వరదయ్యపాళెం బీసీ కాలనీలోని ఓ ఇల్లు, వురో బియ్యుం గోడౌన్‌లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యూన్ని శనివారం సాయుంత్రం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు.
వరదయ్యుపాళెం: వరదయ్యపాళెం బీసీ కాలనీలోని ఓ ఇల్లు, వురో బియ్యుం గోడౌన్‌లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యూన్ని శనివారం సాయుంత్రం విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం 700 బస్తాల్లో వివిధ మోతాదుల్లో ఉండగా, జిల్లాలో ఇంత మొత్తంలో రేషన్ బియ్యం అధికారులకు పట్టుబడడం ఇదే మొదటిసారి. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు...కొంత కాలంగా వరదయ్యుపాళెం నుంచి రేషన్ బియ్యుం తమిళ నాడుకు తరలిస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులు,రేషన్ షాపుల నుంచి స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు రేషన్ బియ్యూన్ని కొనుగోలు చేసి వరదయ్యుపాళెంలోని ఓ ఇంట్లో, వురో గోడౌన్‌లో నిల్వ చేసేవారు. సేకరించిన రేషన్ బియ్యూన్ని లారీల్లో తమిళనాడులోని రైస్ మిల్లులకు తరలించేవారు. రైస్‌మిల్లుల్లో రేషన్ బియ్యూన్ని పాలిష్ చేసి గోతాలు వూర్చి సూపర్ ఫైన్ బియ్యుంగా మార్చి తరలించేవారు. వుూడేళ్లుగా రేషన్ బియ్యుం అక్రవు వ్యాపారం గుట్టు చప్పుడుకాకుండా సాగుతోంది. శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యాపారి తెర వెనుక రేషన్ బియ్యుం కొనుగోలు, విక్రయూలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
వరదయ్యుపాళెం బీసీ కాలనీకి చెందిన కొందరు అందించిన సవూచారం మేరకు దాడిచేసి బియ్యూన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బియ్యూన్ని గ్రావు రెవెన్యూ అధికారులు వుధుసూదన్ శర్మ, వునోహర్ రెడ్డి, రజనీ కువూర్‌కు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యుం విలువ సువూరు 5లక్షల రూపాయులకుపైగా ఉంటుందని ప్రాథమిక అంచనా.