చౌటుప్పల్ (నల్లగొండ): హరితహారం సభలో తాను ప్రసంగిస్తున్న సమయంలో కరెంట్ కట్ కావడంతో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో గ్రీన్‌గ్రోవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అనంతరం ఆయన ప్రసంగం మొదలు పెట్టిన కొద్దిసేపటికే కరెంట్ కట్ అయింది. మైకు రాకపోవడంతో సౌండ్స్ ప్రాబ్లమ్ అనుకున్నారు, కానీ సౌండ్స్ బాగానే ఉన్నాయి, కరెంట్ కట్ అయిందని మంత్రికి చెప్పడంతో... ఏమయ్యా ఏఈ లేడా, విద్యుత్ మంత్రి వస్తే, కరెంట్ కట్ చేస్తారయ్యా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల యాజమాన్యం జనరేటర్ స్టార్ట్ చేయడంతో ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
విద్యుత్ మంత్రి మాట్లాడుతుంటే కరెంట్ కట్..!
Published Sun, Jul 5 2015 9:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement