
మైసూరు: ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలోను, విదేశాల్లోనూ టమాటకు భారీ ధర ఉంది. కేజీ వంద రూపాయల దాకా ఉండడంతో రైతులకు కనకవర్షం కురుస్తోంది. కానీ దొంగలు రాత్రిపూట పంటను ఎత్తుకెళ్లడం అక్కడక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత కోసం రైతులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు.
మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని కుప్పె గ్రామంలో నాగేష, కృష్ణ ఆనే ఇద్దరు రైతులు తమ టమాటా తోటలకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగేష 10, కృష్ణ 4 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశారు. ధర ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండుసార్లు తోటల్లో దొంగలు పడి ఎత్తుకుపోయినట్లు రైతులు వాపోయారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తూ దొంగలను అడ్డుకుంటామని రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment