మాచర్ల(గుంటూరు): ట్రాన్స్‌కో అధికారుల కారణంగా దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఇటీవలి ఈదురుగాలులకు దుర్గి మండలంలో చెట్లు కూలి, స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ అధికారులు రోజంతా కష్టపడి వాటన్నిటినీ సరిచేసి, ట్రాన్స్‌కోకు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే, ట్రాన్స్‌కో యంత్రాంగం స్పందించకపోవటంతో మండలంలోని నాలుగు సబ్‌స్టేషన్ల పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి కరెంట్ లేదు.
దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.