జూలై సీరీస్‌లో ఈ 4షేర్లపై ట్రేడర్ల ఆసక్తి..! | Five stocks with high interest on F&O traders’ radar for July | Sakshi
Sakshi News home page

జూలై సీరీస్‌లో ఈ 4షేర్లపై ట్రేడర్ల ఆసక్తి..!

Published Mon, Jun 29 2020 1:28 PM | Last Updated on Mon, Jun 29 2020 1:32 PM

Five stocks with high interest on F&O traders’ radar for July - Sakshi

జూలై డెరివేటివ్‌ సీరీస్‌ తొలిరోజైన శుక్రవారం టెలికాం, ఐటీ, ఫార్మా, హాస్పిటల్‌ షేర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. రానున్న రోజుల్లో నిఫ్టీ లాభాలు పరిమితం అవుతాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు వృద్ధి కలిగిన కంపెనీల షేర్లపై దృష్టిని సారించారు. యాక్చెంచర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావవడంతో శుక్రవారం టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో మోతీలాల్‌ ఓస్వాల్‌ డెరివేటివ్స్‌ విభాగపు విశ్లేషకుడు చందన్‌ తపారియా జూలై సీరిస్‌లో ట్రేడర్లు ఈ 4షేర్లపై అధిక దృష్టి నిలిపినట్లు పేర్కోంటూ సూచనలు ఇచ్చారు. ఇప్పుడు 4 షేర్లను గురించి తెలుసుకుందాం...

1. షేరు పేరు: వోడాఫోన్‌ ఐడియా
ప్రస్తుత ధర: రూ.10.50(29-6-2020 నాటికి)
విశ్లేషణ: గడచిన కొద్దిరోజులుగా ఇతర టెలికాం రంగ షేర్లలో నెలకొన్న ర్యాలీలో భాగంగా ఈ షేరు పెరిగింది. ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ వోడాఫోన్‌ ఐడియా కంపెనీలో వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలతో ఈ కౌంటర్‌లో సెంటిమెంట్‌ మెరుగుపడింది. అలాగే ఏజీఆర్‌ బకాయిల నుంచి ఉపమశమనం లభించవచ్చనే ఆశావహ అంచనాలతో ఈ షేరు మార్చి నుంచి ఏకంగా 218శాతం ర్యాలీ చేసింది. శుక్రవారం షేరు సగటు వ్యాల్యూమ్స్‌ కంటే అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో  6శాతం లాభంతో ముగిసింది. 

2. షేరు పేరు: మైండ్‌ ట్రీ
ప్రస్తుత షేరు ధర: రూ. 941 (29-6-2020 నాటికి)
విశ్లేషణ: యాక్చెంచర్‌ క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐటీ షేర్లు లాభపడ్డాయి. అందులో భాగంగా ఈ మైండ్‌ ట్రీ షేరు కూడా పెరిగింది. ఈ షేరు ప్రస్తుత ధర(రూ.941) నుండి ఈ జూలై సీరీస్‌లో రూ. 1,000- రూ.1,020కి ర్యాలీ చేయవచ్చు. అలాగే డౌన్‌ట్రెండ్‌లో రూ.910 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. 

3. షేరు పేరు: యూనైటెడ్‌ బేవరేజెస్‌
ప్రస్తుత షేరు ధర: రూ.1,011 (29-6-2020 నాటికి)
విశ్లేషణ: కోవిడ్‌-19 లాక్‌డౌన్‌తో ఏర్పడిన అంతరాయాలతో మార్చి క్వార్టర్‌లో కంపెనీ నికరలాభం 39శాతం క్షీణించింది. ఫలితంగా షేరులో బేరిష్‌ పొజిషన్లు ఏర్పడ్డాయి. స్వల్పకాలం పాటు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ.., బలమైన బ్యాలెన్స్‌ షీట్‌తో రానున్న రోజుల్లో రాణించవచ్చు. షేరు పతనమైన ప్రతిసారి పొజిషన్లను తీసుకోవచ్చు.

4. షేరు పేరు: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌
ప్రస్తుత షేరు ధర: రూ.560 (29-6-2020 నాటికి)
విశ్లేషణ: యాక్చెంచర్‌ క్యూ4 లాభాల ప్రకటన ఈ షేరుకు కూడా కలిసొచ్చింది. గత ఐదు సెషన్లలో ఈ షేరు 50రోజుల మూవింగ్‌ యావరేజ్‌ వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ షేరుకు రూ.545 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. ఈ జూలైలో సీరీస్‌లో రూ.600 వరకు లాభపడవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement