న్యూఢిల్లీ: పేటీఎం సబ్సిడరీ కంపెనీ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ ఆరోపణల తర్వాత కూడా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎందుకు మౌనంగా ఉన్నాయో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేసింది.
‘పేటిఎం వ్యవస్థాపకుడు ప్రధాని మోదీ భక్తుడు. ప్రధానితో సెల్ఫీలు దిగడమే కాకుండా ప్రధానికి అనుకూలంగా ప్రకటనలు కూడా ఇచ్చాడు. ఎన్నికల ర్యాలీల్లోనూ పేటీఎంకు అనుకూలంగా మోదీ మాట్లాడారు. ఏడేళ్లుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సహకారం అందింది. ఇప్పుడు కంపెనీపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
పేమెంట్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్బీఐ ఆంక్షలు విధించిన తర్వాత కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎందుకు మౌనంగా ఉంది. పీఎం మోదీకి సంబంధించిన వాళ్లపై దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా షినేట్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
నిబంధనలు పాటించడం లేదన్న కారణంగా ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్ బ్యాంకు ఎలాంటి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని, వాలెట్‌లలో డబ్బు రీఫిల్ చేయడం కుదరదని ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం షేరు స్టాక్‌మార్కెట్‌లలో కుప్పకూలుతూ వస్తోంది. ఈ నాలుగైదు రోజుల్లో ఆ షేరు సుమారు 50 శాతం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
#WATCH | On RBI's restrictions on Paytm Payments Bank, Congress leader Supriya Shrinate says, "RBI has restricted Paytm payments bank & there will be no existence of it after 29 February...There are very serious charges levelled by the RBI. The irregularities started in… pic.twitter.com/VFJph2tU2s
— ANI (@ANI) February 5, 2024
Comments
Please login to add a commentAdd a comment