విద్యుత్ చౌర్యంపై కొరడా
నివారణ కోసం కొన్ని విభాగాల దృష్టి
ఈ ఏడాది 352 కేసుల నమోదు
రూ.3.60 కోట్ల అపరాధ రుసుము వసూలు
సీతానగరం :జిల్లాలో విద్యుత్ చౌర్యం నానాటికీ పెరుగుతోంది. విద్యుత్ చౌర్యానికి పాల్పడేది కూడా ఎక్కువగా బ డాబాబులే. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు సీరియస్‌గా దృష్టి సారించి, కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఏడాది కాలంలోనే జిల్లాలో నాలుగు అంకెలకు ఈ కేసులు చేరుతున్నాయి. విద్యుత్ చోరులపై విధించిన అపరాధ రుసుం రూపేణా జిల్లాలో రూ.50 లక్షలకు పైగా ట్రాన్స్‌కోకు రావలసి ఉంది. అయితే కేసుదారులు కోర్టులను ఆశ్రయించడంతో అవి పెండింగ్‌లో ఉన్నాయి.
విద్యుత్ చౌర్యం ఇలా
జిల్లాలో విద్యుత్ చౌర్యం పలు విధాలుగా జరుగుతోంది. మీటరు నుంచి, మీటరు లేకుండా నేరుగా కూడా చోరీ జరుగుతోంది. తక్కువ లోడ్‌కు కనెక్షన్ తీసుకుని ఎక్కువ లోడు విద్యుత్ వాడకం, కేటగిరి ఒన్ సర్వీసులు కేటగిరి టుకు వాడడం ద్వారా వినియోగదారులు విద్యుత్‌ను చోరీ చేస్తున్నారు. దీనికితోడు బ్యాక్ బిల్లింగ్ వంటి విధానాలతో విద్యుత్ చౌర్యం జరుగుతోంది. మిల్లులు, చిన్న తరహా పరిశ్రమలు, బ డా వ్యాపారులు విద్యుత్ చోరీకి పాల్పడుతున్నారు. సామాన్యులు తమ కరెంట్ బిల్లులను సక్రమంగా చెల్లిస్తున్నా, బిల్లులు అధికంగా రావడం వంటి పలు తప్పిదాలు జరుగుతున్నాయి.చౌర్యం నివారణకు చర్యలు విద్యుత్ చౌర్యాన్ని నిరోధించడానికి ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొన్ని విభాగాలు పనిచేస్తున్నాయి. విజిలెన్స్ , ఆపరేషన్ వంటి విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. దాడులు చేసి, దొరికిని వారిపై యాంటీ పవర్ థెఫ్ట్ కేసులు నమోదు చేస్తున్నాయి.