రేషన్ బియ్యం పట్టివేత
- కర్ణాటకకు తరలిస్తుండగా తనిఖీలు
- 440 ప్యాకెట్లు స్వాధీనం
ప్యాపిలి : డోన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని ప్యాపిలి ఎస్‌ఐ తిమ్మయ్య స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం స్థానిక పెద్దమ్మ డాబా వద్ద వాహనాల తనిఖీలో భాగంగా కర్ణాటక వైపు వెళ్తున్న లారీ(కేఏ40 ఏ 8384)ని నిలిపి చెక్ చేయగా విషయం బయటపడింది. లారీలో ఉన్న 22 టన్నుల రేషన్ బియ్యం (440 పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వెంకటేశ్వర్లును (కొచ్చెర్వు) అదుపులోకి తీసుకుని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.