జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్‌లో అంధకారం అలుముకుంది. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలను చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు శుక్రవారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రెండున్నరేళ్ల కాలంలో కలెక్టరేట్‌కు కరెంట్ కట్ చేయడం ఇది మూడోసారి. అయినప్పటికీ ఆయా శాఖల అధికారులు బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కలెక్టరేట్ లో 42 కార్యాలయాలున్నాయి. వీటన్నింటికి ఒకే సర్వీస్ ద్వారా విద్యుత్ సర ఫరా జరుగుతోంది. దీంతో బిల్లుల బకాయిలు ఇప్పటివరకు రూ.3.87కోట్లకు చేరుకున్నాయి. బిల్లులు చెల్లించే సమయానికి ఆయా శాఖల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో గత ఏడాది అన్ని కార్యాలయాలకు ప్రత్యేక మీటర్లు అమర్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని శాఖలు ప్రత్యేక మీటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినా.. మిగిలిన శాఖల నుంచి స్పందన కరువైంది. దీంతో ప్రత్యేక మీటర్ల ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత బకాయిలు రూ.3.87 కోట్లు ఉండడంతో ట్రాన్స్‌కో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కలెక్టరేట్‌కు కరెంట్ కట్ చేశారు. కలెక్టరేట్‌కు ప్రతి నెల సుమారు రూ.12లక్షల విద్యుత్ బిల్లు వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచివేశారు. ప్రత్యేక అవసరాల నిమిత్తం కలెక్టర్ చాంబర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయం, డీఆర్వో కార్యాలయాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
స్తంభించిన కార్యకలాపాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో కలెక్టరేట్‌లో ఉన్న వివిధ శాఖల్లో విద్యుత్ సరఫరా లేక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వివిధ అవసరాల నిమిత్తం జిల్లా వచ్చిన ప్రజలు త్రీవ ఇబ్బందులకు గురయ్యారు. ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా చీకట్లోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపురించింది. అయినా కూడా అధికారుల్లో చలనం రాలేదు. సాయంత్రం వరకు కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించుకోలేదు. రాత్రి వేళలో కలెక్టరేట్ ప్రాంగణమంతా అంధకారంగా కనిపించింది.
కలెక్టరేట్‌కు చీ‘కట్’లు
Published Sat, Sep 21 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement
Advertisement