రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు.
- వరంగల్ లక్ష్మీపురం మార్కెట్‌కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్‌సేల్‌గా, రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్‌లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు.
- ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్‌రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment