విజిలెన్స్ అధికారుల దాడులు
విజిలెన్స్ అధికారుల దాడులు
Published Tue, Dec 20 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
– 107 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
– శనగపప్పు లారీ స్వాధీనం
వెల్దుర్తి రూరల్ : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులతో హడలెత్తించారు. వెల్దురి, పట్టణ పరిసరాల్లో సోమవారం రాత్రి దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేశారు. విజిలెన్స్ ఐఓపీ రామకృష్ణాచారి, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం కర్నూలు రీజనల్ విజిలెన్స్ అధికారి బాబురావు విడివిడిగా దాడులు చేశారు. మంగళవారం విజిలెన్స్ తహసీల్దార్ రామకృష్ణ, వెల్దుర్తి ఆర్‌ఐ సహేరాబానులు పంచనామా నిర్వహించారు. అనంతరం వివరాలను మీడియాకు వివరించారు. పాతబస్టాండు నుంచి కర్నూలుకు వెళ్లేదారిలో ఇండేన్ గ్యాస్ ఆఫీస్ వెనుక నిర్మాణంలో ఉన్న ఇంటిలో బియ్యం మాఫియా నిల్వ చేసిన బియ్యం బస్తాలను గుర్తించారు. 221 సంచుల్లో 107క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సేకరించిన మారెన్నపై కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని వెల్దుర్తి రెవెన్యూ విభాగానికి అప్పగించారు. పంచనామాలో హెడ్ కానిస్టేబుల్ నరేష్, సుబ్బరాయుడు, శేఖర్, వీఆర్‌ఓ సునీల్, వీఆర్‌ఏలు పాల్గొన్నారు. కర్నూలు రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ బాబూరావు జరిపిన దాడుల్లో బిల్లులు సరిగా లేని మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 20టన్నుల శనగపప్పులోడ్ లారీ, దుస్తులు తరలిస్తున్న ఆటో, నాపబండల లోడ్‌తో వెళు్తన్న ఐచర్ వాహనాన్ని తమకు అప్పగించినట్లు ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు.
Advertisement