సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతుల ధర్నా
సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
భానుపురి (సూర్యాపేట): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం, దొడ్డురకం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు గేటు ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రేవంత్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఇటీవల కేబినేట్ సమావేశంలో మాత్రం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే ఇవ్వా లని నిర్ణయించడం సరైంది కాదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తుతూ కొందరు రైతులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు నిధులను కూడా సకాలంలో అందించాలని, సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మొండివైఖరిని విడనాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు భిక్షం, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment