
సాక్షి, హైదరాబాద్ : నగరంతో పాటు, పలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాప్రాలో అధికంగా 9 సెంటిమీటర్లు, మల్కాజ్‌గిరిలో 8సెంమీ, అంబర్‌పేటలో 2.5 సెంమీ వర్షపాతం నమోదైంది.
అంతేకాక నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి, జక్రాన్ పల్లి, భీంగల్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఊరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలింది. రాత్రి సమయంలో కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment