
ముంబై: బ్యాంకుల్లో నగదు చెల్లింపు సేవలు (క్యాష్ పే–అవుట్స్) ఇక మరింత కఠినతరం కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై నగదు గ్రహీతల రికార్డులను రుణదాతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.
కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. నగదు చెల్లింపు అనేది బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల నుండి బదిలీ చేయబడే మొత్తాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశం. ఆర్‌బీఐ ’డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్’కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను అక్టోబర్ 2011 సవరించింది.