సోనియా, రాహుల్ ఏం చేస్తారు?
హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ వ్యూహమేమిటి?
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించనున్నారనే అంశాన్ని పార్టీ సస్పెన్స్‌లో ఉంచింది. హెరాల్డ్ కేసులో ‘నేరపూరిత కుట్ర’తో సహా పలు ఆరోపణలపై శనివారం కోర్టుకు హాజరుకానున్న వీరిద్దరూ న్యాయస్థానంలో బెయిలు పిటిషన్ వేస్తారా? లేదా అన్న అంశంపై రాజ్యసభలో ఆ పార్టీ నేత గురువారం స్పందిస్తూ ‘అందుకు ఇంకా చాలా సమయం ఉంద’ని వ్యాఖ్యానించారు.
‘ఈ కేసును ప్రైవేటు వ్యక్తి అయిన సుబ్రహ్మణ్య స్వామి లేవనె త్తారు. మా పార్టీకి న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసముంది. కేసును అన్ని విధాలా ఎదుర్కొంటాం’ అని వెల్లడించారు. కోర్టుకు హాజరైనంతమాత్రాన జైలుకు వెళ్తారని భావించలేమని ఆయన స్పష్టం చేశారు. న్యాయవాదులను సంప్రతించి నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ పేర్కొన్నారు.