స్టాక్‌మార్కెట్ అనేది అవకాశాలకు స్వర్గధామం. ప్రతి ట్రేడర్ మంచి రాబడుల్ని ఆశిస్తూ ట్రేడ్ చేస్తారు. అయితే అందరూ అందులో విజయాల్ని సాధించలేరు. మార్కెట్ ట్రెండ్‌ను గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఓర్పు అవసరం. గట్టి పట్టుదల ఉండాలి. అన్నింటిని అలవరుచుకొని సురక్షితంగా ట్రేడింగ్ చేస్తేనే లాభాలు సమకూరుతాయి. ఈ క్రమంలో ప్రతి ట్రేడరు 4నాలుగు నియమాలను అలవరుచుకుని నష్టాలకు దూరంగా ఉండచవచ్చని క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ జష్న్ అరోరా తెలిపారు.
1.రిస్క్‌ను ముందుగానే అంచనా వేసుకోవాలి:
స్టాక్ మార్కెట్లో వైఫల్యానికి ‘‘మేనేజ్‌మెంట్ నైపుణ్యం లేకపోవడం’’ అతిపెద్ద కారణం. కాబట్టి ట్రేడింగ్ విఫలమైతే సంభవించే నష్టాన్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. సాధారణంగా ట్రేడర్లు తమ డబ్బులన్నింటినీ ఒకే స్టాక్‌లో ఉంచి నష్టాలను చవిచూస్తారు.
2.మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి:
మార్కెట్ అర్థం చేసుకోవడం చాలా అవసరం. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఖచ్చితంగా ఊహించలేరు అనేది వాస్తవమే. అయితే మార్కెట్‌ను అర్థం చేసుకోకుంటే భారీ నష్టాలను నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకోకపోతే భారీ నష్టాలు తప్పవు.
3.స్టాప్ లాస్ పెట్టుకోవాలి
ట్రేడర్లు ఎల్లప్పుడూ ‘‘స్టాప్ లాస్’’ ఆప్షన్ వినియోగించాలి. ఈ ఆప్షను ఉపయోగించక పోతే స్టాక్‌లో రిస్క్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ షేరు ధర ట్రేడర్ ఊహించిన దానికి అనుకూలంగా కదలకపోతే భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంది.
4.భావోద్వేగాలకు దూరంగా ఉండాలి
స్టాక్ మార్కెట్లో భావోద్వేగాలకు స్థానం లేదు. షేరు మరింత నష్టాన్ని చవిచూడవచ్చనే భయాలు లేదా మరింత ర్యాలీ చేస్తుందనే ఆత్యాశ లాంటి భావోద్వేగాలు పనికిరావు. ఒకవేళ ఇలా చేస్తే ఎక్కువ మొత్తంలో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
నిఫ్టీకి 10,325-10,410 శ్రేణి కీలకం:
ఈ వారంలో జూన్ కాంట్రాక్టు డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడకులకు లోనయ్యే అవకాశం ఉందని అరోరా అభిప్రాయపడ్డారు. అప్‌సైడ్‌లో నిఫ్టీ 10,325-10,410 శ్రేణిలో కీలక నిరోధాన్ని ఎదుర్కోంటుందని ఆయన అన్నారు. ఒకవేళ ఇండెక్స్ 10,400 స్థాయిని అధిగమించగలిగితే దాని తదుపరి నిరోధ శ్రేణి 10,530-10,650 ఉండొచ్చు. ఇప్పటికీ నిఫ్టీ 200 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్ స్థాయిని ఎదుర్కోంటుందన్నారు.
డౌన్‌ట్రెండ్‌లో 10070 దిగువుకు చేరితే ఇండెక్స్ మరింత బలహీనపడి 9,950-9,840 స్థాయికి చేరుకుంటుదన్నారు. ఈ స్థాయికి కోలో‍్పతే తదుపరి కీలక మద్దతు 9,725-9,700 స్థాయిని పరీక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment