ట్రాన్స్కోకు పంగ‘నామా’లు
⇒ నామా నాగేశ్వరరావు విద్యుత్ కంపెనీలకు అడ్డగోలు ప్రయోజనం
⇒ క్విడ్ ప్రో కో కోసం ఏపీ సీఎం నుంచి ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బిచ్చిన వారికి అయాచితంగా ప్రయోజనం చేకూర్చేందుకు చంద్రబాబు సర్కారు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీఎం బినామీగా చెప్పుకొనే నామా నాగేశ్వరరావుకు చెందిన రెండు విద్యుత్ ప్రాజెక్టులకు రూ. వేల కోట్లు దోచిపెడుతున్నారు. నెల్లూరులో ఉన్న సింహపురి, మీనాక్షి సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 12 ఏళ్ల పా టు 600 మెగావాట్లు విద్యుత్ కొనేందుకు పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకున్నారు.
వాస్తవానికి ఈ తతంగం గత నెల రోజులుగా నడుస్తోంది. అయితే, సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) దీనిపై తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏపీలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, కొత్తగా ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని ఏపీ ట్రా న్స్‌కో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ నామా సంస్థల నుంచి విద్యుత్‌ను కొనాల్సిందేన ని సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రే ట్రాన్‌్థకో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనివల్ల డిస్కమ్‌లపై రూ. వేల కోట్ల భారం పడనుంది.
ఎక్కువ ధర... దీర్ఘకాలం
ఇప్పుడు జరిగిన పీపీఏలు రూ. వేల కోట్లు ఖరీదైనవి. 600 మెగావాట్ల విద్యుత్‌ను 85 శాతం పీఎల్‌ఎఫ్‌తో తీసుకోవాలనేది ఒప్పందం. అంటే రోజుకు 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ కొనుగోలు చేస్తారు. దీనికి యూనిట్‌కు రూ. 4.43 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ. 5.31కోట్లు. ఏడాదికి రూ. 1,940 కోట్లు. 12 ఏళ్ల పాటు తీసుకునే ఈ విద్యుత్‌కు రూ. 23,280 కోట్లు ప్రజల సొమ్ము నామా సంస్థలకు దోచిపెడుతున్నారు. ఈ రెండు విద్యుత్ ప్లాంట్లు కూడా విదేశీ బొగ్గుతో నడిచేవి కావడం మరో విశేషం. అంటే, విదేశీ బొగ్గు దిగుమతిలో తేడాలు వస్తే చర వ్యయం పెరిగే వీలు కూడా ఉంది. ఇప్పటికే ఏపీ డిస్కమ్‌లు రూ. 4 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. వీటిని పూడ్చుకోవడానికి కొత్తగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. క్విడ్ ప్రో కో కోసం నామాకు దొడ్డిదారిన ప్రయోజనం చేకూర్చేందుకే ఈ ఒప్పందాలు జరిగినట్టు తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
జెన్‌కో ఉత్పత్తి నిలిపేసి...
డిమాండ్ లేదంటూ ఒక పక్క జెన్‌కో ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. 1600 మెగావాట్ల సామర్థ్యంగల కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో గత రెండు నెలలుగా ఒక యూనిట్‌లో తరచూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. కడపలోని ఆర్టీపీపీలో ప్రతీ రోజు మూడు యూనిట్లను బ్యాకిం గ్ డౌన్ చేస్తున్నారు. డిమాండే లేని పరిస్థితి ఒకపక్క, మిగులు విద్యుత్‌ను అమ్మలేని పరిస్థితి మరోపక్క ఉంటే... నామా సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక దోచిపెట్టడం తప్ప మరోటి లేదని అధికారులు విమర్శిస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 2లకే లభిస్తోంది. అవసరమైతే జెన్‌కో థర్మల్ ప్లాంట్లను కూడా తగ్గించి ఈ విద్యుత్‌ను తీసుకోవాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదించారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తన వారి ప్రయోజనం కోసం విద్యుత్ సంస్థలను నిండా ముంచేస్తోంది.