సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం(నవంబర్ 12) జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారు.కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు.నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు.ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది.రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలి.
కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ పిలుపు ఇవ్వలేదు.కొడంగల్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ అనడంలో ఆశ్చర్యం లేదు. 25సార్లు సీఎం రేవంత్ ఢీల్లి వెళ్లి ఎవరి కాళ్ళు మొక్కారో ప్రజలకు తెలుసు. ఉదయం రాహుల్ గాంధీ,కె.సి.వేణుగోపాల్ రాత్రి మోదీ,అమిత్ షా కాళ్ళు రేవంత్‌రెడ్డి పట్టుకుంటున్నారు.
కేటీఆర్ ఢీల్లికి వెళ్ళింది కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికే.మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నుంచి రూ. 300 కోట్లు పంపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులిచ్చినా సమాధానమిస్తారు’అని జగదీష్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్..మోదీ ఏం చేస్తున్నారు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment