నెట్టింట.. లాభాల పంట | The new trend in business is social media | Sakshi
Sakshi News home page

నెట్టింట.. లాభాల పంట

Published Wed, Apr 26 2023 4:49 AM | Last Updated on Wed, Apr 26 2023 4:49 AM

The new trend in business is social media - Sakshi

సాక్షి, కర్నూలు డెస్క్‌: రైతులు తాము పండించిన ఉత్పత్తుల్ని అమ్ముకోవాలన్నా.. వ్యాపారులు సరుకు విక్రయించాలన్నా స­వాలక్ష సమస్యలు. పంట బాగా పండినా కోత కోయడం.. మార్కెట్‌కు తరలించడం.. అమ్ముకోవడం.. తీ­రా లెక్కలు వే­సు­కుంటే పెట్టుబడి కూడా దక్కలే­దని నిట్టూరుస్తూ ఇంటికి చే­రుకోవడం రైతులకు మామూలైపోయింది. ఈ కోవలోనే వ్యాపారు­లు కూడా. ఎంత నాణ్యమైన సరుకును దుకా­ణం­లో ఉంచినా మాటల గారడీ చేయలేక.. వి­ని­యోగదారులను మో­సగించలేక సతమతమ­య్యే వ్యాపారులు లేకపోలేదు. ఇలాంటి వారికి సోషల్‌ మీడియా చక్కటి పరిష్కారం చూపుతోంది.

ఏ మార్కెట్‌కు తీసుకెళ్లాలనే బెంగ లేదు 
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చే­తికి అందుతుందనగానే రైతును సవాలక్ష ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దిగుబ­డిని ఎక్కడ అమ్మాలి. ఏ మార్కెట్‌లో ఎక్కువ ధర వస్తుంది. కొన్ని రోజులు ఆగితే ధరలో మార్పు ఉంటుందా? ప్రస్తు­త ధరకు అమ్మితే కనీసం పెట్టుబడి అయి­నా దక్కుతుందా? ఇలా నిద్రలేని రాత్రు­లు ఎన్నో గడిపే రైతులకు ఇప్పుడా బెంగ లేదు.

ఉత్పత్తులను నేరుగా రైతులే విక్ర­యించుకునే అవకాశం ఏర్పడింది. వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి.. ధర కూడా రైతులే నిర్ణయించే రోజులు వస్తుండటం విశేషం. దళారుల ప్రమే­యం లేకుండా సొంతంగా విక్రయాలు చేప­ట్టాలంటే నాణ్యత తప్పనిసరి. వినియోగదారుడు ఒక్కసారి ఇష్టపడితే.. ఆ తర్వాత ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ కొనుగోలు చేస్తారు.  

ఫోన్‌ చేస్తే చాలు.. 
ఒకప్పుడు ఫలానా వస్తువు కొనుగోలు చే­యాలంటే ఎక్కడ దొరుకుతుందో.. నా­ణ్యం­గా ఉంటుందో లేదో.. ధర కరెక్టుగా­నే చెబుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. ఇ­ప్పుడు ఏది కావాలన్నా నెట్‌లో వెతి­కి­తే.. వివరాలు అరచేతిలో వచ్చి వాలతా­యి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొను­గోలు చేస్తున్న రోజులు. వ్యాపారంలో పోటీ పెరగడంతో ఇప్పుడు విక్రయదారులు ఒక అడుగు ముందుకేసి, ఫోన్‌ చేస్తే చాలు ఎక్కడికైనా పార్సిల్‌ చేస్తున్నా­రు.

ఒకటి రెండు రూపాయలు తక్కువ లాభం వచ్చి నా.. ఫోన్‌ చేసిన వినియోగదారులు సంతృప్తి చెందితే ఆ తర్వాత తమ వ్యాపార ఖాతాలో చేరిపోతారనే భావన కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితు­ల్లో అద్దెకు దుకాణం సంగతి పక్కనపెడితే.. అడ్వాన్సుల పేరు వింటేనే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. వ్యాపారం జరుగుతుందో లేదో కానీ.. దుకాణం దక్కించుకోవడమే గగనం అవుతోంది. ఆ తర్వాత వ్యాపా­రానికి అనుగుణంగా  ఫరి్నచర్, సిబ్బంది నియా­మకం కలిపి లెక్కలేస్తే తడిసి మోపెడవుతుంది. అదే నెట్టింట్లో వ్యాపారం చేస్తే ఇవన్నీ మిగులుబాటే.

మామిడి పండ్ల ప్రేమికులకు నమస్సులు.. 
మూడేళ్లుగా మా తోటలో రసాయన మందులు వాడకుండా మామిడి పండిస్తున్నాం. రసాయనాలు వాడకుండా మగ్గించిన పండ్లను అమ్మకాలను ఈ నెల 23 నుంచి కర్నూలు కృష్ణానగర్‌లోని రామకృష్ణ స్కూల్‌ వద్ద ప్రారంభిస్తున్నాం. కిలో ధర కవర్లలో అయితే రూ.120, కవర్లు లేకుంటే కిలో రూ.100. కవర్లు లేకుండా చిన్న సైజు మామిడి ధర రూ.80.    – సోషల్‌ మీడియాలో ఓ రైతు చేసిన పోస్ట్‌ 

అందరికీ నమస్కారం 
మేం స్వచ్ఛమైన వేరుశనగ (పల్లీ) నూనె గానుగ ఆడించి అ­మ్ముతున్నాం. కేజీ రూ.280. ప్రత్యేకంగా పండించిన తెల్ల నువ్వుల నూనె (గానుగ ఆడించినది) కేజీ రూ.500, పొ­ద్దుతిరుగుడు గింజల నూనె రూ.380, కుసుమ నూనె రూ.­400, కొబ్బరి నూనె రూ.460 చొప్పున అమ్ముతున్నాం. ఆర్డర్లపై ఏ ప్రాంతానికైనా పంపుతాం. 
– సామాజిక మాధ్యమాల్లో తన ఇంటినుంచి ఓ వ్యాపారి చేసిన పోస్ట్‌ 

నిరసన కూడా తెలపొచ్చు 
కర్నూలు చెక్‌ పోస్ట్‌ సమీపంలోని ఓ బడా స్మార్ట్‌ దుకాణంలో ఓ వ్యక్తి 25 కేజీల బియ్యం బ్యాగు కొన్నాడు. అ­న్నం వండి తినబోతే ముక్కిన వాసన రావడంతో అన్నమంతా వదిలేయాల్సి వచ్చి ంది. సాయంత్రం ఆ స్టోర్‌కు వెళ్లి అడిగితే.. ‘రేపు తీసుకురండి. మరో బ్రాండ్‌ ఇ­స్తాం’ అన్నారు. తీసుకెళ్లాక ఒరిజినల్‌ రశీదు కావాలన్నారు.

బ్యాగ్‌ చూపించి మీ వద్ద కొన్నదేనని, కావాలంటే మీ సిస్టంలో చూడమని కోరితే మేనేజర్‌ కోపగించుకుని మాకు సంబంధం లేదన్నాడు. దీంతో ఆ బియ్యాన్ని ఆ దుకా­ణం ఎదుటే పారబోసి.. అదే విషయా­న్ని సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ విషయం క్షణాల్లోనే సిటీ అంతా తెలిసింది. ఆ తరువాత సదరు వినియోగదారుడికి ఆ స్టోర్‌ మేనేజర్‌ ఫోన్‌ చేసి.. నష్టనివారణ చర్యలు చేపట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement