న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలలో 24వేల కొత్త కేసులు నమోదయ్యాయని ట్రేడర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. ఈ చైన్‌ను అరికట్టాలంటే.. కనీసం 15 రోజులు లాక్‌డౌన్ విధించాలని లేఖలో కోరారు.
అదేవిధంగా, ఢిల్లీకి చేరుకునే అన్నిరకాల మార్గాలను మూసివేయాలని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ లేఖలో కోరింది. అయితే, కోవిడ్ విజృంభన వలన ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
చదవండి: కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment