లకు ప్రతి నెలా చెల్లిస్తోంది. ఆపరేటర్ల సేవలను బట్టి వారికి సదరు గుత్తేదార్లు భత్యం ఇస్తుంటారు. తమకు నిర్ధేశిత వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఒకటో తేదీ నుంచి ఆపరేటర్లు సమ్మె చేస్తున్నారు.
ఆలస్యం అయితే.. బిల్లుల మోతే..!
బిల్లులు అందజేసే సమయంలో సమ్మె చేయడంతో వినియోగదారులతోపాటు ట్రాన్స్‌కో వర్గాలు ఆలోచనలో పడ్డాయి. సమ్మె ముగిసిన అనంతరం బిల్లులు ఆలస్యంగా అందజేస్తే ఆ మేరకు విద్యుత్ యూనిట్లు పెరిగి భారం వినియోగదారులపై పడనుంది. ప్రస్తుతం గృహ కేటగిరీ స్లాబ్‌లు 50 యూనిట్ల వరకు అయితే యూనిట్‌కు రూ.1.45 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50-100 యూనిట్ల లోపు అయితే మొదటి యాభై యూనిట్లకు రూ.1.45, 51-100 వరకు రూ.2.60 విద్యుత్ వర్గాలు చార్జీ వేస్తాయి.
100-200 యూనిట్ల వరకు వాడితే మొదటి యాభై యూనిట్లకు రూ.2.60, 51-100 వరకు రూ.3.25, 151-200 యూనిట్లకు రూ.3.60 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విధంగా యూనిట్లు పెరిగినకొలది చెల్లించే ధరలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజాగా సమ్మె చేస్తున్న తర్వాత బిల్లులు వస్తే తమ పరిస్థితి ఏం కాను అని పలువురు వినియోగదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆపరేటర్ల డిమాండ్లు ఇవే..
పట్టణ ప్రాంతాల్లో కనెక ్షన్ ఇచ్చే రూ.1.45 ను రూ.2 చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లోని చెల్లించే రూ.1.80ని రూ.2.50లకు పెంచాలి. కనీస వేతనంగా రూ.10 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్‌ఈ అశోక్‌ను సంప్రదించగా ఆపరేటర్లు సమ్మె చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సమ్మెతో బిల్లుల చెల్లింపు ఆలస్యం అయ్యే అవకాశాలున్నందున విద్యుత్ శాఖ వర్గాలచే బిల్లులు చెల్లించే సన్నాహాలు చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు తగు నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.
సమ్మెకు తాత్కాలిక పరిష్కారం
Published Wed, Sep 3 2014 11:56 PM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement
Advertisement