క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం | Reliance Jio, PayTm apologise for using PM Narendra Modi's picture in ads without permission | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం

Published Fri, Mar 10 2017 5:39 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం - Sakshi

క్షమాపణ చెప్పిన రిలయన్స్ జియో, పేటీఎం

వ్యాపార స్వలాభం కోసం ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాని నరేంద్రమోదీ చిత్రాన్ని వాడుకున్నందుకు రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పాయి. ఈ విషయంపై రిలయన్స్ జియో, పేటీఎంలు క్షమాపణ చెప్పినట్టు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.  మోదీ ఫోటోగ్రాఫ్ లను తమ అడ్వర్ టైజ్ మెంట్లలో  వాడుకున్నందుకు ప్రభుత్వం గత నెల ఈ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. ఈ తప్పిదానికి కంపెనీలు క్షమాపణ చెప్పాయి. యాంబ్లమ్స్ అండ్ నేమ్స్ యాక్ట్, 1950 కింద ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల ఫొటోలు లేదా యాంబ్లమ్‌లు వాడటం నిషేధం.
 
రిలయన్స్ జియో మాత్రం మోదీ ఫొటోతో ఒక ఫుల్ పేజ్ ప్రకటనను గత నెల సెప్టెంబర్ లో ఇచ్చింది. ఈ వ్యాపార ప్రకటన రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై పలు కోర్టులలో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. అలాగే పేటీఎం కూడా రెండు నెలల అనంతరం మోదీ డీమానిటైజేషన్ నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా తమ డిజిటల్ వాలెట్‌ను వినియోగించాలని ప్రకటనలు విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement