వీధిలోకొచ్చి ఓ సైకో భర్త వీరంగం
కోకాపేటలో ఇల్లాలి దారుణ హత్య
ఠాణాలో లొంగిపోయిన నిందితుడు
మణికొండ: ‘నా భార్యను చంపేశాను.. పీడ విరగడైంది’.. అంటూ ఓ సైకో భర్త వీధిలో వీరంగం సృష్టించి పైశాచిక ఆనందం పొందాడు. శుక్రవారం నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోకాపేటలో ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం శాయినిపేటకు చెందిన సునీత, ఇదే గ్రామం పక్కన ఉన్న దౌరుడిపల్లికి చెందిన ముత్యాలు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు. కోకాపేటలో హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. ముత్యాలు తరచూ భార్యను కొడుతుండేవాడు. డబ్బులు కావాలని వేధించేవాడు.
ఈ క్రమంలో పలుమార్లు ఇరు కుంటుంబాల మధ్య పంచాయితీలు నడిచాయి. ‘ఎప్పటికైనా నిన్ను చంపుతా’ అని భార్య సునీతను ముత్యాలు బెదిరించేవాడు. గతంలో సునీత ఆరు నెలల పాటు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందింది. రెండు రోజుల క్రితం మృతురాలి బంధువు ఆంజనేయ స్వామి మాల వేయటంతో పూజకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు శుక్రవారం ఇంట్లో గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ముత్యాలు భార్య గొంతు నులిమి, మర్మాయవాల్లో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు.
కాగా.. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీతను రెండో వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి.. ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. ‘నా భార్యను చంపాను’ అంటూ అరుస్తూ నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.
రహదారిపై రక్తచరిత్ర
Comments
Please login to add a commentAdd a comment