న్యూఢిల్లీ: ప్రకటనల కోసం ప్రధాని మోదీ ఫొటోలను వినియోగించేందుకు అనుమతి కోరిన వారి వివరాలను బహిర్గతం చేయలేమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎం వో) స్పష్టం చేసింది. మోదీ చిత్రాలను వినియోగించుకునేందుకు అనుమతి కోరు తూ కంపెనీలు, ట్రస్టులు, వ్యక్తులు దాఖలు చేసిన దరఖాస్తుల వివరాలను, అనుమతి లేదా తిరస్కరణకు సంబంధించిన కాపీల ను ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చింది.
ప్రకటనల కోసం మోదీ ఫొటోల అనుమ తికి రిలయన్స్ జియో, పేటీఎం విజ్ఞప్తి చేసినట్లుగా తమ వద్ద ఎలాంటి రికార్డు లేదంది.
జియో, పేటీఎం.. మోదీ ఫొటోలు అడగలేదు
Published Mon, May 8 2017 1:04 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
Advertisement
Advertisement