వ్యాపారుల్లో నోటీసులదడ | Notices Palpitations to traders | Sakshi
Sakshi News home page

వ్యాపారుల్లో నోటీసులదడ

Published Sun, Nov 20 2016 2:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

వ్యాపారుల్లో నోటీసులదడ - Sakshi

వ్యాపారుల్లో నోటీసులదడ

సిక్కిం: ‘‘రూ.2.5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా... సక్రమమైతే వారికి ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి నోటీసులు కానీ వేధింపులు కానీ ఉండవు. నిరభ్యంతరంగా మీ డబ్బును ఖాతాలో జమ చేసుకోవచ్చు’’..ఇదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రోజున స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. కానీ, వాస్తవానికి జరుగుతున్న సినిమా వేరు. సిక్కిం గ్యాంగ్‌టక్‌లోని డెన్‌జోంగ్ సినిమా రోడ్‌లోని సీతారాం ఎంటర్‌ప్రైజెస్ ఈనెల 13న గ్యాంగ్‌టక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.4.51 లక్షలు డిపాజిట్ చేసింది. దీంతో ఆ సంస్థకు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులందారుు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో ‘పెద్ద’ల కంటికి కునుకులేకుండా చేసిన కేంద్రం.. తాజాగా మరింత భయపెట్టిస్తోంది. బ్యాంక్ ఖాతాలో ఎంతైనా డిపాజిట్ చేసినా ఎలాంటి దిగులు వద్దన్న ప్రధాని, ఆర్థిక మంత్రి మాటలతో హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్న వారికి.. ఇప్పుడు రూ.2.5 లక్షల కంటే చిల్లిగవ్వ ఎక్కువ డిపాజిట్ చేస్తే నోటీసులు తప్పవన్న భయాలు మొదలయ్యారుు. ఈ నేపథ్యంలో సీతారాం ఎంటర్‌ప్రెజైస్ నోటీసుల వ్యవహారంలో నిజానిజాలను తెలుసుకునేందుకు ‘సాక్షి ప్రతినిధి’ ప్రయత్నించారు.

 సీతారాం ఎంటర్‌ప్రైజెస్ ఉందా?: నోటీసుల్లో పేర్కొన్నట్టు గ్యాంగ్‌టక్‌లో అసలు సీతారాం ఎంటర్‌ప్రైజెస్ లేదని కొందరి వాదన. చుట్టుపక్కల వ్యాపారుల్ని సంప్రదించగా.. సీతారాం ఎంటర్‌ప్రైజెస్ ఆ భవనంలోనే ఉన్నా దానికి తాళం వేసినట్లు తెలిసింది. చుట్టుపక్కల వారిని సంప్రదించి సంస్థ యజమాని ఫోన్ నంబర్ సంపాదించి.. మాట్లాడే ప్రయత్నం చేసింది సాక్షి.. ఆ ప్రయత్నాలూ ఫలించలేదు. సీతారాం ఎంటర్‌ప్రైజెస్ సంగతి ఎలా ఉన్నా గ్యాంగ్‌టక్‌లో మార్కెట్ పరంగా లాల్‌మార్కెట్, ఎంజీ రోడ్‌లు ఆయువు పట్టుల్లాంటివి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఇక్కడికొచ్చి వ్యాపారం చేస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా వ్యాపారం పడిపోరుుందని స్థానిక వ్యాపారులు చెప్పారు. క్రెడిట్, డెబిట్ కార్డులతో వ్యాపారం సాగించొచ్చు కదా! అని సూచించగా.. తమ దగ్గర  క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకునేందుకు సదుపాయాలూ లేవని వెల్ల డించారు. కొద్ది మంది వ్యాపారులు కార్డు ద్వారా లావాదేవీలు జరపాలంటే వెనకాడుతున్నారు. కార్డులకు కూడా లిమిట్ పెట్టుకొని వ్యాపారం చేయడమే అందుకు కారణం.

 సీతారాం ఎంటర్‌ప్రైజెస్ నోటీసుల విషయాన్ని స్థానిక వ్యాపారుల వద్ద ప్రస్తావించగా.. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, వేరేవారి సంగతి తెలియదని చెప్పారు. నోటీసులొస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా ‘‘మేం వ్యాపారులం. నోట్లు రద్దు అనంతరం రెండు రోజులు పాత నోట్లు తీసుకున్నాం.. ఆ నోట్లనే బ్యాంకులో డిపాజిట్ చేశాం’ అని చెప్పారు. మొత్తంమ్మీద సీతారాం ఎంటర్‌ప్రైజెస్ వ్యవహారం వాస్తవమే అరుునా ఆ ప్రాంతంలోని ఇతర వ్యాపారుల్లో మాత్రం భయం నెలకొంది.
 
 నోటీసులొస్తే పన్ను కట్టాల్సిందేనా?
 నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందేనా? అంటే అలాంటిదేంలేదన్నది ఆదాయ పన్ను శాఖ అధికారుల సమాధానం. రూ.2.5 లక్షల లోపు డిపాజిట్ చేస్తే నోటీసులు రావనుకోవటం కూడా పొరపాటే. రూ.2.5 లక్షలు, ఆపై ఎంతైనా సరే డిపాజిట్ చేసుకునే వీలుంది. ఆ అదాయానికి సరైన లెక్కలు చూపాలి. సక్రమ ఆదాయమైతే ఎలాంటి భయాలు అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు.
- సిక్కిం నుంచి మంథా రమణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement