న్యూఢిల్లీ: సీనియర్ బ్యూరోక్రాట్ వివేక్ జోషి మంగళవారం ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి (డీఎఫ్‌ఎస్)గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థికమంత్రిత్వశాఖ నియంత్రణలో ఆర్థిక సేవల శాఖ పనిచేస్తుంది. రెవెన్యూ కార్యదర్శిగా బదిలీఅయిన సంజయ్ మల్హోత్రా స్థానంలో జోషి తాజా బాధ్యతలు స్వీకరించారు.
ఈ నియామకం ముందు జోషి హోమ్ మంత్రిత్వశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్‌గా పనిచేశారు. జోషి 1989 హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, బీమా కంపెనీలు, నేషనల్ పెన్షన్ వ్యవస్థ కార్యకలాపాలను డీఎఫ్‌ఎస్ పర్యవేక్షిస్తుంది.
చదవండి: ఎయిర్‌టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment