ప్రతీకాత్మక చిత్రం
చింతామణి(కర్ణాటక జిల్లా): కట్టుకొన్న భార్యను మద్యం మత్తులో లారీ కిందకు తోసేసి హతమార్చిన భర్త ఉదంతం శనివారం చింతామణి పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ వద్ద జరిగింది. వివరాలు.. శిడ్లఘట్ట ప్రాంతానికి చెందిన మునికృష్ణప్ప, చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కేదేపల్లె గ్రామానికి చెందిన సుమేరా సుల్తానా∙(38) దంపతులు. కూలీ పనులు చేస్తుంటారు.
వీరు కొడుకు బాబాజాన్ (10)తో కలిసి పని మీద చింతామణికి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న మునికృష్ణప్ప భార్యతో గొడవపడి లారీ వస్తుండగా దాని కిందకు ఆమెను తోసేశాడు. చక్రాల కింద పడిన ఆమె తల నుజ్జునుజ్జయి అక్కడే మృతి చెందింది. సీఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మునికృష్ణప్పను అదుపులోకి తీసుకొన్నారు. కళ్ల ముందే జరిగిన ఘోరంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. తల్లి మరణించి, తండ్రిని పోలీసులు పట్టుకుపోవడంతో బాలుడు రోదించాడు.
చదవండి: ‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్‌స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment