దక్షిణ కొరియాలో 'బ్రెగ్జిట్ బాంబు'
ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన బ్రెగ్జిట్ ఉదంతం దక్షిణ కొరియాను కూడా కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక నిపుణులతో అధికారులతో చర్చలకు దిగింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడానికి దేశ ఆర్ధిక, ద్రవ్య అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సంక్షోభంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహస్తోందని యాన్ హ్యాప్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడంతో ఆ పరిణామాలను ఎదుర్కొనేందుకు... సంబంధిత చర్యలకుపక్రమిస్తోందని తెలిపింది. ఈ భారీ పతనం నుంచి తప్పించుకునే మార్గాలపై చర్చించటానికి అత్యవసర సమావేశం నిర్వహిస్తోందని నివేదించింది.
కాగా బ్రెగ్జిట్ సంక్షోంతో దక్షిణ కొరియా ఆర్థిక మార్కెట్లు శుక్రవారం అతలాకుతలమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనంతో ద.కొరియా మార్కెట్లు కూడా అల్లకల్లోలంగా ఉన్నాయని చెప్పింది.