Current cut
-
రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంతో పాటు, పలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాప్రాలో అధికంగా 9 సెంటిమీటర్లు, మల్కాజ్‌గిరిలో 8సెంమీ, అంబర్‌పేటలో 2.5 సెంమీ వర్షపాతం నమోదైంది. అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, జక్రాన్ పల్లి, భీంగల్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఊరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. రాత్రి సమయంలో కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
పోస్టాఫీస్‌కు కరెంట్ కట్
గోదావరిఖనిటౌన్ (రామగుండం) : జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న గోదావరిఖని ప్రధాన పోస్టాఫీస్‌లో రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం యజమాని రెండు రోజుల క్రితం కరెంట్ కట్ చేశాడు. అద్దె ఒప్పందం ముగిసి మూడేళ్లు గడిచినా భవనం ఖాళీ చేయకపోవడంతో యజమాని కరెంటు సరఫరా నిలిపేశాడు. దీంతో కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారుల ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీనగర్‌లోని ప్రధాన పోస్టాఫీస్ కార్యాలయం ఉంది. రెండు రోజులుగా ఇందులో సేవలు నిలిచిపోయాయి. 15 ఏళ్లుగా దస్తగిరి కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో నెలకు రూ.11 వేల అద్దెతో ప్రధాన పోస్టాఫీస్ నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి పోస్టాఫీస్ మధ్య ఉన్న అద్దె ఒప్పందం మూడేళ్ల క్రితం ముగిసింది. దీంతో భవనం యజమాని ఫారుక్ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే స్థానికంగా వినియోగదారులకు అందుబాటులో మరో అద్దె భవనం దొరకకపోవడంతో ఖాళీ చేయలేదు. యజమాని సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రధాన పోస్టాఫీసులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వందలాది మంది పోస్టాఫీస్‌కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. రోజుకు రూ.లక్షల్లో నష్టం... పోస్టాఫీస్ సేవలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రోజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లుతోంది. కార్యాలయంలో ముఖ్యమైన సేవలు, డిపాజిట్లు, వడ్డీ స్వీకరణ, స్పీడ్ పోస్ట్‌లు, ఇతర 18 రకాల సేవలు స్తంభించాయి. వందలాది మంది నిత్యం నిర్వహించే కార్యకలాపాలు స్పీడ్ పోస్ట్, ఉత్తరాల పంపిణీ, రిజిస్టర్ పోస్ట్‌లు, రైల్వేటికెట్ బుకింగ్, ఆధార్ నమోదు, డిపాజిట్లు, వడ్డీ వితరణ, ఆన్లైన్ పోస్ట్, వెస్ట్రన్ మనీ ట్రాన్స్ఫర్ తదితర సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి.. పోస్టల్ నిబంధనల ప్రకారం భవనానికి రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు అద్దె చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ అద్దెకు స్థానికంగా మరొక భవనం దొరకక ఇదే భవనంలో ఉండాల్సి వస్తోందని పోస్ట్‌మాస్టర్ ఫజుర్ రహమాన్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న భవనాన్ని రూ.20 వేలలోపు అద్దెకు కేటాయించాలని అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. వారు స్పందించక పోవడంతో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రామగుండం మేయర్, సింగరేణి జీఎంకు కూడా వినతిపత్రాలు అందించామని వివరించారు. ఎవరూ స్పందించడం లేదని చెప్పారు. అధిక ఆదాయం ఉన్న పోస్టాఫీస్.. జిల్లాలో అత్యధికంగా 10 వేలకు పైగా ఖాతాదారులు ఉన్న పోస్టాఫీస్ గోదావరిఖని బ్రాంచ్ మాత్రమే. ఇందులో నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఈ పోస్టీఫీస్‌లో ప్రస్తుతం సేవలు నిలిపోవడంతో లక్షల రూపాయల నష్టం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నష్టం కలుగకుండా చూడాలి నిత్యం చాలా రకాల సేవలు పోస్టాఫీస్‌లో జరుగుతాయి. ఆకస్మికంగా విద్యుత్ కట్ చేసి సేవలు నిలిపి వేస్తే ప్రజలతోపాటు సంస్థ నష్టపోతుంది. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే కరెంట్ పునరుద్ధరించి నష్టం కలుగకుండా చూడాలి. పోస్టాఫీస్‌ను కూడా మరో భవనంలోకి మార్చేలా చొరవ తీసుకోవాలి. – ఫజుర్ రహమాన్, పోస్ట్‌మాస్టర్, గోదావరిఖని -
రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్
ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు కలపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు చోట్ల కరెంట్ కోతలు విధించనున్నారు. అదిలాబాద్ జిల్లాతో పాటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనురు, సిర్పుర్ మండలాలకు సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కరెంట్ కోతలు విధించనున్నారు. -
కరెంట్ కట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యుత్ కోతలు లేని సరఫరా ఒక సవాలుగా మారుతోంది. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కోతల సమస్యను అధిగమించామని ముఖ్యమంత్రి జయలలిత ఇటీవల అనేకసార్లు ప్రకటించారు. అయితే వారం రోజులుగా చెన్నై నగరంలో కరెంట్ కష్టాలు ప్రారంభం అయ్యాయి. విద్యుత్ కోతలా లేక సాంకేతిక లోపాలా అనేది అర్థం కాకుండా అడపాదడపా సరఫరా నిలిచిపోతోంది. చెన్నైలోని విద్యుత్ సేవా కేంద్రానికి రోజుకు వెయ్యి నుంచి 1500 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే విద్యుత్ సబ్స్టేషన్లకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మూడు రోజులుగా తిరువొత్తియూరు, ఏర్నావూరు, ఎన్నూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి 11.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఏదో ఒక సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. మొదటి రోజున పది నిమిషాలు క్రమేణా 35 నిమిషాల కోతగా పెరిగింది. తిరువొత్తియూర్, అంబేద్కర్ నగర్, సరస్వతీ నగర్, రాజాషణ్ముగం నగర్, షణ్ముగాపురం ఎక్స్టెన్షన్, తిరువొత్తియూరు పశ్చిమ ప్రాంతాల్లో రాత్రివేళ తరచూ విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అలాగే వలసరవాక్కం రామకృష్ణానగర్, కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో గత నెల 27వ తేదీ నుంచి అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. పులియంతోపు, వవూసీనగర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి 11 నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు తరచూ విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బహిరంగ ప్రదేశాల్లో నిద్రపోయారు. నగరంలోని ఇంకా మరెన్నో ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. కరెంటు కష్టాలకు కారణాలెన్నో మంచినీటి సరఫరా, రహదారులు, విద్యుత్ శాఖలతోపాటూ, ప్రైవేటు సంస్థల వారు తమ అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వుతున్న సందర్భంలో భూమిలో ఉన్న విద్యుత్ కేబుళ్లను ధ్వంసం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వరాదని చెన్నై కార్పొరేషన్ పెట్టిన నిబంధన లను ఎవ్వరూ పాటించడం లేదు. విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలిసేటట్లుగానే కొందరు కరెంటు వైర్లకు కొక్కీలు పెట్టి విద్యుత్ వాడుకుంటున్నారు. అక్రమ విద్యుత్‌ను అరికట్టేందుకు శాఖాపరంగా సరైన చర్యలు లేవు. నగరంలో ఎన్నికల ప్రచారాలు సాగుతుండగా బహిరంగ సభలకు కొక్కీల ద్వారా కరెంటును వాడుకుంటున్నా అడిగేవారు లేకుండా పోయారు. ఇబ్బందులు ఇక తలెత్తవు వేసవి కాలంలో ఓవర్‌లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖాధికారి ఒకరు చెప్పారు. ప్లస్ టూ, పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యేలోగా విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు పూర్తి చేస్తున్నామని అన్నారు. పరీక్షల ప్రారంభానికి మరో మూడురోజులే ఉన్నందున మరమ్మతు పనుల వేగం పెంచడం కోసం తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇటువంటి సమస్యలు తలెత్తవని హామీ ఇచ్చారు. -
విద్యుత్ మంత్రి మాట్లాడుతుంటే కరెంట్ కట్..!
చౌటుప్పల్ (నల్లగొండ): హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో గ్రీన్‌గ్రోవ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కరెంట్ కట్ అయింది. మైకు రాకపోవడంతో సౌండ్స్ ప్రాబ్లమ్ అనుకున్నారు, కానీ సౌండ్స్ బాగానే ఉన్నాయి, కరెంట్ కట్ అయిందని మంత్రికి చెప్పడంతో... ఏమయ్యా ఏఈ లేడా, విద్యుత్ మంత్రి వస్తే, కరెంట్ కట్ చేస్తారయ్యా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల యాజమాన్యం జనరేటర్ స్టార్ట్ చేయడంతో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. -
గుంటూరు జిల్లాలో అంధకారంలో 20 గ్రామాలు
మాచర్ల(గుంటూరు): ట్రాన్స్‌కో అధికారుల కారణంగా దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా బంద్ అయింది. ఇటీవలి ఈదురుగాలులకు దుర్గి మండలంలో చెట్లు కూలి, స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. విద్యుత్ అధికారులు రోజంతా కష్టపడి వాటన్నిటినీ సరిచేసి, ట్రాన్స్‌కోకు క్లియరెన్స్ ఇచ్చారు. అయితే, ట్రాన్స్‌కో యంత్రాంగం స్పందించకపోవటంతో మండలంలోని నాలుగు సబ్స్టేషన్ల పరిధిలోని దాదాపు 20 గ్రామాల్లో బుధవారం సాయంత్రం నుంచి కరెంట్ లేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. -
సీఎం వస్తున్నారని విద్యుత్ కట్!
ప్రజల ఆందోళన.. ఎట్టకేలకు పునరుద్ధరణ నరసన్నపేట : సాధారణంగా సీఎం స్థాయి నాయకులు వస్తున్నారంటే.. వారు పర్యటించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు జాగ్రత్త పడటం పరిపాటి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు సందర్శించనున్న నరసన్నపేటలోని ఇందిరానగర్ కాలనీకి ట్రాన్స్‌కో సిబ్బంది కరెంటు లేకుండా చేశారు. శనివారం నరసన్నపేట ప్రాంతంలో పర్యటించనున్న చంద్రబాబు స్మార్ట్ వార్డుగా గుర్తించిన స్థానిక ఇందిరానగర్ కాలనీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వస్తున్నారు. దాంతో సీఎం కాన్వాయ్కి అడ్డుగా ఉన్నాయని చెప్పి కాలనీలోని పలు ఇళ్ల విద్యుత్ సర్వీస్ వైర్లను ట్రాన్స్‌కో సిబ్బంది కట్ చేసి పారేశారు. ఎటువంటి సమాచారం లేకుండా వైర్లు కట్ చేయడంతో కాలనీ ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారని ఎం.రాఘవ, రాజేంద్ర, గడ్డెయ్యలు తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. కనీసం ముందు తెలియజేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనే వారమని అన్నారు. విద్యుత్ లేకపోవడంతో బావుల నుంచి నీరు తోడుకోవాల్సి వస్తోందని వాపోయారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ప్రశ్నించారు. అంతే కాదు కాలనీ వాసులు ఆందోళనకు సిద్ధపడగా రాత్రి 9 గంటల సమయంలో సిబ్బంది వచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీనిపై ట్రాన్స్‌కో ఏఈ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాల మేరకు 8 ఇళ్ల వైర్లు కట్ చేశామని అన్నారు. -
అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్‌సింగ్, జితేంద్ర సింగ్, మహమ్మద్ అజహరుద్దీన్ నివాసాలు కూడా ఉన్నాయి. అధికారిక నివాసాలను ఖాళీచేయాలని వారికి అనేకసార్లు విన్నవించినా, తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్, నీటి నిలిపివేత తర్వాత కొందరు ఖాళీచేశారని అయితే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి లోక్‌సభ హౌసింగ్ కమిటీకి కూడా నివేదిక సమర్పించామని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్లమెంటు సభ్యులు తమ క్వార్టర్లను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాలుగోతేదీ లోపు ఇళ్లు ఖాళీచేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు స్పందించని వారి నివాసాలకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలిపివేశారు. -
కరెంటెప్పుడత్తదో..
మంత్రికీ కరెంటు తిప్పలు మంత్రి కేటీఆర్ గురువారం గంభీరావుపేట మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొనగా రెండున్నర గంటల సమయంలో ఆరుసార్లు కరెంట్ వచ్చిపోయింది. ప్రజాప్రతినిధులు ఇచ్చిన అర్జీలను మంత్రి సెల్‌ఫోన్ టార్చిలైట్ల వెలుతురులో ఇలా పరిశీలించారు. ►ఇక రోజూ ఎదురుసూసుడే ►మిలియన్ యూనిట్ల కొరత ►జిల్లాలో పెరిగిన కరెంటు కోత ►పల్లెల్లో పొద్దంతా సరఫరా బంద్ ►ఎండుతున్న పంటలతో రైతుల ఆందోళన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరెంటు కోత వణుకు పుట్టిస్తోంది. పల్లెల్లో పట్టపగలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో పగటిపూట విద్యుత్‌పై ఆధారపడి జీవనం సాగించే చిన్న వ్యాపారాలు, దుకాణాలన్నీ మూతపడ్డాయి. వర్షాభావ పరిస్థితులు.. ఎండాకాలంలా మండుతున్న వాతావరణానికి తోడుగా మితిమీరిన కరెంటు కోతలు అన్నదాతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతలు తప్పవని సర్కారు పదేపదే చెబుతున్నప్పటికీ ఖరీఫ్ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిక్కుతోచక విద్యుత్ సిబ్బందిపై తమ ఆగ్రహాందోళనలు వ్యక్తపరుస్తున్నారు. కరెంటు కోతలకు నిరసనగా గురువారం కమలాపూర్ మండలం ఉప్పల్‌లో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ట్రాన్స్‌కో సిబ్బందిని నిర్భంధించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కరెంటు కోతలు ఎత్తివేయాలని, తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ మండలంలోని వెంకట్రాంపల్లి గ్రామ రైతులు చెక్కపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మెట్పల్లి మండలంలోని వెంకట్రావుపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రోజురోజుకు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అవసరానికి తగినంత విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రోజుకు మొత్తం 12 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. ఉత్పత్తిలో కొరత కారణంగా ప్రస్తుత వ్యవసాయ సీజన్ పూర్తయ్యే వరకు విద్యుత్ కోతలు తప్పవని ఆ శాఖ ఎస్ఈ నారాయణ అభిప్రాయపడ్డారు. గృహావసరాల కంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని తమకు ఆదేశాలున్నాయని.. అందుకే విద్యుత్ సరఫరా వేళలు ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి అన్ని కేటగిరీలకు కరెంటు కోత సమయాన్ని పెంచారు. జిల్లా కేంద్రంలో రోజుకు ఏడు గంటల పాటు కోత విధిస్తున్నారు. ఉదయం 5 నుంచి 8 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మున్సిపాలిటీలు, మండలకేంద్రా లు, సబ్స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో 9 గంటల కోతను అమలుచేస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొద్దంతా కరెంటు ఉండడం లేదు. దీంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భరించలేని ఉక్కపోత మరోవైపు విద్యుత్ కోతతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారికంగా వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెబుతున్న సర్కారు... లోటు విద్యుత్‌ను సర్దుబాటు చేసేందుకు అనధికారికంగా కోతలు విధిస్తోంది. అన్ని జిల్లాల్లో వ్యవసాయానికి నాలుగు అయిదు గంటలకు మించి సరఫరా చేయటం లేదు. లోడ్ రిలీఫ్ పేరుతో విద్యుత్‌శాఖ రైతులతో చెలగాటమాడుతోంది. ఇచ్చే కాసింత వ్యవధిలోనూ తరచూ ట్రిఫ్ అవడం, లోవోల్టేజీనే. చీటికి మాటికి కరెంటు వచ్చి పోతుండటంతోపాటు లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, పంపుసెట్లు, మోటార్లు కాలిపోతున్నాయి. దీంతో రైతులకు అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో గత నెలలో సగటున రోజుకు 30 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మరోవైపు నిర్ణీత వేళాపాళాలు లేకపోవటం రైతుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, అర్ధరాత్రి వేళల్లో సరఫరా చేయడంతో రాత్రంతా పొలం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ చీకట్లో వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు విషపురుగుల బారిన పడి ప్రమాదాలకు గురవుతున్నారు. తెగిపడిన విద్యుత్ లైన్లు, ప్యూజులు తగిలి షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 16 మంది రైతులు విద్యుత్ షాక్‌తో చనిపోయారు. -
కరెంట్ కట్
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఉద్యోగులు ఆదివారం ఉదయం నుంచి సమ్మె బాట పట్టారు. ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయనందుకు నిరసనగా ఉదయం 6 గంటల నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగారు. జిల్లాలోని దాదాపు అన్ని సబ్స్టేషన్లలో ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డీఎస్ వరప్రసాద్, కో-కన్వీనర్ భూక్యా నాగేశ్వరావు, కన్వీనర్ సుబ్బారావుల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏలూరువిద్యుత్ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్థానిక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం గేట్లు మూసి వేశారు. యాజమాన్యం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతన సవరణ చేయాలని, తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. అంతవరకూ ఆందోళన విరమించేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించాల్సిందిగా పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీంతో ఎస్ఈ మద్దతు ప్రకటించారు. సమ్మెలోకి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు ఈపీడీసీఎల్ జిల్లా పరిధిలో 2,400 మంది శాశ్వత, తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. వీరిలో అటెండర్‌స్థాయి నుంచి డివిజనల్ ఇంజినీర్ స్థాయి వరకు వివిధ కేటగిరీల్లో వారు పనిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా, పర్యవేక్షణ, సబ్స్టేషన్ల నిర్మా ణం, పరిపాలన, అకౌంట్స్, కొనుగోళ్లు, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి విధులను వీరు నిర్వర్తిస్తుంటారు. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా సమ్మె బాట పట్టారు. అనధికారికంగా విద్యుత్ సరఫరా జిల్లాలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 196 ఉన్నాయి. వీటిలో 152 ప్రైవేట్ కాంట్రాక్టర్ల నిర్వహణలో, 44 సబ్స్టేషన్లు ఈపీడీసీఎల్ ఉద్యోగుల నిర్వహణలోనూ ఉన్నాయి. ఆదివారం ఉదయం కొన్ని సబ్స్టేషన్లను ఉద్యోగులు షట్‌డౌన్ చేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సిబ్బంది సమ్మెలోనే కొనసాగుతూనే విద్యుత్‌ను పునరుద్ధరించారు. మరోవైపు కాంట్రాక్టు సిబ్బంది ఇంకా సమ్మెలోకి వెళ్లకపోవడంతో వారి నిర్వహణలో ఉన్న సబ్స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోంది. అయితే సమ్మె కారణాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు కూడా ఉండటంతో వారు సైతం విధులు బహిష్కరించే అవకాశం ఉంది. కరెంట్ కట్‌తో ప్రజల అవస్థలు ఉదయం ఆరు గంటల నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. గ్రామాల్లో ఉదయం రక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోయింది.ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో కొనసాగుతూనే మధ్యాహ్నం 1 గంటకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుత్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళితే జిల్లాలో అంధకారం అలుముకునే పరిస్థితి ఉంది. మండే ఎండలకు తోడు ఎడాపెడా విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలను విద్యుత్ ఉద్యోగుల సమ్మె కలవరపెడుతోంది. సమ్మె కొనసాగితే.. సమ్మెకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులకు, విద్యుత్ జేఏసీ నేతల మధ్య ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. అవి ఫలప్రదమయితే ఏ క్షణాన అయినా సమ్మె విరమించే అవకాశం ఉంది. ఒక వేళ సమ్మె కొనసాగితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది కూడా సమ్మెలో దిగితే జిల్లా మొత్తం చీకటిగా మారనుంది. అయితే అత్యవసర సేవలైన ఆస్పత్రులు, తాగునీటి సరఫరా విభాగాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసే అవకాశం ఉంది. -
అన్నీ కోతలే
ఇక రోజూ కరెంట్ కట్.. చేతులెత్తేసిన మంత్రి డీకే శివకుమార్ వారం క్రితం కోతలు ఉండబోవని స్పష్టీకరణ నేడు సాంకేతిక సమస్యల సాకుతో కోతలు సోమవారం నుంచే అమల్లోకి = రెండు నెలల పాటు ఇంతే సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉన్నందున ఈ వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని వారం కిందట సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చేసిన ప్రకటన ఉత్తుత్తిగా తేలిపోయింది. విద్యుదుత్పాదన తగ్గడంతో పాటు రెండు యూనిట్లలో ఉత్పాదన స్తంభించినందున కోతలు విధించక తప్పడం లేదని సోమవారం ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోతలు ఉంటాయని తెలిపారు. సోమవారం నుంచే కోతలుంటాయన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రోజుకు 8,522 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదన్నారు. అయితే రాయచూరు, ఉడిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని రెండు యూనిట్లు పని చేయడంలేదన్నారు. చక్కెర తయారీ కర్మాగారాల నుంచి అందాల్సిన 650 మెగావాట్ల విద్యుత్ కొన్ని న్యాయ పరమైన సమస్యల వల్ల అందడం లేదన్నారు. దీని వల్ల రాష్ట్రంలో రోజుకు 7,572 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందన్నారు. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నందు వల్లే బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కోతలు అమలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రెండు నెలల పాటు కోతలు అమలవుతాయన్నారు. కోత వేళలను ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు (ఎస్కాంలు) నిర్ణయిస్తాయన్నారు. గత ప్రభుత్వం 15,944 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, దీనికి అవసరమైన భూమి, నీటితో పాటు పలు రాయితీలు కల్పించిందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ 4,400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు పొంది విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాల్లో కొన్నింటిని రద్దు చేశామని, మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ లాభాపేక్షతో విద్యుత్‌ను పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు, ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు. - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి 2012 తేదీ గరిష్టం కనిష్టం 15 33 25 16 35 27 17 37 29 18 39 30 19 36 29 2013 15 35 27 16 34 30 17 38 30 18 38 30 19 37 28 2014 15 37 28 16 37 27 17 37 29 18 36 20 19 37 29 -
వంద గ్రామాలకు కరెంట్ కట్
14 సబ్స్టేషన్ల పరిధిలో అంధకారం వర్షం మిగిల్చిన నష్టం రూ.14.43 కోట్లు హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైంది. 14 సబ్స్టేషన్ల పరిధిలోని గ్రామాలన్నీ బుధవారం రాత్రి వరకూ అంధకారంలోనే మగ్గుతున్నాయి. మొత్తం 28 సబ్స్టేషన్లు వర్షం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా చేసే డీటీఆర్లు వర్షం నీటితో కాలిపోయాయి. ప్రధాన లైన్లల్లో కండక్టర్ వైరు ఎక్కడికక్కడే తెగిపోయింది. దీంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.14.43 కోట్ల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కోసం రూ.8 కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు తండా వద్ద ట్రాన్స్‌కో నుంచి వచ్చే 222 కేవీ లైను తెగిపోయింది. దీం తో కొన్ని గంటల పాటు జిల్లాకు సరఫరా ఆగిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో ఫీడర్పై సరఫరాను పునరుద్ధరించారు. బుధవారం రాత్రి వరకు 14 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కానీ... మరో 14 సబ్‌స్టే షన్ల పరిధిలో మరమ్మతులు ముందుకు సాగడం లేదు. తీగరాజుపల్లి, సంగెం, చౌటపల్లి, ఏనుగల్లు, పర్వతగిరి, ద్వారకపేట, కూనూర్, వెంకటాపూర్, రెడ్లవాడ, అలంకానిపేట, లింగగిరి, ఉప్పరపల్లి, గూడూర్, నెక్కొండ సబ్స్టేషన్లలో బుధవారం రా త్రి వరకూ మరమ్మతులు పూర్తి కాలేదు. రాత్రి కావడంతో వి ద్యుత్ పనులు నిలిపివేశారు. దీంతో ఈ సబ్స్టేషన్ల పరిధిలో సుమారు 100కుపైగా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. నేలకూలిన స్తంభాలు జిల్లాలో ప్రధాన లైన్ ఈసారి దెబ్బతిన్నది. 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోయింది. సబ్స్టేషన్ల నుంచి ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా చేసే ఈ లైను తెగిపోవడంతో సరఫరా పునరుద్ధరణ కష్టంగా మారింది. అదే విధంగా 28 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వీటిలో అత్యవసరంగా 9 డీటీఆర్ (ట్రాన్స్ఫార్మర్ల)ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. 11కేవీ లైన్ల పరిధిలో 44 పెద్ద విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వీటి పునరుద్ధరణకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో విద్యుత్ సరఫరా చేసే ఎల్టీ లైన్ల పరిధిలో 1059 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీటి స్థానంలో కొత్త స్తంభాలు వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్తంభాలు అనుకున్న సమయంలో రాకపోవడంతో లైన్లు కూడా పునరుద్ధరించడం లేదు. 11కేవీ స్తంభాలతో రూ.88 వేలు, ఎల్టీ లైన్ల పరిధిలో 1059 స్తంభాలు నేలకూలడంతో రూ.16.94 లక్షలు, 28 సబ్స్టేషన్లు తీవ్రంగా దెబ్బతినడంతో రూ.14 కోట్లు, 28 డీటీఆర్ ట్రాన్స్పార్మర్లు కాలిపోవడంతో రూ.13.50 లక్షలు, 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోవడంతో రూ.11 లక్షల నష్టం వాటిలినట్లుగా అంచనా వేశారు. -
పల్లెల్లో ‘బిల్లు’ భూతాలు
ఏళ్లనాటి బకాయిలు చెల్లించమంటూ రైతులకు వేధింపులు రూ.800 కోట్లకు పైగా వసూలుకు ప్రభుత్వం టార్గెట్ రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేయరాదనే నిబంధన బేఖాతరు వ్యవసాయ కనెక్షన్ సర్వీసు చార్జీ బకాయిలు పడితే ఇళ్లకూ కరెంటు కట్ గ్రామం మొత్తానికి సరఫరా నిలిపివేస్తుండటంతో రోజుల తరబడి చీకట్లో పల్లెలు హైదరాబాద్, సాక్షి: వ్యవసాయ కనెక్షన్‌కు సంబంధించి రైతులు బకాయి పడితే ఇంటికి కరెంటు కట్ చేయవద్దని ఈఆర్సీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ బకాయిల పేరుతో ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే ఇంధనరంగంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఈఆర్సీ మాటలనూ విద్యుత్ సంస్థలు ఖాతరు చేయడం లేదు. కేవలం వ్యవసాయ కనెక్షన్, ఇంటికే కాదు.. ఏకంగా ఆ ఊరికే కరెంటు సరఫరా నిలిపివేస్తున్నాయి. దీంతో ఆయూ గ్రామాల్లోని వ్యవసాయ కనెక్షన్లతో పాటు ఇళ్లకూ, తాగునీటికీ, వీధి దీపాలకూ సరఫరా నిలిచిపోతోంది. కేవలం బకాయి ఉన్న గ్రామానికి మాత్రమే సరఫరా నిలిచి పోవడం లేదు. సబ్‌స్టేషన్ పరిధిలోని ఒక ఫీడర్ కింద ఒక్క బకాయిలు చెల్లించని గ్రామమే కాకుండా ఆ ఫీడర్ కింద ఉన్న గ్రామాలన్నీ చీకట్లో మగ్గాల్సి వస్తోంది. కరెంటు లేక రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటలతో పాటు రబీ నారు కూడా ఎండిపోతోంది. 2004 నుంచీ కట్టాలంట..! రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారు. ఒక్కో ఉచిత కనెక్షన్‌కూ సర్వీసు చార్జీ రూపంలో రూ.20 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే వైఎస్ ప్రభుత్వం రైతుల నుంచి ఏనాడూ ఈ మొత్తాన్ని వసూలు చేయలేదు. 2011 ఏప్రిల్ నుంచి ఈ సర్వీసు చార్జీని రూ.30కి పెంచారు. తాజాగా సర్వీసు చార్జీలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ప్రభుత్వం రైతుల ఉంచి పాత బకాయిలు వసూలు చేయూలని నిర్ణయించింది. ఏకంగా 2004 నుంచి ఇప్పటివరకు అయిన మొత్తాన్ని లెక్కగట్టి రైతుల్ని కట్టమంటోంది. ఇంటికి ఇచ్చే విద్యుత్ బిల్లులోనే దీనిని జమచేసి ఇస్తున్నారు. లేదంటే ప్రత్యేకంగా బిల్లులను జారీ చేస్తున్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు నెలకు రూ.20 చొప్పున ఏడాదికి రూ.240 అవుతుంది. 2004 ఏప్రిల్ నుంచి 2011 మార్చి వరకు ఏడాదికి రూ.240 చొప్పున ఏడేళ్లకు రూ.1680 అవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 30 లక్షల కనెక్షన్లకు లెక్కిస్తే ఈ మొత్తం రూ.504 కోట్లు అవుతోంది. ఇక 2011 ఏప్రిల్ నుంచి నెలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే 2014 డిసెంబర్ వరకు లెక్కిస్తే మొత్తం 33 నెలలకుగానూ నెలకు రూ.30 చొప్పున రూ.990 అవుతుంది. 30 లక్షల కనెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటే రూ. 297 కోట్లు అవుతుంది. అంటే రైతాంగంపై మొత్తం రూ.801 కోట్ల భారం వేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసిందన్నమాట. ఈ మేరకు విద్యుత్ సంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నారుు. ఒక్కో రైతుపై 2004 ఏప్రిల్ నుంచి లెక్కిస్తే మొత్తం పదేళ్లకు గాను పడుతున్న అదనపు భారం మొత్తం రూ.2670 అన్నమాట. విద్యుత్ చట్టం ఏమంటోందంటే.. విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 56 క్లాజ్ 2 వినియోగదారులకు రక్షణ కల్పిస్తోంది. ‘ఏదైనా వినియోగదారునికి బకాయి విషయాన్ని రెండేళ్లలోపుగా తెలియజేసి వాటిని వసూలు చేసుకునే అవకాశం విద్యుత్ సంస్థలకు ఉంది. అరుుతే సమయం మించిపోతే వసూలు చేయకూడదు. వినియోగదారునికి విద్యుత్ సరఫరాను నిలిపివేయకూడదు’ అని ఈ క్లాజ్ పేర్కొంటోంది. ఒకవేళ దీనికి భిన్నంగా ఇదే చట్టంలో ఎక్కడైనా పేర్కొన్నప్పటికీ.. అంతిమంగా సెక్షన్ 56 క్లాజ్ 2నే వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు తాము బకాయి ఉన్న విషయం ఇప్పటివరకూ తెలియదు. ఇటీవలి కాలం వరకు కరెంటు బిల్లులు జారీ చేయలేదు. కాబట్టి రెండేళ్లకు మించిన బకాయిలు వసూలు చేసేందుకు వీల్లేదు. ఈసారి వర్షాలు బాగా పడ్డాయని వరి పంట కోసం (రబీ) నారు పోసుకున్నా. కానీ ఊళ్లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలేవో కట్టలేదంట. మొత్తం ఊరికి కరెంటు నిలిపేశారు. కరెంటు లేక వరినారు ఎండిపోయింది. - పెద్దోళ్ల నరసింహులు, గుంటిపల్లి, వర్గల్ మండలం (మెదక్ జిల్లా) వరినారు కోసం పొలం దున్ని విత్తనాలేశా. ఇంతలోనే కరెంటు బందయింది. ఏంటని అడిగితే సర్వీసు చార్జీ బకాయిలున్నాయన్నారు. 3 రోజులు కరెంటు లేక విత్తనాలు పాడైపోయాయి - శ్రీనివాస్, గొట్టిముక్కల, వికారాబాద్ మండలం (రంగారెడ్డి జిల్లా) -
కలెక్టరేట్‌కు చీ‘కట్’లు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్‌లో అంధకారం అలుముకుంది. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలను చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రెండున్నరేళ్ల కాలంలో కలెక్టరేట్‌కు కరెంట్ కట్ చేయడం ఇది మూడోసారి. అయినప్పటికీ ఆయా శాఖల అధికారులు బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కలెక్టరేట్ లో 42 కార్యాలయాలున్నాయి. వీటన్నింటికి ఒకే సర్వీస్ ద్వారా విద్యుత్ సర ఫరా జరుగుతోంది. దీంతో బిల్లుల బకాయిలు ఇప్పటివరకు రూ.3.87కోట్లకు చేరుకున్నాయి. బిల్లులు చెల్లించే సమయానికి ఆయా శాఖల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో గత ఏడాది అన్ని కార్యాలయాలకు ప్రత్యేక మీటర్లు అమర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని శాఖలు ప్రత్యేక మీటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినా.. మిగిలిన శాఖల నుంచి స్పందన కరువైంది. దీంతో ప్రత్యేక మీటర్ల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత బకాయిలు రూ.3.87 కోట్లు ఉండడంతో ట్రాన్స్‌కో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కలెక్టరేట్‌కు కరెంట్ కట్ చేశారు. కలెక్టరేట్‌కు ప్రతి నెల సుమారు రూ.12లక్షల విద్యుత్ బిల్లు వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచివేశారు. ప్రత్యేక అవసరాల నిమిత్తం కలెక్టర్ చాంబర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయం, డీఆర్వో కార్యాలయాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. స్తంభించిన కార్యకలాపాలు విద్యుత్ సరఫరా లేకపోవడంతో కలెక్టరేట్లో ఉన్న వివిధ శాఖల్లో విద్యుత్ సరఫరా లేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వివిధ అవసరాల నిమిత్తం జిల్లా వచ్చిన ప్రజలు త్రీవ ఇబ్బందులకు గురయ్యారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా చీకట్లోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. అయినా కూడా అధికారుల్లో చలనం రాలేదు. సాయంత్రం వరకు కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోలేదు. రాత్రి వేళలో కలెక్టరేట్ ప్రాంగణమంతా అంధకారంగా కనిపించింది. -
నేడు, రేపు బ్యాంకులుబంద్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఈ నెల 19 నుంచి 30వ తేదీ వరకు రోజుకో విధంగా ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గురు,శుక్రవారాల్లో జిల్లాలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలను దిగ్బంధం చేయనున్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలను స్తంభింప చేసి సహకరించాలని ఇప్పటికే ఎన్జీవోలు ఆయా సంఘాల నాయకులతో చర్చించారు. దీనికి వారు కూడా అంగీకరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు రోజులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేయకూడదని ఉద్యోగ సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ విధంగా యూపీఏపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నాయి. రెండు రోజులూ బ్యాంకుల సేవలను కూడా అడ్డుకోవాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. దీం తో జిల్లాలోని 320 బ్యాంకుల శాఖలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా రూ.600 కోట్లు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. 21న రెండు గంటల పాటు విద్యుత్ నిలిపివేత ఈ నెల 21న జిల్లా అంతటా రెసిడెన్షియల్‌తో పాటు వాణిజ్య సంస్థలకు కూడా సాయంత్రం 6 నుంచి 8 వరకు విద్యుత్‌ను నిలిపివేయాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించారు. స్వచ్ఛందంగా ఈ నిరసనను పాటించాలని సూచిస్తున్నారు. ఈ నెల 24న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. అదే రోజు ఉద్యోగులందరూ జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించనున్నారు. అప్పుడు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ప్రైవేటు స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చారు.