ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లు కరోనా దెబ్బకు కకావికలం అవుతున్నాయి. మార్చి పతనాల తర్వాత కొంత రికవరీ చూపినా, ఏ దేశపు మార్కెట్ కూడా ఇంకా బేస్‌ను ఏర్పరుచుకోలేదు. నిఫ్టీ సైతం 7500 పాయింట్ల కనిష్ఠాన్ని చూసి తిరిగి కోలుకొని 8800- 9800 పాయింట్ల మధ్య కదలాడుతోంది. 8900-9000 పాయింట్ల వద్ద ప్రస్తుతం నిఫ్టీకి మంచి మద్దతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి గత బుల్ ర్యాలీ(9000-12400)కి బేస్‌గా వ్యవహరించింది. ఈ స్థాయి కోల్పోనంతవరకు రిస్కుతీసుకునే ట్రేడర్లు పొజిషన్లను కొనసాగిస్తూనే ఉంటారు. కొత్త పెట్టుబడులకు కూడా ఈ స్థాయి మంచిదేనని కొందరిసలహా. అయితే వీరంతా పెట్టుబడులు పెట్టేముందు తప్పక కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు....
- ఒక ట్రేడ్ చేసే ముందు అందులోని రిస్కును కచ్ఛితంగా అంచనా వేయాలి.
- పెట్టుబడి మొత్తాన్ని సరైన రీతిలో వివిధ షేర్లలో పెట్టాలి.(డైవర్సిఫికేషన్).
- సాధ్యమైనంత వరకు ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి.
- నిఫ్టీలో ఒక దఫా 200- 300 పాయింట్ల మేర మాత్రమే ట్రేడ్ చేయాలి. (భారీ పతనం, భారీ ర్యాలీ కోసం పొజిషన్లు తీసుకోవద్దు).
- హెడ్జింగ్ మర్చిపోవద్దు, ప్రతి షేరుకు ట్రైలింగ్ స్టాప్‌లాస్‌ను తప్పక పాటించాలి.
- సిప్స్ తీసుకోవడం లేదా ఆప్షన్ రైటింగ్‌కు ఎక్కువ ప్రాధానమివ్వాలి.
- ట్రెండ్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలి. ట్రెండ్‌కు ఎదురీదే యత్నాలు వద్దు.
నిఫ్టీ 9200 పాయింట్ల పైన ఉంటే బుల్లిష్‌గా, దిగువన ఉంటే బేరిష్‌గా ట్రెండ్ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువన నిఫ్టీకి 8200- 8500 పాయింట్ల వద్ద మరో మద్దతుంది. బేర్ మార్కెట్లో వచ్చే ఆరు నెలలు ఎలా గడుపుతామనేదాని ఆధారంగా వచ్చే ఆరు సంవత్సరాల ట్రేడింగ్ భవితవ్యం ఆధారపడిఉంటుందని మార్కెట్ పండితులంటారు. అందువల్ల సరైన జాగ్రత్తలు తీసుకొని ట్రేడింగ్ చేయాలని సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment