Strategies
-
ట్యాక్స్ ప్లానింగ్.. సరిగమపదని..
‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకోండి. ’ఎగవేత’ భూతం ’కబంధ’ హస్తాల నుంచి బైటపడ్డాం. ఇప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ మీద దృష్టి సారించి, ప్లానింగ్ రాగాల్లో స,రి,గ,మ,ప,ద,ని తెలుసుకుందాం. గత దశాబ్దంగా మనం వింటున్న పదం.. జనాలు నలుగురు మెచ్చిన పదం ’మేనేజ్మెంట్’.. కేవలం కంపెనీలు, కార్పొరేట్లు, వ్యాపారం, వాణిజ్య రంగాల్లోనే కాకుండా అన్ని రంగాల్లో ’మేనేజ్మెంట్’ కంపల్సరీ. సంస్థలతో బాటు వ్యక్తులకు, మనందరికీ వర్తించేది ’మేనేజ్మెంట్’. ట్యాక్స్‌ని మేనేజ్ చేయాలి. ట్యాక్స్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన ప్రాథమిక అంశం, కీలకాంశం ’ట్యాక్స్ ప్లానింగ్’. ఇది క్రియాశీలక చర్య .. చర్చ!ఇదీ చదవండి: ఐటీ శాఖ కొత్త వార్నింగ్.. రూ.10 లక్షల జరిమానాచట్టరీత్యా, రాచమార్గంలో పన్నుభారాన్ని తగ్గించే మార్గం. అవసరం అయినంత, అర్హత ఉన్నంత .. అన్ని ప్రయోజనాలు, తగ్గింపులు, మినహాయింపులు పొంది, ఆదాయాన్ని తగ్గించుకోవడం లేదా పెద్ద శ్లాబు నుంచి తక్కువ/చిన్న శ్లాబుకి తెచ్చుకోవడం, 30 శాతం నుంచి 20 శాతానికి, 20 శాతం నుంచి 10 శాతానికి, ఇంకా 10 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించుకోవడం.ట్యాక్స్ ప్లానింగ్ మూడు రకాలుగా ఉంటుంది. స్వల్పకాలికం.. అంటే ఆ సంవత్సరానికి పన్ను తగ్గించుకోవడం. దీర్ఘకాలికం.. అంటే భవిష్యత్‌లో పన్నుని తగ్గించుకోవడం. మూడోది, విరాళాల ద్వారా తగ్గించుకోవడం.పన్ను తగ్గించుకోవడం: స్వల్పకాలికంగా గానీ దీర్ఘకాలికంగా గానీ పన్నులను తగ్గించుకోవడం.పోస్ట్‌పోన్ చేసుకోవడం: ఈ విధంగా ఎప్పుడు చేసుకోవచ్చంటే.. బడ్జెట్‌కు ముందు.. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో మార్చి 31 లోపల లేదా ఏప్రిల్ 1 తర్వాత.. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఇలా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.పన్ను భారాన్ని విభజించుట: ఒకే మనిషి మీద ఎక్కువ ట్యాక్స్ పడే పరిస్థితుల్లో ఆదాయాన్ని చట్టప్రకారం అగ్రిమెంట్ల ద్వారా ఆదాయాన్ని విభజించడం. ఉదాహరణకు ఆలుమగలు వారి పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్లను మార్చి వడ్డీ సర్దుబాటు చేసుకోవచ్చు.తప్పించుకోవడం: సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం తప్పించుకోవడాన్ని చట్టరీత్యా కూడా చేయొచ్చు. చట్టంలోని లొసుగుల్లోని అంశాలకు లోబడి పన్ను తప్పించుకోవచ్చు. ఉదాహరణకు భార్యా, భర్త ఇద్దరికీ పన్నుభారం వర్తిస్తుంది. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురికీ స్కూల్ ఫీజులు కడుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరి స్కూల్ ఫీజును ఒకరి కేసులో, మిగతా పిల్లల ఫీజును మరొక కేసులో క్లెయిం చేయొచ్చు. ఒకరకంగా కాకుండా మరో విధంగా కట్టడాన్ని ఇంగ్లీషులో disguise taxation అని అంటారు. మారువేషం కాదు. మరో వేషంలాంటిది. అంటే, చేసే వ్యాపారం భాగస్వామ్యం లేదా కంపెనీలాగా చేస్తే 30 శాతం పన్ను పడుతుంది. అలా కాకుండా సొంత వ్యాపారంగా చేస్తే శ్లాబుల వారీగా 10 శాతం, 20 శాతం, 30 శాతం చొప్పున కట్టొచ్చు. బేసిక్ లిమిట్ కూడా వర్తిస్తుంది.సంపూర్తిగా ఆలోచించాలి: పాటల ట్యూనింగ్లాగే ట్యాక్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. గీత రచనను బట్టి స్వర రచన. ఏదైనా ఏడు స్వరాల్లో ఇమడాలి. పూర్తి సమాచారం ఉండాలి. చట్టాన్ని అతిక్రమించకూడదు. పన్ను భారం తగ్గాలి, చట్టప్రకారం జరగాలి.పన్నుకు సంబంధిచిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ-మెయిల్ పంపించగలరు -
2024లో ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి - వీడియో చూడండి
మార్కెట్ ఇప్పటికే ఆల్‌టైమ్‌హైలో ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ పయనం ఏ విధంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపర్లు ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? దానికి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీలను అనుసరించాలో తెలుసుకోవడానికి, స్టాక్ మార్కెట్ లీడ్ అనలిస్ట్ 'కౌశిక్ మోహన్'తో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' ముఖాముఖి ఈ వీడియోలో చూడండి. -
కమలదళం.. కదన వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. ఒకవైపు పార్టీ సంస్థాగత పటిష్టత, పార్టీ గెలుపుకోసం అంకితభావంతో పనిచేసే నేతల ఎంపిక, వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం.. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ.. ఇంకోవైపు నెలాఖరులో విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర బీజేపీలో గత సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 30–35 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో నియోజకవర్గాల వారీగా పార్టీకి ఉన్న బలాబలాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి.. బలహీనంగా ఉన్న సీ, డీ స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పట్టుపెంచుకోవడానికి, గెలిచే అవకాశాలు ఎక్కువగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీనేతలు చెప్తున్నారు. అదే తరహా వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసే యోచన ఉన్నట్టు వివరిస్తున్నారు. నేడు రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీకున్న 1,200 మంది ఎమ్మెల్యేల్లో 560 మందిని ఎంపికచేశారు. వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది వారంపాటు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గంలో ఒకరు చొప్పున పర్యటించి పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తారు. వారి పర్యటన ముగియగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోరు యాత్రలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. అలంపూర్ జోగులాంబ ఆలయం, భద్రాచలంలోని సీతారామ ఆలయం, బాసరలోని సరస్వతి ఆలయం నుంచి వీటిని ప్రారంభించే అవకాశముంది. ఓవైపు ఈ యాత్రలను కొనసాగిస్తూనే.. పార్టీపరంగా ఎన్నికల వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేయడం, అమలు కోసం మేనిఫెస్టో, ప్రచార, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కీలకంగా అమిత్‌షా పర్యటన ఈ నెల 27న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటనను పార్టీ నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. ఈ పర్యటన సందర్భంగా కోర్‌కమిటీ, ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ అయి ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణకు తుదిరూపు ఇస్తారని.. రాష్ట్ర పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత పార్టీపరంగా కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటున్నాయి. 23 నుంచి మళ్లీ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన బీజేపీ.. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో తదుపరి దశ పోరాటాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించనున్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ ఉద్యమాన్ని చేపడతారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తొలిదశలో ఆందోళనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు. 20న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. -
పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై ప్రత్యేక వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాజగోపాల్ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్‌గోపాల్ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్ సహా వివిధ పా ర్టీల నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్ ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే రంగంలో మండల ఇన్చార్జీలు ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
Mahbubnagar: పాగా వేసేందుకు ఎవరి వ్యూహం వారిదే.. వేడెక్కిన రాజకీయాలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలన్నీ అప్పుడే హడావుడి ప్రారంభించాయి. హ్యాట్రిక్ కోసం గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కమలం, హస్తం పార్టీలు కూడా పాలమూరులో పాగా వేసేందుకు కుస్తీలు పడుతున్నాయి. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజనలో షాద్‌నగర్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలోకి వెళ్ళింది. కొడంగల్ సెగ్మెంట్లోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలో కలిసాయి. చదవండి: బీజేపీ క్లియర్‌కట్ మెసేజ్.. పట్టు దొరికిందా? తెలంగాణ ఏర్పాటుకు ముందు జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల హవా నడిచింది. బీజేపీ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు సెగ్మెంట్లలో ఉనికి చాటుకునేది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రామమోహన్‌రెడ్డి, నారాయణపేట నుంచి టీడీపీ టిక్కెట్ మీద గెలిచిన రాజేందర్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం తొమ్మిదికి చేరింది. రెండు ఎంపీ సీట్లలో ఒకటి టీఆర్ఎస్, మరొకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. 2018 ఎన్నికల్లో 13 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది. కొల్లాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత ఆయన కూడా కారు ఎక్కేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది గులాబీ పార్టీ. మరో ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోసారి జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంటామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ సర్వేలో సగం మంది గెలుపు కష్టమని తేల్చినట్లు సమాచారం. దీంతో ఎవరి సీటు పోతుందో అన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అనుమానం ఉన్నవారు సొంత సర్వేలు చేయించుకుని జాతకాలు పరీక్షించుకుంటున్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి పథకాలను ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళుతున్నారు. అయితే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళు, లక్ష రూపాయల రుణమాఫీ, కొత్త పెన్షన్లు, దళితబంధు పథకాల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా నిరుద్యోగుల్లో ఉద్యోగాల విషయంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ప్రభుత్వం మీద కొంత ఆగ్రహంతో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీలో అంతర్గత కలహాలు, అసంతృప్తులతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే...తర్వాత పార్టీలో ఉంటారో లేరో అన్న అనుమానంతో ఓటు వేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, సీనియర్ నేతలు మల్లు రవి, నాగం జనార్థనరెడ్డి వంటి ఎందరో సీనియర్లు జిల్లా నుంచి ఎదిగినవారే. అయినా టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. పైగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడానికి కూడా పెద్దగా ప్రయత్నించడంలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్లలో పోటీ చేయడానికి బలమైన నాయకులు కూడా లేనంత దుస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక...ఆయన సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఆందోళనలతో కేడర్‌లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కార్యకర్తల ఉత్సాహాన్ని సక్రమ మార్గంలో నడిపించేవిధంగా పార్టీ అడుగులు పడటంలేదు. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అధ్యక్షుల స్థానంలో కొత్తవారిని నియమించే ప్రయత్నం కూడా చేయకపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ఇక కేంద్రంలో ఉన్న అధికారంతో దూకుడు మీదున్న కమలం పార్టీ జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి కాషాయ సేనలో చేరడంతో ఆ పార్టీ కేడర్‌లో జోష్ పెరిగింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ బహిరంగ సభ కూడా పార్టీకి మంచి ఊపు తెచ్చింది. అంతేగాకుండా జాతీయ సమావేశాలకు వచ్చిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కనీసం ఐదారు అసెంబ్లీ సీట్లు గెలవాలని లక్ష్యంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో వేడెక్కిన రాజకీయాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికి వారు తమ పార్టీకే మెజారిటీ సీట్లు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారి లక్ష్యాలకు అనుగుణంగా కార్యరంగంలోకి అడుగుపెడుతున్నారు. -
TSRTCలో కొత్త జోష్
-
Huzurabad Bypoll: కుల సమీకరణాలు.. ఓట్ల లెక్కలు..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి మరింత పదును పెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయ సభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది. సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహానికి మరింత పదునుపెడుతోంది. తొలుత పార్టీ కేడర్‌తో, ఆ తర్వాత గ్రామాలు, మండలాల వారీగా వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు ఆత్మీయసభలు నిర్వహిస్తూ వచ్చిన గులాబీ దళం.. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మరోమారు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు భారీ సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పొరుగునే ఉన్న హనుమకొండ జిల్లా పెంచికల్‌పేటను ఎంచుకుంది. పెంచికల్పేటలోని బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి కులాల వారీగా ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోంది. మూడు రోజుల క్రితం ఆరె కటికల సభ ఏర్పాటు చేయగా, సోమవారం మున్నూరుకాపు ప్రతినిధులతో భేటీ నిర్వహించింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన బాజిరెడ్డి గోవర్దన్‌కు సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి మున్నూరుకాపు ప్రతినిధులు హాజరయ్యారు. పక్షం రోజులపాటు మరిన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సభలు కొనసాగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పెంచికల్‌పేట కేంద్రంగా దసరా తర్వాత నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. జాబితాల వడపోత కులాలు, పథకాల లబ్ధిదారులైన్ల ఓటర్ల లెక్కలను ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా వర్గీకరించి ఉపఎన్నికలో మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అందజేశారు. వీరితోపాటు మంత్రులు ఈ జాబితాలను వడపోసి ఓటర్ల మద్దతు కూడగట్టడంలో తలమునకలై ఉన్నారు. బయటకు సభలు, సమావేశాలు, ధూంధాంల పేరిట ప్రచార ఆర్భాటం జరుగుతున్నా, అంతర్గ తంగా మాత్రం సామాజికవర్గాలు, పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రధాన సామాజికవర్గాలైన రెడ్డి, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, మాల, మాదిగ, ఎస్టీల ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు కలిగిన కుమ్మరి, పెరిక కులస్తులపైనా అదే కులా లకు చెందిన ఇన్చార్జి నేతలు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతోపాటు కిరాణా, ఆయిల్, క్లాత్ మర్చంట్స్, సీడ్స్ ఫెర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్లు, లయన్స్ క్లబ్, రోటరీక్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల మద్దతు కోసం కూడా గులాబీదళం ప్రయత్నా లు సాగిస్తోంది. నిర్మాణ కార్మికులు, హమాలీ సంఘాలు, పారిశుధ్య కార్మికులు, అసంఘటిత రంగాల వారిని సైతం వదిలిపెట్టలేదు. అంతా తానై..! మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి నిష్క్రమించిన తర్వాత హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ చేజారకుండా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కూడిన యాక్షన్ టీమ్‌కు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడకముందు కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలను టీఆర్ఎస్లోకి రప్పించడం, నామినేటెడ్ పదవులు ఇవ్వడం వంటివి కేసీఆర్ కనుసన్నల్లో జరిగింది. అయితే నియోజకవర్గస్థాయిలో టీఆర్ఎస్ కేడర్ సమన్వయం, ఇతర పార్టీల నుంచి కొద్దిపాటి పేరున్న నాయకులు, కార్యకర్తలను కూడా టీఆర్ఎస్ గూటికి చేర్చడంలో హరీశ్‌రావు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ప్రచారం పూర్తయ్యేందుకు మరో పక్షం రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున సామాజికవర్గాలవారీగా మరింత పట్టు బిగించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై పార్టీలన్నీ పట్టు బిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ– టీఆర్ఎస్ నువ్వానేనా అన్న స్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల శాలపల్లిలో జరిగిన సీఎం సభతో గులాబీ నేతల్లో జోష్ పెరగగా.. కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు యాత్రలు షురూ చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. నోటిఫికేషన్‌కు ఇంకా సమయం ఉండటంతో ధీటైన స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచనలో ఉంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎక్కడా తగ్గవద్దని, మరింత పట్టుబిగించాలని అధిష్టానాలు ఆదేశించాయి. అభివృద్ధి నినాదంతో గులాబీనేతలు.. ► దళితబంధు అమలు చేస్తోన్న నేపథ్యంలో కారుపార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు. దీనికితోడు నోటిఫికేషన్ వచ్చేలోగా నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ► హుజూరాబాద్ మండలం మొత్తం మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. వీణవంక మండల బాధ్యతలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు భుజాలకెత్తుకున్నారు. జమ్మికుంట టౌన్ ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తలమునకలయ్యారు. జమ్మికుంట రూరల్ పనులు ఆరూరి రమేశ్ చూస్తున్నారు. ► కీలకమైన ఇల్లందకుంట మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యవేక్షిస్తున్నారు. కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ► సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని శుక్రవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి పార్టీల పేర్లను పెద్దగా ప్రస్తావించకుండానే.. నేతలు ప్రసంగిస్తుండటం గమనార్హం. యాత్రలతో కమలనాథుల ఉత్సాహం.. ► హుజూరాబాద్‌లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో చేసిన పర్యటన ఆ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ► గతంలో ఈటల రాజేందర్ జన ఆశీర్వాద యాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఇక త్వరలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికకు బాగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. ► జమ్మికుంట పట్టణానికి ఫైర్‌బ్రాండ్ ఎంపీ అరవింద్‌ను నియమించారు. జమ్మికుంట మండలం బాధ్యతలు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుకు అప్పగించారు. హుజూరాబాద్ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, హుజూరాబాద్ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కేటాయించారు. ► ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డిని, కమలాపూర్ మండలానికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు చేస్తోన్న ప్రచారాలు, రోడ్‌షోలతోపాటు నాయకుల యాత్రలు తమకు కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారు. కొండా సురేఖ పేరు లాంఛనమే..! ► ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడ బలమైన నాయకులను బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారు. స్థానికనేతలైన పత్తి క్రిష్ణారెడ్డిని, ఎన్ఆర్ఐ పాడి ఉదయానంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదించారని తెలిసింది. ► ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన బలమైన నేత, మాజీమంత్రి కొండా పేరును కొందరు ప్రతిపాదించారు. హుజూరా బాద్ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్‌కు భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉండటంతో కొండా సురేఖ సైతం పోటీకి సై అన్నారని తెలిసింది. ► అయితే, ఇక్కడ పోటీ చేయాలంటే ఆమె కొన్ని షరతులు విధించారని సమాచారం. 2023 ఎన్నికల సందర్భంగా తనకు ఉన్న డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తే పోటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న కొండా వర్గీయుల ప్రతిపాదనకు అధిష్టానం కూడా అంగీకరించిందని సమాచారం. ► వాస్తవానికి ఇటీవల రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోనే కొండా పేరును ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాఖీపౌర్ణమి అనంతరం సురేఖ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. చదవండి: మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం -
రిలయన్స్ భవిష్యత్ వ్యూహాలివే..
ముంబై: దేశీయ టెలికాం రంగంలోకి సునామీలా దూసుకొచ్చిన ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే రాబోయే నాలుగేళ్లలో రిలయన్స్ వ్యూహాత్మక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. ఆర్ఐఎల్(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ) సంస్థ తమ ఆదాయాలను మరింత పెంచడానికి ఐపీఎల్, కేబీసీ తదితర సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. కాగా రాబోయే రోజుల్లో ఆర్ఐఎల్ సంస్థ ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువుల విభాగంలో వినియోగదారులకు మరింత చేరువ చేయనుంది. ఈ నేపథ్యంలో 50 కోట్ల మొబైల్ వినియోగదారులను ఆకర్శించే విధంగా జియో వ్యూహాలు రచిస్తుంది. ప్రస్తుతం జియోలో 38.8 కోట్ల యూజర్లు ఉన్నారు. కాగా రిలయన్స్ దూకుడైన నిర్ణయాలతో దిగ్గజ కంపెనీలు ఆర్ఐఎల్లో జత కట్టడానికి రెడీగా ఉన్నాయి. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు స్థానిక కిరాణా విభాగంలో ప్రవేశించింది. ఇందుకుగాను సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సమన్వయంతో కిరాణా స్టోర్స్ విభాగంలో దూసుకెళ్లాలని యోచిస్తుంది. (చదవండి: రోటీ, కపడా ఔర్ డేటా..జియోఫికేషన్) -
వ్యాపారులకు ధోని పాఠాలివే..
న్యూఢిల్లీ: మహేంద్రసింగ్ ధోని.. ఎప్పటినుంచో తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు ఆగస్టు 15, 2020(స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం తెరదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్‌కు గురి చేశాడు. అయితే కెప్టెన్‌గా మహేంద్రుడు చూపిన నైపుణ్యాలు వ్యాపారంలో పెట్టుబడుదారులు అనేక పాఠాలు నేర్చుకోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోని నైపుణ్యాలలో ఆచరించదగ్గ ఐదు అంశాలు: సహనం ఎంతో కీలకం: ధోని అత్యుత్తమ నైపుణ్యాలలో అందరు పేర్కొంటున్న అంశం సహనం. క్రికెట్లో ఎంత సంక్లిష్ట పరిస్థితినైనా సహనంతో ధోనీ ఎదుర్కొనే తీరు ఆశ్చర్యపరుస్తుంది. అదే విధంగా స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చాయని, అనూహ్య పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ, విచారించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకొని ముందుకెళ్లడమే అత్యుత్తమ మార్గమని, ధోని నైపుణ్యాల ద్వారా వాటిని ఆచరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పట్టుదలే విజయ మార్గం ధోని ప్రారంభ మ్యాచ్(2004-05)లో డకౌట్‌తో (పరుగులు చేయకుండా) అరంగేట్రం చేసినా, ఆ ప్రదర్శన అతనిని ఏ మాత్రం నిరుత్సాహ పరచలేదు. అదేవిధంగా ఊహించని పరిస్థతుల్లో పెట్టుబడిదారులకు విపరీతమైన నష్టం వస్తోంది. వీరంతా ధోని ప్రదర్శించిన పోరాట పటిమను అలవర్చుకొని తిరిగి లాభాలలో దూసుకెళ్లాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నమ్మకమే జీవితం క్రికెట్ అభిమానులను ఎంతో అలరించిన 2007 సంవత్సరం టీ 20 ప్రపంచ కప్‌లో ధోని విభిన్న నైపుణ్యాలు గమనించవచ్చు. టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్ జోగిందర్ శర్మాకు ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఆ ఓవర్లో జోగిందర్ రాణించడంతో ధోని నమ్మకం ఎంత బలీయమైనదో ప్రపంచానికి తెలిసింది. అదే విధంగా పెట్టుబడులు పెట్టే ముందు అన్ని అంశాలను అవగాహన చేసుకొని పెట్టుబడులు పెట్టాలని, అవసరమైతే మార్కెట్ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి. బలాలను గుర్తించండి ధోనికి తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎంత క్లిష్ట పరిస్థితినైనా ధోని ఎదుర్కొంటాడని, ధోని పోరాట యోధుడని దిగ్గజ మాజీ ఆసీస్ ఆటగాడు మైకేల్ హస్సీ గతంలో కితాబిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా బడ్డెట్, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యూహాలు ధోనీ ఆచరించిన విధానాలతో అవగాహన చేసుకుంటే పెట్టుబడిదారులకు ఎంతో ఉపయోగపడతాయి. కోచ్ ప్రాముఖ్యత ధోనికి స్కూల్ చదివే రోజులలో ఫుట్‌బాల్‌పైనే ఆసక్తి ఉండేది. అయితే కోచ్ కేశవ్ బెనర్జీ ధోని నైపుణ్యాలను గమనించి క్రికెట్‌కు పరిచయం చేశాడు. అయితే మార్కెట్, పెట్టుబడి రంగంలో విజయం సాధించాలంటే ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో కీలకం. క్రికెట్లో ధోనీకి కోచ్ ఎలాంటి పాత్ర పోషించారో,పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాదారలు అలాంటే పాత్ర పోషిస్తేనే పెట్టుబడిదారులు విజయం సాధిస్తారని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ధోని రికార్డును ఏ కెప్టెన్ బ్రేక్ చేయలేరు: గౌతమ్ -
ఇదే సరియైన సమయం: ఓలా సీఈఓ
ముంబై: దేశంలో గమ్యస్థాలను చేర్చడంలో ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా క్యాబ్స్ ప్రయాణికుల మనసు చూరగొన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఫైనాన్షియల్(ఆర్థిక సేవల) రంగంలో కూడా సరికొత్త బ్రాండ్‌ను క్రియేట్ చేయాలని ఓలా భావిస్తోంది. అందులో భాగంగానే ఓలా ఫైనాన్సియల్ సర్వీసిస్(ఆర్థిక సేవల)ను మరింత విస్తరించేందుకు సంస్థ వ్యూహాన్ని రచిస్తోంది. ఓలాలో ఫాల్కన్ ఎడ్జ్, వెంచర్ ఫండ్స్ అనే ఫైనాన్స్ సంస్థలు రూ. 25కోట్ల డాలర్లు పెట్టుబడి అందించిందని సంస్థ తెలిపింది. దేశంలో పెట్టుబడులను అందించేందుకు ఆర్ధిక సంస్థలు విజయం సాధించలేకపోయావని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బావిష్ అగర్వాల్ పేర్కొనారు. ఆయన మాట్లుడుతూ.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంస్థలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఇదే సరియైన సమయమని ఓలా ఉద్యోగులతో బావిష్ అగర్వాల్ తన ఆశయాన్ని పంచుకున్నారు. ఓలాను నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మ్యాట్రిక్స్ ఎండీ విక్రమాదిత్యను బోర్డ్ మెంబర్‌గా ఓలా సంస్థ అవకాశం కల్పించింది. ఓలా మెరుగైన ఆర్థిక సేవలను అందించాలంటే దేశంలోని దిగ్గజ యాప్‌లైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే లాంటి దిగ్గజ యాప్‌లను ఢీకొట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఓలా ఆర్థిక సంస్థలో బోర్ట్ మెంబర్లుగా మాజీ వొడాఫోన్ సీఈఓ అరుణ్ సారిన్, హేమంత్ కొనసాగుతున్నారు. చదవండి: కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు -
లాక్డౌన్ వేళ లాభాల సూత్రాలు!
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లు కరోనా దెబ్బకు కకావికలం అవుతున్నాయి. మార్చి పతనాల తర్వాత కొంత రికవరీ చూపినా, ఏ దేశపు మార్కెట్ కూడా ఇంకా బేస్‌ను ఏర్పరుచుకోలేదు. నిఫ్టీ సైతం 7500 పాయింట్ల కనిష్ఠాన్ని చూసి తిరిగి కోలుకొని 8800- 9800 పాయింట్ల మధ్య కదలాడుతోంది. 8900-9000 పాయింట్ల వద్ద ప్రస్తుతం నిఫ్టీకి మంచి మద్దతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ స్థాయి గత బుల్ ర్యాలీ(9000-12400)కి బేస్‌గా వ్యవహరించింది. ఈ స్థాయి కోల్పోనంతవరకు రిస్కుతీసుకునే ట్రేడర్లు పొజిషన్లను కొనసాగిస్తూనే ఉంటారు. కొత్త పెట్టుబడులకు కూడా ఈ స్థాయి మంచిదేనని కొందరిసలహా. అయితే వీరంతా పెట్టుబడులు పెట్టేముందు తప్పక కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.... ఒక ట్రేడ్ చేసే ముందు అందులోని రిస్కును కచ్ఛితంగా అంచనా వేయాలి. పెట్టుబడి మొత్తాన్ని సరైన రీతిలో వివిధ షేర్లలో పెట్టాలి.(డైవర్సిఫికేషన్). సాధ్యమైనంత వరకు ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. నిఫ్టీలో ఒక దఫా 200- 300 పాయింట్ల మేర మాత్రమే ట్రేడ్ చేయాలి. (భారీ పతనం, భారీ ర్యాలీ కోసం పొజిషన్లు తీసుకోవద్దు). హెడ్జింగ్ మర్చిపోవద్దు, ప్రతి షేరుకు ట్రైలింగ్ స్టాప్‌లాస్‌ను తప్పక పాటించాలి. సిప్స్ తీసుకోవడం లేదా ఆప్షన్ రైటింగ్‌కు ఎక్కువ ప్రాధానమివ్వాలి. ట్రెండ్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలి. ట్రెండ్‌కు ఎదురీదే యత్నాలు వద్దు. నిఫ్టీ 9200 పాయింట్ల పైన ఉంటే బుల్లిష్‌గా, దిగువన ఉంటే బేరిష్‌గా ట్రెండ్ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. దిగువన నిఫ్టీకి 8200- 8500 పాయింట్ల వద్ద మరో మద్దతుంది. బేర్ మార్కెట్లో వచ్చే ఆరు నెలలు ఎలా గడుపుతామనేదాని ఆధారంగా వచ్చే ఆరు సంవత్సరాల ట్రేడింగ్ భవితవ్యం ఆధారపడిఉంటుందని మార్కెట్ పండితులంటారు. అందువల్ల సరైన జాగ్రత్తలు తీసుకొని ట్రేడింగ్ చేయాలని సలహా ఇస్తున్నారు. -
పట్టు దిశగా కమలం అడుగులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో పట్టు సాధించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుని ఊపుమీదున్న కమలదళం.. ఆపరేషన్ ఆకర్ష్‌ను పకడ్బదీంగా అమలు చేస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైనే బీజేపీ గురి పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.టీఆర్ఎస్కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో షకీల్ అమేర్ అర్వింద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆర్మూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకురాలు ఏలేటీ అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డిలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అనుచరులు బీజేపీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈనెలాఖరులో గానీ, వచ్చేనెలలో గానీ ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డితో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ వంటి నాయకులను కూడా పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినాయత్వం ప్రయత్నిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలే కాకుండా, మండల స్థాయిలో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతం అవ్వాలని యోచిస్తోంది. ఇటీవల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అనుచరవర్గం దాదాపు మొత్తం కాషాయ కండువా కప్పుకుంది. అలాగే ఆర్మూర్ వంటి నియోజకవర్గంలోనూ వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలకు బీజేపీ వలవేస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్‌ను పెంచుకోవడం ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది. -
అతివేగానికి కళ్లెం
సాక్షి, ఆదిలాబాద్: అతివేగంతో ఎందరో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వాహనదారులు మాత్రం వాటిని తుంగలో తొక్కడంతో అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ అతివేగంగా వాహనాలు నడిపే వారికి కళ్లెం వేసింది. స్పీడ్‌గన్‌తో వేగాన్ని లెక్కించి మితి మీరితే కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. ఇటీవల పోలీసు అధికారులు జిల్లాకు రెండు స్పీడ్ కంట్రోల్ లెజర్ గన్స్‌ను తెప్పించారు. జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అతివేగంగా వచ్చే వాహనాల ఫొటో తీసి డాప్లర్ సిద్ధాంతం ఆధారంగా స్పీడ్ లెజర్గన్ ద్వారా వేగాన్ని లెక్కిస్తారు. పరిమితికి మించి వేగం ఉంటే ఈ–చలాన్ ద్వారా ఇంటి వద్దకే జరిమానా రశీదులు పంపిస్తారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు అతివేగంతో ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దీంతోపాటు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 121 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 33 మంది మృత్యువాత పడ్డారు. 70 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇవేకాకుండా అనధికారికంగా ప్రమాదాలు ఎన్నో సంభవించాయి. అయితే వీటిని నివారించేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో 11 ప్రమాదకర స్థలాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో స్పీడ్గన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దేవాపూర్ చెక్‌పోస్టు, భోరజ్ చెక్‌పోస్టు, చాంద బ్రిడ్జి, తదితర ప్రాంతాల్లో స్పీడ్గన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలు ఎక్కువగా గుడిహత్నూర్ నుంచి నేరడిగొండ, దేవాపూర్ చెక్‌పోస్టు, భోరజ్ ప్రాంతాల్లోనే జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. స్పీడ్‌కు కళ్లెం.. స్పీడ్‌గన్‌తో వాహనాల మితిమీరిన వేగానికి చెక్ పడే అవకాశం ఉంది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళితే స్పీడ్‌గన్‌తో దాని వేగాన్ని లెక్కించి ఈ–చలాన్ ద్వారా ఇంటి వద్దకే జరిమానాలు పంపుతారు. రూ.వెయ్యి నుంచి రూ.1400 వరకు జరిమానా విధిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 14 కంటే ఎక్కువ జరిమానాలు పడిన వ్యక్తి డబ్బులు చెల్లించకుంటే పోలీసులు సంబంధిత వాహన యజమానులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడతారు. జరిమానా మొత్తంతోపాటు ఫెనాల్టీ కడితేనే వదిలిపెడతారు. అయితే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.వెయ్యి, రాంగ్రూట్లో వాహనం నడిపిస్తే రూ.1100, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.100, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తే రూ.1200, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.500, వాహనానికి బీమా లేకుంటే రూ.వెయ్యి, పొల్యూషన్ ధ్రువీకరణ పత్రం లేకుంటే రూ.వెయ్యి, వాహనానికి నంబర్ ప్లేట్ లేకుంటే రూ.100, మైనర్లు వాహనం నడిపితే రూ.వెయ్యి, పరిమితికి మించి వేగంగా వెళితే రూ.1400 జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో ప్రస్తుతం ఈ–చలాన్ విధానం ద్వారానే ఈ జరిమానాలు విధిస్తున్నారు. అజాగ్రత్త, నిబంధనలు అతిక్రమించే వారిపై జరిమానాల రూపంలో కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు పాటించాలి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఏ రోడ్డులో ఎంత వేగంతో వెళ్లాలనే విషయం సైన్బోర్డులపై ఉంటుంది. ఆ వేగానికి మించి వెళ్తేస్పీడ్గన్ల ద్వారా ఈ–చలాన్ రూపంలో జరినామాలు విధిస్తాం. వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లొద్దు. దీంతో ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. వాహనపత్రాలు, లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. ప్రస్తుతం జాతీయ రహదారిపై ఈ స్పీడ్గన్లను ఏర్పాటు చేశాం. – విష్ణు ఎస్.వారియర్, ఎస్పీ -
లోక్ సభ ఎన్నికల్లో సమీకరణాలు ఎలా..!
సాక్షి, ఆదిలాబాద్: పదిహేడవ లోకసభ సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి.. అభ్యర్థి బలమా.. పార్టీ ప్రభావమా.. అనేదానిపై ఓటర్లలో ఆసక్తి నెలకొంది. గడిచిన పదహారవ, పదిహేనవ లోకసభ ఎన్నికల నుంచి ఓటింగ్ తీరును పరిశీలిస్తే ఎన్నికకు ఎన్నికకు మధ్య గంపగుత్తగా ఓటింగ్ శాతం మారడం సమీకరణలను స్పష్టం చేస్తోంది. నామినేషన్ల ఘట్టం ముగియడం, ప్రధాన పార్టీల అభ్యర్థులెవరనేది తెలియడంతో ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రభావంపై చర్చ సాగుతోంది. రెండుచోట్ల త్రిముఖ పోరే.. ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి 2019 లోకసభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో బరిలో ఎవరనేది తేలింది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో లేకపోవడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ కూడా బరిలో ఉండడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లో ఇలా.. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికల్లో పాత ముఖాలే బరిలో నిలిచాయి. ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే సోయం బాపూరావు ఒక్కరే ఎంపీ స్థానం కోసం మొదటిసారి బరిలో ఉన్నారు. గోడం నగేష్, రాథోడ్ రమేష్ గత ఎన్నికల్లోనూ ప్రత్యర్థులు కావడం గమనార్హం. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్‌జాదవ్ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్యే పోరు నెలకొంది. ఇక్కడ 2014 ఎన్నికలను పరిశీలిస్తే.. 75.44 శాతం ఓటింగ్ నమోదు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్‌కు 41.20 శాతం ఓట్లు లభించడం గమనార్హం. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేష్‌జాదవ్‌కు 24 శాతం, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న రమేష్ రాథోడ్‌కు 17.61 శాతం ఓట్లు పడ్డాయి. నగేష్ లక్షా 71,290 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌పై విజయం సాధించారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే.. 76.30 శాతం ఓటింగ్ కాగా థర్డ్ ఫ్రంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేష్ బరిలో నిలిచి 43.11 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న కోట్నాక్ రమేష్ 29.78 శాతం, అప్పట్లో పీఆర్పీ నుంచి మెస్రం నాగోరావు 13.08 శాతం, బీజేపీ అభ్యర్థి అడె తుకారాం 6.71 శాతం ఓట్లను సాధించారు. ఎన్డీఏతో పొత్తు కారణంగా టీఆర్ఎస్ అభ్యర్థి 2009 ఎన్నికల్లో బరిలో నిలువకపోవడం, 2014 ఎన్నికల్లో నేరుగా రంగంలోకి దిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం జరిగింది. దీన్నిబట్టి పార్టీ ప్రభావమే ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అభ్యర్థులను బట్టి కూడా ఓటింగ్ ప్రభావం ఉందనేది స్పష్టమవుతోంది. పెద్దపల్లిలో ఇలా.. పెద్దపల్లిలో ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు ఈ నియోజకవర్గ బరిలో కొత్త ముఖాలు కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి ఎ.చంద్రశేఖర్, బీజేపీ నుంచి ఎస్.కుమార్, టీఆర్ఎస్ నుంచి వెంకటేష్‌నేతకాని బరిలో నిలిచారు. ఇక్కడ మాజీ ఎంపీ జి.వివేకానంద ఈమారు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2009, 2014 ఎన్నికల్లో ఆయన బరిలో ఉన్నారు. ఒకసారి గెలుపొందగా, మరోసారి ఓటమి చెందారు. ఇక 2014 ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒటింగ్ సరళిని పరిశీలిస్తే.. 74.12 శాతం ఓటింగ్ కాగా టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు 45.53 శాతం ఓట్లు రావడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌కు 17.55 శాతం, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జనపతి శరత్‌బాబుకు 6.2 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో 68.72 శాతం ఓటింగ్ కాగా కాంగ్రెస్ నుంచి జి.వివేకానందకు 34.7 శాతం ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న గోమాస శ్రీనివాస్‌కు 29.28 శాతం, పీఆర్పీ నుంచి బరిలో ఉన్న ఆరెపల్లి డెవిడ్‌రాజ్‌కు 19.42 శాతం ఓట్లు పడటం గమనార్హం. అప్పుడు జి.వివేకానంద 49,017 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం.. (2014) పార్టీ అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ బాల్క సుమన్ 4,65,496 కాంగ్రెస్ వివేక్ 1,74,338 టీడీపీ శరత్‌బాబు 63,334 పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం.. (2009) పార్టీ అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు కాంగ్రెస్ జి.వివేక్ 3,13,748 టీఆర్ఎస్ గోమాస శ్రీనివాస్ 2,64,731 పీఆర్పీ ఆరెపెల్లి డేవిడ్ రాజు 1,75,605 ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. (2014) పార్టీ అభ్యర్థి పేరు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ జి.నగేష్ 4,30,847 కాంగ్రెస్ నరేష్ జాదవ్ 2,59,557 టీడీపీ రాథోడ్ రమేష్ 1,84,198 బీఎస్పీ రాథోడ్ సదాశివ్ 94,420 ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం.. (2009) పార్టీ అభ్యర్థిపేరు వచ్చిన ఓట్లు టీడీపీ రాథోడ్ రమేష్ 3,72,268 కాంగ్రెస్ కోట్నాక్ రమేష్ 2,57,181 పీఆర్పీ మెస్రం నాగోరావు 1,12,930 బీజేపీ ఆడె తుకారాం 57,931 -
ట్రంప్, కిమ్ భేటీ.. ఎవరి వ్యూహాలు ఏమిటి?
చెయ్యి చాపితే అందేంత దూరంలో నా టేబుల్ మీద అణుబాంబు బటన్ ఉంది. జాగ్రత్త, అని ఒకరంటే.. నా టేబుల్ మీద కూడా ఉంది , అది ఇంకా పెద్దది, మరింత శక్తిమంతమైనది అంటూ మరొకరు తీవ్రమైన హెచ్చరికలు చేసుకొని ప్రపంచ దేశాల్లో దడ పుట్టించిన ఇద్దరు అధినేతలు ఎట్టకేలకు సమావేశం కానున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల 12న సింగపూర్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 6.30 గంటలకు సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధినేతతో సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో వీరి భేటీతో ఏం జరగబోతోంది ? చర్చల ఫలితం ఎలా ఉండబోబోతంది అన్న అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది ట్రంప్ ఆశిస్తున్నదేంటి ? ఉత్తర కొరియా అణ్వస్త్రరహిత దేశంగా మారిపోవాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా దారిలోకి తెచ్చుకునే అంశంలో విజయం సా«ధించాలన్న పట్టుదలతో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఈ సమావేశంతో సానుకూల ఫలితాలే వస్తాయన్న సంకేతాలను ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కి ట్రంప్ ప్రభుత్వం పంపింది. ఉత్తర కొరియాలో అణు తనిఖీలు నిర్వహించడానికి మరి కొద్ది వారాల్లో ఐఏఈఏ బృందం ఆ దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఇద్దరు అధినేతలు సమావేశం కానున్నారు. కిమ్‌తో చర్చల ద్వారా ఉత్తర కొరియా భూభాగంలో పట్టు పెంచుకోవడానికి ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉభయ కొరియాలను చైనా నుంచి వేరు చేసే ఎల్లో సముద్రంపై కొంతవరకైనా ఆధిపత్యం సాధించాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన 30 వేల బలగాలు ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ సమావేశం సానుకూలంగా సాగితే అమెరికాకు సైనిక వ్యయం తగ్గడమే కాకుండా, చైనా కార్యకలాపాలను కూడా ఓ కంట కనిపెట్టేలా ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. కిమ్ కోరుకుంటున్నదేంటి? ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తన పరిపాలనకు ఒక గుర్తింపు, ఉత్తర కొరియాకు అణుదేశం అన్న హోదా దక్కించుకోవాలన్న ప్రధాన ధ్యేయంతో ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తన ఉనికిని కాపాడుకోవాలన్నా, దేశానికి భద్రత ఉండాలన్నా అణు బాంబు అత్యంత అవసరం అన్న భావనలో ఇప్పటికీ కిమ్ ఉన్నారు. అందుకే తమ దేశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్న ధీమా కూడా ఆయనలో ఉంది. ఇక సింగపూర్ చర్చల ద్వారా ఉత్తరకొరియాపై ఆర్థిక ఆంక్షలను తొలగించేలా అడుగులు ముందుకు పడాలని కిమ్ కోరుకుంటున్నారు. తన తండ్రి హయాంలో ఉత్తర కొరియా కరువు బారిన పడి అల్లాడిపోయిందని, తన పాలనలో అలాంటి పరిస్థితి రాకూడదని కిమ్ తన ప్రసంగాల్లో తరచు చెబుతూ వస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు తొలగిపోతే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయించవచ్చునన్న ఆలోచనలో కిమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఖుక్రీలు, రైఫిల్స్‌తో నేపాలీ గూర్ఖాల భద్రత ట్రంప్, కిమ్ చరిత్రాత్మక సమావేశానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు అధినేతలు తమ తమ భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకుంటున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. సంప్రదాయంగా వస్తున్న నేపాలీ గూర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ప్రపంచంలో అత్యంత పోరాటపటిమను, తెగువను ప్రదర్శించే గిరిజన తెగగా వీరికి పేరుంది. వీరిద్దరి భేటీ జరిగే సెంటోసా దీవులు, అధినేతలు ఇద్దరూ బస చేసే హోటల్స్, ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ ఈ గూర్ఖాలే డేగ కళ్లతో కాపలా కాస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్ల కోసం సింగపూర్ పోలీసులు ఏరికోరి నేపాలీ గూర్ఖాలను తీసుకొని వారికి శిక్షణ ఇస్తూంటారు.. వీరి చేతిలో ఎప్పుడూ బల్గేరియాలోతయారైన అత్యంత ఆధునికమైన అతి పెద్ద రైఫిల్స్ , కాళ్ల దుస్తుల్లో పిస్టల్స్ ఉంటాయి. ఎన్ని రకాల ఆధునిక ఆయుధాలు చేతికి ఇచ్చినా ఈ గూర్ఖాలు తరతరాలుగా తమ దగ్గరున్న సంప్రదాయ ఆ«యుధం ఖుక్రీ (వంపులు తిరిగి ఉన్న కత్తి) లేకుండా కదన రంగంలోకి దిగారు. ఈ ఖుక్రీ అత్యంత పదునైనది. అందుకే అది లేకుండా గూర్ఖాలు తమ విధులకు కూడా హాజరు కారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ పర్యటన సమయంలోనూ నేపాలీ గూర్ఖాలే భద్రత నిర్వహించారు. సింగపూర్‌కు చెందిన ఆరు పారామిలటరీ బలగాల్లో నేపాలీ గూర్ఖాలదే ప్రధాన పాత్ర. మొత్తం 1800 మంది నేపాలీ గూర్ఖాలు సింగపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 200 ఏళ్లకి పూర్వం బ్రిటీష్ వలస పాలనా కాలం నుంచే సింగపూర్‌లో నేపాలీ గూర్ఖాల నియామకం జరుగుతూ వస్తోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రాంతీయ దూకుడుకు అడ్డుకట్ట!
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సరైన మెజారిటీ రాని పక్షంలో సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యే అవకాశాలతో.. కమలదళంలో ఒక రకమైన కలవరం మొదలైంది. కర్ణాటక ఫలితాలు, ఎస్పీ–బీఎస్పీల పొత్తు ప్రభావంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ ముఖ్య నేతలు బీజేపీ కీలక నేతలతో త్వరలోనే సమావేశం కానున్నారు. సమీప భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలను, ప్రాంతీయ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసి బీజేపీ బేస్‌ను పెంచే కార్యాచరణతోపాటుగా జాతీయ విద్యా విధానం, భద్రతాపరమైన అంశాలు, కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులనూ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై దృష్టి మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలకు ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు చెబుతుండటం, అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వంపైనా పలు (ఆర్థికాంశాలు, ఇంధన ధరల పెరుగుదల, దళితులతోపాటు మైనార్టీల్లో అసంతృప్తి, మహిళలపై అత్యాచారాలు తదితర) అంశాల్లో కనబడుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సమీక్షించాలని సంఘ్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇకపై రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎన్నికల వ్యూహాలను నిర్ణయించే భేటీల్లో ఆరెస్సెస్ కీలక పాత్ర పోషించనుంది. కర్ణాటక ఎన్నికల కోసం స్థానిక స్వయం సేవకులతోపాటు పక్క రాష్ట్రాల నుంచి 50 వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు రెండు నెలలపాటు శ్రమించారు. దీంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడంపైనా ఆరెస్సెస్ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతున్న బీజేపీ.. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ దూసుకుపోవాలనే ప్రయత్నాల్లో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికితోడు ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో క్షేత్రస్థాయి కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
దిగ్గజాల రూటే వేరు!
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ మార్కెట్లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వాటాను పెంచుకునేందుకు 2018 సంవత్సరంలో భిన్న విధానాలను ఆచరణలో పెట్టనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు ఈ కామర్స్ మార్కెట్లో పై చేయి సాధించేందుకు గాను తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. అగ్ర స్థానం కోసం మార్కెటింగ్ వ్యూహాల పరంగా ఒకదాన్ని ఇంకొకటి అనుకరించేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ, కొత్త ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భిన్నంగా అడుగులు వేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. చైనా అలీబాబా వెన్నుదన్నుతో పేటీఎం మాల్ సైతం మూడో పక్షంగా అవతరించనుందని భావిస్తున్నారు. చిన్న పట్టణాలపై ఫ్లిప్‌కార్ట్ గురి ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించనుంది. తన సొంత బ్రాండ్ ఉత్పత్తులతో వినియోగదారులను చేరువ కావాలన్న వ్యూహంతో ఉంది. అమెజాన్ ప్రీమియం కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించనుంది. మొత్తం మీద ఇరు కంపెనీలు ప్రస్తుత తమ స్థానాలను పటిష్టంగా కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే విధానాలను అమలు చేయబోతున్నాయి. ‘‘మొదటి సారి ఈ కామర్స్ మార్కెట్ లీడర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండు భిన్న మార్గాలను అనుసరించడాన్ని చూడబోతున్నాం’’అని హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) అనలిస్ట్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. కేవలం సరుకుల అమ్మకాల విలువ (జీఎంవీ)పైనే ఈ మార్కెట్ ఎంతో కాలం కొనసాగకపోవచ్చని, ఆన్లైన్ కొనుగోలుదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు, కొత్త విభాగాలలో వృద్ధి ఉండొచ్చని ‘ఇండియా ఇంటర్నెట్: ఆన్ ద వే టు ఇండియా ఈ కామర్స్ 2.0’ పేరుతో విడుదల చేసిన నివేదికలో రాజీవ్ శర్మ వివరించారు. స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు లభించేలా, కస్టమర్లు ఆశించేవన్నీ అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. మెట్రోలకు వెలుపల విస్తరించి ఉన్న పట్టణాల్లోని కస్టమర్లకు చేరువ కావాలన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. ప్రైవేటు లేబుల్స్ ఉత్పత్తుల ద్వారా వారిని చేరువ కావాలనుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్ మొత్తం విక్రయాల్లో దాని సొంత లేబుల్స్ ఉన్న ఉత్పత్తుల విలువ 15 నుంచి 20 శాతం వరకు ఉంది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత అమ్మకాల్లో 45 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తోంది. అమెజాన్ కూడా చిన్న పట్టణాల మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం అమెజాన్ విక్రయాల్లో 65 శాతం వాటా మెట్రో నగరాల నుంచే ఉంది. ఇందులోనూ ‘అమెజాన్ ప్రైమ్’ పాత్ర కీలకం. అమెజాన్ ఇండియా ఫ్యాషన్, కిరాణా ఉత్పత్తులపైనా ప్రత్యేకమైన దృష్టి సారించనుంది. -
సోనియా, రాహుల్ ఏం చేస్తారు?
హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ వ్యూహమేమిటి? న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించనున్నారనే అంశాన్ని పార్టీ సస్పెన్స్‌లో ఉంచింది. హెరాల్డ్ కేసులో ‘నేరపూరిత కుట్ర’తో సహా పలు ఆరోపణలపై శనివారం కోర్టుకు హాజరుకానున్న వీరిద్దరూ న్యాయస్థానంలో బెయిలు పిటిషన్ వేస్తారా? లేదా అన్న అంశంపై రాజ్యసభలో ఆ పార్టీ నేత గురువారం స్పందిస్తూ ‘అందుకు ఇంకా చాలా సమయం ఉంద’ని వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును ప్రైవేటు వ్యక్తి అయిన సుబ్రహ్మణ్య స్వామి లేవనె త్తారు. మా పార్టీకి న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసముంది. కేసును అన్ని విధాలా ఎదుర్కొంటాం’ అని వెల్లడించారు. కోర్టుకు హాజరైనంతమాత్రాన జైలుకు వెళ్తారని భావించలేమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాదులను సంప్రతించి నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ పేర్కొన్నారు. -
‘చేతి’కి దెబ్బ మీద దెబ్బ
న్యూఢిల్లీ: వరుస పరాజయాలు బెడిసికొడుతున్న వ్యూహాలు.. కాంగ్రెస్‌ను ఏ విధంగానూ కోలుకోనివ్వటం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ గెలుపులేదు. కనీసం గౌరవప్రదమైన ఓటమితోనైనా సరిపెట్టుకోలేకపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 42స్థానాలు మాత్రమే గెలిచి అవమానకరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడా మెరుగైన సీట్లు గెలుచుకోలేపోయింది. తెలంగాణ ఇచ్చినందుకు 21సీట్లతో పరువు దక్కించుకున్నా, ఏపీలో జీరో అయిపోయింది. ఒడిశాలోనూ పరాజయం తప్పలేదు. ఆ తరువాత మహారాష్ట్ర, హరియాణ, ఝార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లలో ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది. నిజానికి 2013నుంచే కాంగ్రెస్ పతనం స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఆ సంవత్సరం జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కర్ణాటక మినహా ఏ పెద్ద రాష్ట్రాన్నీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మిగిలినవి 9 రాష్ట్రాలే. వీటిలో 5 ఈశాన్య రాష్ట్రాలే కావటం గమనార్హం.