norms
-
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రిజిస్టర్‌కాని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు(ఫిన్ఫ్లుయెన్సర్ల)ను నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉపక్రమించింది. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇటీవల అన్‌రిజిస్టర్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లతో పెరుగుతు న్న రిసు్కలపై ఆందోళనల కారణంగా సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. విడిగా జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల ద్వారా రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్‌కాని వ్యక్తుల మధ్య సహకారంపై పరిమితులు విధించింది. ఈ అంశాలపై ప్రతిపాదనలను గత నెలలోనే సెబీ బోర్డు అనుమతించింది. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సెబీ నియంత్రణలోని ఏజెంట్లు, సంబంధిత వ్యక్తులపై ఆంక్షలు వర్తించనున్నాయి. సొమ్ము సంబంధ ఎలాంటి లావాదేవీలు, క్లయింట్‌కు రిఫర్ చేయడం, ఏ ఇతర వ్యక్తులతోనూ ఐటీ సిస్టమ్స్‌తో జత కలవడం తదితరాలు నిషిద్ధం. అంతేకాకుండా వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సలహాలు, రికమండేషన్లు, స్పష్టమైన రిటర్నుల క్లెయిములు తదితరాలను చేపట్టకూడదు. సెబీ వద్ద రిజిస్టరైన లేదా బోర్డు అనుమతిస్తే తప్ప నియంత్రణలోలేని సంస్థలు, సంబంధిత ఏజెంట్లు సైతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవేమీ చేపట్టేందుకు అనుమతి ఉండదు. ఫిన్ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఇందుకు నైపుణ్యాలు, జవాబుదారీతనం వంటి అంశాలలో సెబీ ప్రమాణాలకు తెరతీసినట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఫిన్‌ఫ్లుయెన్సర్లతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రీసెర్చ్ నిపుణులు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, స్టాక్ బ్రోకర్లు జత కట్టేందుకు వీలుండదు. -
ఆర్బీఐ కఠిన నిబంధనలు.. నవంబర్ 1 నుంచి అమలు
ముంబై: బ్యాంకుల్లో నగదు చెల్లింపు సేవలు (క్యాష్ పే–అవుట్స్) ఇక మరింత కఠినతరం కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై నగదు గ్రహీతల రికార్డులను రుణదాతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. నగదు చెల్లింపు అనేది బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల నుండి బదిలీ చేయబడే మొత్తాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశం. ఆర్బీఐ ’డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్’కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను అక్టోబర్ 2011 సవరించింది. -
ప్యాసివ్ ఫండ్స్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది. ప్యాసివ్ పథకాలు అంటే?మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది. సభ్యులందరికీ ఒకే చార్జీలుస్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ముకుతాడు
ముంబై: ఆర్థిక అంశాల విషయంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు నిబంధనలను కఠినతరం చేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ డిపాజిట్ల మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఒక ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. కొన్ని నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ ముసాయిదా పత్రంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. హెచ్ఎఫ్సీల డిపాజిట్ల చెల్లింపులకు సంబంధించి నిధుల లభ్యత అవసరాల నిర్వహణను మెరుగుపరచుకోవడంపై కూడా ఈ సర్క్యులర్‌లో ఆర్బీఐ దృష్టి సారించింది. ప్రతిపాదిత తాజా ముసాయిదా ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌లు లేని హెచ్ఎఫ్సీలు పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించలేవు. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంతో పాటు నిర్దిష్ట రుసుము ఆధారిత కార్యకలాపాలలోకి హెచ్‌ఎఫ్‌సీలను అనుమతించే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతితో, రిస్క్ షేరింగ్ లేకుండా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులతో కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి కొన్ని హెచ్ఎఫ్సీలకు అనుమతి లభిస్తోంది. ఇది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి వర్తిస్తుంది. అటుపై దీనిపై సమీక్ష, దీనికి అనుగుణంగా తదుపరి అనుమతులు ఉంటాయి. ప్రస్తుతం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (120 నెలల లోపు) తర్వాత తిరిగి చెల్లించే విధంగా పబ్లిక్ డిపాజిట్లను ఆమోదించడానికి లేదా పునరుద్ధరించడానికి అనుమతిఉంది. తక్షణం అమలు... 120 నెలల వరకూ డిపాజిట్ల ఆమోదం లేదా పునరుద్ధరణకు వీలుంది. దీనిని 5 సంవత్సరాలకు తగ్గించాలన్నది తాజా ముసాయిదా ఉద్దేశం. అయితే ఈ నిబంధన తక్షణం అమల్లోకి వచి్చనట్లు కూడా ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొనడం గమనార్హం. ‘‘ఇకమీదట, ఈ సర్క్యులర్ తేదీ నుండి హెచ్ఎఫ్సీలు ఆమోదించిన లేదా పునరుద్ధరించిన పబ్లిక్ డిపాజిట్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ గడువు 60 నెలలకు పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే అరవై నెలల కంటే ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్న డిపాజిట్లు ఆయా హెచ్ఎఫ్సీల ప్రస్తుత రీపేమెంట్ ప్రొఫైల్ ప్రకారం తిరిగి చెల్లించడం జరుగుతుంది’’అని ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొంది. ఒకవేళ ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్ కనీస పెట్టుబడి గ్రేడ్ కంటే తక్కువగా ఉంటే, అటువంటి హెచ్ఎఫ్సీలు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ పొందే వరకు ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్దరించలేవని, లేదా తాజా డిపాజిట్లను అంగీకరించలేవని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక డిపాజిట్ తీసుకునే హెచ్ఎఫ్సీలు కలిగి ఉన్న పబ్లిక్ డిపాజిట్ల పరిమాణ సీలింగ్ (పరిమితి) ప్రస్తుతం తమ సొంత నికర నిధుల్లో 3 రెట్లు ఉంటే, దీనిని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, తాజా ముసాయిదా ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాలు/విపత్తుల కారణంగా ముందస్తు–మెచ్యూర్ ఉపసంహరణ అనుమతులకు హెచ్ఎఫ్సీలకు వీలుకలుగుతోంది. ఎన్బీఎఫ్సీ నిబంధనలతో సమన్వయం.. తాజా చర్యల ద్వారా ఇతర నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) బాటలోకి హెచ్‌ఎఫ్‌సీలను తీసుకురావాలని భావిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుండి హెచ్ఎఫ్సీల నియంత్రణను బదిలీ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ 2020 అక్టోబర్ 22వ తేదీన తొలిసారి ఈ సంస్థల కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. హెచ్ఎఫ్సీలు –ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనల మధ్య మరింత సమన్వయం తీసుకురావడం కోసం దశలవారీగా ప్రయత్నం జరుగుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్ట చేసింది. ఏప్రిల్ నుంచి తాజా రుణ ‘చార్జీ’ నిబంధనల అమలు... బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా చార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన సవరిత ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది.బ్యాంకులు– నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లిపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా చార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా చార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి చార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
సీలింగ్ ఫ్యాన్లకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు
Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు. ఎంఎస్ఎంఈలకు సడలింపులు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. -
లోన్ యాప్స్ పై ఆర్ బిఐ కొరడా
-
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్‌లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్‌కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్‌ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
సంపూర్ణ లాక్డౌన్ అమలు!
సాక్షి, చెన్నై(తమిళనాడు): రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు కానుంది. అత్యవసర సేవలు మినహా.. దేనికీ అనుమతి లేదని పోలీసుయంత్రాంగం ప్రకటించింది. దీంతో శనివారం చేపలు, మాంసం మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. ఇక రాష్ట్రంలో రోజుకు సగటున మూడు వేలకు అటుఇటుగా.. కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ ఆదివారం లాక్‌డౌన్‌ను విజయవంతం చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. శనివారం రాత్రికే అన్ని చెక్ పోస్టుల్లోనూ రోడ్లను, వంతెనల్నీ సైతం మూసి వేశారు. దీంతో శనివారం మద్యం దుకాణాలు, కాయగూరల మార్కెట్లలో రద్దీ నెలకొంది. లక్ష మందికి రెండో డోస్... 18వ విడతగా రాష్ట్రంలో శనివారం వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. 50 వేల శిబిరాల్లో లక్షలాది మందికి రెండో డోస్ టీకా వేశారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్లలోపు బాల, బాలికలకు సైతం ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక, చెన్నై విమానాశ్రయంలో కరోనా, ఫీవర్ టెస్టులు విస్తృతం చేయడం కోసం ప్రత్యేకంగా కొత్త ఏర్పాట్లు జరిగాయి. చెన్నైలో మాస్క్ ధరించని 7,616 మందికి జరిమానా విధించి రూ. 15 లక్షలు జరిమానా వసూలు చేశారు. తమిళనాడులో మళ్లీ పూర్తిస్థాయిలో లాక్డౌన్ అవసరం రాదని.. కరోనా ప్రజల జీవితంలో కలిసి పయనిస్తుందని శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇక, చెన్నైలో కరోనా కట్టడి లక్ష్యంగా చర్యలు విస్తృతం చేయడం కోసం 15 మంది ఐఏఎస్‌లతోప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే చెన్నైలో ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళల్లో రెండు డోస్‌ల టీకా వేయించుకున్న వారినే సోమవారం నుంచి అనుమతించనున్నారు. చదవండి: కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు -
పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏటా రూ.లక్ష కోట్లు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను పెంచడానికి, సకాలంలో ఉత్పత్తి ఖర్చులను తిరిగి పొందడానికి కేంద్రం తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది. రాష్ట్రాలు, విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి క్రమం తప్పకుండా ఇంధన కొనుగోలుకు హామీ ఇచ్చింది. దీనికోసం దేశంలో 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటివరకూ ఏటా రూ.లక్ష కోట్లు (ట్రిలియన్) పెట్టుబడి పెట్టనుంది. నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటు 2019 నుంచి సోలార్ మాడ్యూల్స్ ధర అత్యధికంగా పెరిగింది. దాదాపు అన్ని రకాల మాడ్యూల్స్‌ను చైనా నుండి దిగుమతి చేసుకుంటుండగా.. విద్యుత్ సంక్షోభం కారణంగా అక్కడి ఫ్యాక్టరీలు పరిమిత రోజుల్లో మాత్రమే నడుస్తున్నాయి. దానివల్ల దేశంలో పునరుత్పాదక విద్యుత్ జనరేటర్లకు వాటిని సకాలంలో అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇది పునరుత్పాదక విద్యుత్ రంగం వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కేంద్రం మార్చిన నిబంధనల వల్ల నెలవారీ టారిఫ్‌లో సర్దుబాటును లెక్కించడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఉత్పత్తి సంస్థలు సకాలంలో ఖర్చులను రాబట్టుకోవచ్చు. నిరంతరం గ్రిడ్‌కు అనుసంధానం పునరుత్పాదక ఇంధన కర్మాగారాన్ని తప్పనిసరిగా నడపాల్సిన అవసరం లేదని నోటిఫైడ్ నియమాలు నిర్దేశించాయి. పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌లో ఏదైనా సాంకేతిక అవరోధం ఏర్పడినప్పుడు, విద్యుత్ గ్రిడ్ భద్రతా కారణాల వల్ల మాత్రమే నియంత్రిస్తారు. మిగతా అన్ని సమయాల్లో గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహాయపడుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. -
కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మన దేశ రాజధాని న్యూఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలలో 24వేల కొత్త కేసులు నమోదయ్యాయని ట్రేడర్స్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. ఈ చైన్‌ను అరికట్టాలంటే.. కనీసం 15 రోజులు లాక్డౌన్ విధించాలని లేఖలో కోరారు. అదేవిధంగా, ఢిల్లీకి చేరుకునే అన్నిరకాల మార్గాలను మూసివేయాలని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ లేఖలో కోరింది. అయితే, కోవిడ్ విజృంభన వలన ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చదవండి: కరోనా కల్లోలం: ఒక్కరోజే 1501 మంది మృతి -
టెల్కోలకు భారీ జరిమానా : జియోకు ఎంతంటే?
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశీయ టెలికాం దిగ్గజాలకు మరోసారి షాక్ ఇచ్చింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో లోపాల కారణంగా భారతి ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా కంపెనీలకు ట్రాయ్ భారీ జరిమానా విధించింది. వివిధ సేవల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐ నివేదించింది. 2017, అక్టోబరు 1 నుంచి సేవల (QoS) ప్రమాణాలను నిబంధనలను కఠినతరం చేసిన రెగ్యులేటరీ జనవరి-మార్చిలో సేవాల లోపాలకు సంబంధించి ఈ పెనాల్టీ విధించింది. ముఖ్యంగా టెలికాం మార్కెట్ సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు రూ.34 లక్షలు భారీ జరిమానా విధించింది. అలాగే భారతి ఎయిర్‌టెల్‌కు రూ.11 లక్షలు ఐడియా సెల్యులార్కు రూ.12.5 లక్షలు, వొడాఫోన్ ఇండియాకు రూ.4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అయితేతాజా జరిమానాపై టెల్కోలు ఇంకా స్పందించాల్సి ఉంది. -
నిబంధనలు పాటించకపోతే బ్లాక్‌లిస్ట్
కోల్డ్ స్టోరేజీ యజమానులకు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ హెచ్చరిక గుంటూరు (కొరిటెపాడు): అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించని కోల్డ్‌స్టోరేజీలను బ్లాక్‌లిస్టులో పెట్టి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు స్పష్టం చేశారు. స్థానిక చుట్టుగుంటలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్ల వ్యవధిలో ఏడు శీతల గిడ్డంగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కోల్డ్‌స్టోరేజీలపై నియంత్రణ లేదనే అపోహ వుందని, దానిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కోల్డ్‌స్టోరేజీలకు ప్రత్యేక లైసెన్సు విధానం తీసుకురావడానికి కొలతలు తయారు చేయాలని సూచించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారుల నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)లు క్రోడీకరించి ప్రతి ఏడాది లైసెన్సును రెన్యువల్ చేసేలా చూస్తామని, ఈ మూడు కంటిన్యుటీ లేకపోతే స్టోరేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్సు ధ్రువీకరణ పత్రానికి రాకపోతే బ్లాక్‌లిస్టులో పెడ్తామన్నారు. ప్రమాదాల నివారణకు పూర్తి కొలతలతో ప్రొఫార్మాను తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన శనివారం మధ్మాహ్నం 12 గంటలకు కోల్డ్‌స్టోరేజీల్లో ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం జరుగుతుందని తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి సీసీ కెమెరాలు, కార్బన్డైఆకై ్సడ్(నిప్పును ఆర్పేది), డ్రై స్ప్రింక్లర్స్ ఏర్పాటు, లక్ష లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. -
నిబంధనలనుంచి మినహాయింపు కోరిన 'యాపిల్'
అమెరికాకు చెందిన ఐఫోన్, ఐ ప్యాడ్ తయారీ సంస్థ యాపిల్ విడిభాగాల సమీరకణ నిబంధనలపై మరోసారి మినహాయింపును కోరింది. ఈ నేపథ్యంలో యాపిల్.. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక మండలి (డిప్) కు ఓ ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని దుకాణాలతోపాటు, ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి కోరిన సంస్థ.. డీఐపీపీకి వివరణ ఇచ్చింది. భారత్ లో వస్తువులను విక్రయించాలంటే 30 శాతం విడి భాగాలను దేశీయంగా సమీకరించాలన్న నిబంధన నుంచి యాపిల్ సంస్థ మినహాయింపు కోరుతూ మరోసారి వివరణ ఇచ్చింది. అమెరికా ఆధారిత సంస్థ దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి ఆమోదం కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) నిబంధనల ప్రకారం అత్యున్నత సాంకేతికత ఇమిడి ఉండే సింగిల్ బ్రాండ్ ఉత్పత్తులకు నిబంధనలు తప్పనిసరి చేసే అవకాశం లేకపోవడంతో యాపిల్ కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్ త్వరలోనే యాపిల్ సంస్థ ధరఖాస్తును స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సమీక్షించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీఐపిపి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ అనుమతి 100 శాతం ఉంది. కానీ కంపెనీలు 49 శాతం మించి ఉన్నపుడు ఎఫ్ ఐపిబి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను తమ స్వంత రిటైల్ దుకాణాల ద్వారా చైనా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం యాపిల్ స్వంత దుకాణాలను తెరవలేదు. రెడింగ్టన్, ఇన్ గ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తో పాటు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ గ్జియామీ కూడ భారత్ లో సింగిల్ బ్రాండ్ విక్రయశాలల ప్రారంభానికి అనుమతికోసం ధరఖాస్తు చేసుకుంది. -
ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనలు కఠినతరం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేసింది. తాజా మార్పుల ప్రకారం ఎన్బీఎఫ్సీలు 2017 నాటికల్లా నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్వోఎఫ్)ను దశలవారీగా రూ. 2 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 25 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత మైలురాళ్లను అధిగమించలేని పక్షంలో వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే, బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు ఈక్విటీ మూలధనాన్ని కనీసం 12 శాతం మేర ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది 10 శాతంగా ఉంది. డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలయితే ఈక్విటీ మూలధనాన్ని రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఇక 0.25 శాతంగా ఉన్న ప్రొవిజనింగ్‌ని 2018 మార్చి నాటికి 0.4 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది.