సవరణలు చేపట్టిన సెబీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రిజిస్టర్‌కాని ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు(ఫిన్‌ఫ్లుయెన్సర్ల)ను నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉపక్రమించింది. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇటీవల అన్‌రిజిస్టర్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లతో పెరుగుతు న్న రిసు్కలపై ఆందోళనల కారణంగా సెబీ నిబంధనలను కఠినతరం చేసింది.
విడిగా జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల ద్వారా రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్‌కాని వ్యక్తుల మధ్య సహకారంపై పరిమితులు విధించింది. ఈ అంశాలపై ప్రతిపాదనలను గత నెలలోనే సెబీ బోర్డు అనుమతించింది. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సెబీ నియంత్రణలోని ఏజెంట్లు, సంబంధిత వ్యక్తులపై ఆంక్షలు వర్తించనున్నాయి.
సొమ్ము సంబంధ ఎలాంటి లావాదేవీలు, క్లయింట్‌కు రిఫర్ చేయడం, ఏ ఇతర వ్యక్తులతోనూ ఐటీ సిస్టమ్స్‌తో జత కలవడం తదితరాలు నిషిద్ధం. అంతేకాకుండా వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సలహాలు, రికమండేషన్లు, స్పష్టమైన రిటర్నుల క్లెయిములు తదితరాలను చేపట్టకూడదు.
సెబీ వద్ద రిజిస్టరైన లేదా బోర్డు అనుమతిస్తే తప్ప నియంత్రణలోలేని సంస్థలు, సంబంధిత ఏజెంట్లు సైతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవేమీ చేపట్టేందుకు అనుమతి ఉండదు. ఫిన్‌ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద రిజిస్టర్‌కావలసి ఉంటుంది.
అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఇందుకు నైపుణ్యాలు, జవాబుదారీతనం వంటి అంశాలలో సెబీ ప్రమాణాలకు తెరతీసినట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఫిన్‌ఫ్లుయెన్సర్లతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రీసెర్చ్ నిపుణులు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, స్టాక్ బ్రోకర్లు జత కట్టేందుకు వీలుండదు.
Comments
Please login to add a commentAdd a comment