సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.
కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.
సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్‌తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది.
కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం
Comments
Please login to add a commentAdd a comment