financial authorities
-
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు
నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లు, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు. -
తెల్లవారితే మారే రూల్స్ ఇవే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. రేపటి నుంచి కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రెగ్యులేటరీ అప్డేట్లు, పన్ను సంస్కరణలు, విధాన మార్పులతోపాటు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపిన కొన్ని విభాగాల్లో మార్పులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి కింద తెలుసుకుందాం.ఆదాయపు పన్ను సంస్కరణలుకొత్త పన్ను శ్లాబులు, మినహాయింపులువార్షికంగా రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులను కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది గతంలో రూ.7 లక్షల పరిమితి నుంచి భారీగా పెరిగింది. వేతన ఉద్యోగులు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ నుంచి ప్రయోజనం పొందుతారు. దాంతో పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.12.75 లక్షలకు చేరింది.సెక్షన్ 87ఎ కింద పన్ను మినహాయింపు రూ .25,000 నుంచి రూ.60,000కు పెరుగుతుంది. ఇది రూ.12 లక్షల పన్ను రహిత పరిమితికి మద్దతుగా నిలుస్తుంది. అయితే ప్రత్యేక పన్ను రేట్లు (ఉదా.మూలధన లాభాలు) ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయానికి ఇది వర్తించదు.అధిక టీడీఎస్/ టీసీఎస్ పరిమితులుడిపాజిట్లపై వడ్డీ: సాధారణ పౌరులకు రూ.50,000 (గతంలో రూ.40,000), సీనియర్ సిటిజన్లకు రూ.లక్ష (గతంలో రూ.50,000) వరకు వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయింపు లేదు.టీడీఎస్ మినహాయింపును నెలకు రూ.20,000 (వార్షికంగా రూ.2.4 లక్షలు) నుంచి రూ.50,000 (వార్షికంగా రూ.6 లక్షలు)కు పెంచారు.లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఆర్ఎస్ కింద విదేశీ రెమిటెన్స్‌లపై టీడీఎస్ రూ .7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఇది చిన్న లావాదేవీలకు పన్ను భారాన్ని తగ్గిస్తుంది.ఐటీఆర్-యూ గడువు: అప్డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్-యూ) దాఖలు చేయడానికి విండో సంబంధిత మదింపు సంవత్సరం చివరి నుంచి 48 నెలల వరకు ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు గత ఫైలింగ్‌లను సరిదిద్దడానికి మరింత వెసులుబాటును ఇస్తుంది.పెన్షన్, రిటైర్మెంట్యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్): ఏప్రిల్ 1, 2025 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూపీఎస్ భర్తీ చేస్తుంది. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.డిజిటల్ పేమెంట్స్ అండ్ బ్యాంకింగ్యూపీఐ నిబంధనలు: మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ అయి ఉన్న యూపీఐ ఐడీలను (12 నెలలు ఉపయోగించనివి) డీయాక్టివేట్ చేయాలని ఆదేశించింది. మార్చి 31, 2025లోగా బ్యాంక్ రిజిస్టర్డ్ నెంబర్లను అప్డేట్ చేసుకోవాలి. యూపీఐ లైట్ వినియోగదారులు మెరుగైన భద్రత కోసం తప్పనిసరి పిన్, పాస్ కోడ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్‌తో వాలెట్ అమౌంట్‌ను తిరిగి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు.మినిమమ్ బ్యాలెన్స్ఎన్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు ఏప్రిల్ 1, 2025 నుంచి సేవింగ్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.ఏటీఎం ఛార్జీలునాన్ ఫైనాన్షియల్ ఏటీఎం లావాదేవీలకు (ఉదా.బ్యాలెన్స్ తనిఖీలు, మినీ స్టేట్మెంట్లు) రుసుము రూ.6 నుంచి రూ.7 వరకు పెరగవచ్చు. బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు రూ.2 వరకు పెరిగే అవకాశం ఉంది.యులిప్‌లపై మూలధన లాభాలువార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించిన యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్) నుంచి ఉపసంహరణలు బడ్జెట్ 2025 ప్రతిపాదనలకు అనుగుణంగా మూలధన లాభాల్లోకి వస్తాయి.వస్తు సేవల పన్ను (జీఎస్టీ)హోటల్ రెస్టారెంట్ సేవలు: రోజుకు రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ (ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌తో కలిపి) పరిధిలోకి వస్తాయి. ఇది లగ్జరీ ఆతిథ్య ఖర్చులను ప్రభావితం చేస్తుంది.ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టమ్: రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాన్ని పంపిణీ చేయడానికి ఐఎస్డీ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయడం, జీఎస్టీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుఆటోమొబైల్ ధరలుమారుతీ సుజుకి (4% వరకు), హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా (2-4%) వంటి కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి కొనుగోలుదారులను ప్రభావితం చేస్తుంది. -
ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రిజిస్టర్‌కాని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు(ఫిన్ఫ్లుయెన్సర్ల)ను నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉపక్రమించింది. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇటీవల అన్‌రిజిస్టర్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లతో పెరుగుతు న్న రిసు్కలపై ఆందోళనల కారణంగా సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. విడిగా జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల ద్వారా రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్‌కాని వ్యక్తుల మధ్య సహకారంపై పరిమితులు విధించింది. ఈ అంశాలపై ప్రతిపాదనలను గత నెలలోనే సెబీ బోర్డు అనుమతించింది. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సెబీ నియంత్రణలోని ఏజెంట్లు, సంబంధిత వ్యక్తులపై ఆంక్షలు వర్తించనున్నాయి. సొమ్ము సంబంధ ఎలాంటి లావాదేవీలు, క్లయింట్‌కు రిఫర్ చేయడం, ఏ ఇతర వ్యక్తులతోనూ ఐటీ సిస్టమ్స్‌తో జత కలవడం తదితరాలు నిషిద్ధం. అంతేకాకుండా వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సలహాలు, రికమండేషన్లు, స్పష్టమైన రిటర్నుల క్లెయిములు తదితరాలను చేపట్టకూడదు. సెబీ వద్ద రిజిస్టరైన లేదా బోర్డు అనుమతిస్తే తప్ప నియంత్రణలోలేని సంస్థలు, సంబంధిత ఏజెంట్లు సైతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవేమీ చేపట్టేందుకు అనుమతి ఉండదు. ఫిన్ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఇందుకు నైపుణ్యాలు, జవాబుదారీతనం వంటి అంశాలలో సెబీ ప్రమాణాలకు తెరతీసినట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఫిన్‌ఫ్లుయెన్సర్లతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రీసెర్చ్ నిపుణులు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, స్టాక్ బ్రోకర్లు జత కట్టేందుకు వీలుండదు. -
డీఎఫ్ఎస్గా వివేక్ జోషి బాధ్యతలు
న్యూఢిల్లీ: సీనియర్ బ్యూరోక్రాట్ వివేక్ జోషి మంగళవారం ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి (డీఎఫ్ఎస్)గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికమంత్రిత్వశాఖ నియంత్రణలో ఆర్థిక సేవల శాఖ పనిచేస్తుంది. రెవెన్యూ కార్యదర్శిగా బదిలీఅయిన సంజయ్ మల్హోత్రా స్థానంలో జోషి తాజా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం ముందు జోషి హోమ్ మంత్రిత్వశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్‌గా పనిచేశారు. జోషి 1989 హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, బీమా కంపెనీలు, నేషనల్ పెన్షన్ వ్యవస్థ కార్యకలాపాలను డీఎఫ్ఎస్ పర్యవేక్షిస్తుంది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది
ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి. ‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్ అవుతున్నారు. ఇది వెల్త్ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర. అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!! ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు. డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్ ఎంత ముఖ్యమో, రైట్ డైరెక్షన్లో చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి. కలను దర్శించాలి! ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్ కాలర్ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి. రోజూ తెల్లకాగితమే! శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్ అకౌంటింగ్ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి. – వాకా మంజులారెడ్డి -
దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు'
ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బ్రెగ్జిట్ ఉదంతం దక్షిణ కొరియాను కూడా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక నిపుణులతో అధికారులతో చర్చలకు దిగింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడానికి దేశ ఆర్ధిక, ద్రవ్య అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహస్తోందని యాన్ హ్యాప్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడంతో ఆ పరిణామాలను ఎదుర్కొనేందుకు... సంబంధిత చర్యలకుపక్రమిస్తోందని తెలిపింది. ఈ భారీ పతనం నుంచి తప్పించుకునే మార్గాలపై చర్చించటానికి అత్యవసర సమావేశం నిర్వహిస్తోందని నివేదించింది. కాగా బ్రెగ్జిట్ సంక్షోంతో దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్లు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనంతో ద.కొరియా మార్కెట్లు కూడా అల్లకల్లోలంగా ఉన్నాయని చెప్పింది.