ట్రాన్స్‌కోలో 106 పోస్టులు | 106 Job Vacancies In Telangana TRANSCO | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 3:52 AM | Last Updated on Fri, Aug 10 2018 4:17 AM

106 Job Vacancies In Telangana TRANSCO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) 106 పోస్టుల భర్తీకి గురువారం నియామక ప్రకటన విడుదల చేసింది. 62 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్, 44 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ప్రథమ శ్రేణిలో బీకాం/ప్రథమ శ్రేణిలో ఎంకాం/సీఏ–ఐసీడబ్ల్యూఏ–ఇంటర్‌ పాసైన అభ్యర్థులు జేఏవో పోస్టుల కోసం అర్హులు. జేఏవో పోస్టులకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ పాసైన అభ్యర్థులు జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టు కోసం వచ్చే నెల 11 నుంచి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. పూర్తి వివరాలకు  http://tstransco.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement