Chintamani
-
నడిరోడ్డుపై భర్త దాష్టీకం.. భార్యను లారీ కిందకు తోసి..
చింతామణి(కర్ణాటక జిల్లా): కట్టుకొన్న భార్యను మద్యం మత్తులో లారీ కిందకు తోసేసి హతమార్చిన భర్త ఉదంతం శనివారం చింతామణి పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ వద్ద జరిగింది. వివరాలు.. శిడ్లఘట్ట ప్రాంతానికి చెందిన మునికృష్ణప్ప, చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కేదేపల్లె గ్రామానికి చెందిన సుమేరా సుల్తానా∙(38) దంపతులు. కూలీ పనులు చేస్తుంటారు. వీరు కొడుకు బాబాజాన్ (10)తో కలిసి పని మీద చింతామణికి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న మునికృష్ణప్ప భార్యతో గొడవపడి లారీ వస్తుండగా దాని కిందకు ఆమెను తోసేశాడు. చక్రాల కింద పడిన ఆమె తల నుజ్జునుజ్జయి అక్కడే మృతి చెందింది. సీఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మునికృష్ణప్పను అదుపులోకి తీసుకొన్నారు. కళ్ల ముందే జరిగిన ఘోరంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. తల్లి మరణించి, తండ్రిని పోలీసులు పట్టుకుపోవడంతో బాలుడు రోదించాడు. చదవండి: ‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్‌స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్! -
చింతామణి నాటకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గం వారిని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే ఆ వర్గాల మధ్య ఘర్షణలకు ఆస్కారం కల్పించినట్లేనని, అందుకు తాము అంగీకరించబోమని హైకోర్టు స్పష్టం చేసింది. నాటకంలోని పాత్రల పేరుతో ఓ వర్గాన్ని కించపరిచేందుకు అనుమతించబోమని చెప్పింది. జీవనభృతి పేరుతో సామరస్యాన్ని దెబ్బతీయకూడదని స్పష్టం చేసింది. చింతామణి నాటకం ఒరిజినల్ తెలుగు పుస్తకం ఆన్లైన్ కాపీని ప్రభుత్వ న్యాయవాదులకు, ఆర్య వైశ్య సంఘాల తరఫు న్యాయవాదులకు అందజేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా ఆర్యవైశ్యులను వేశ్యాలోలురుగా చూపుతున్నారని, అందువల్ల నాటకాన్ని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఆ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు శుక్రవారం సీజే ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయన్న కారణంతో మొత్తం నాటకంపై నిషేధం తగదన్నారు. దీనివల్ల వేలాది కళాకారుల జీవనభృతి దెబ్బతిందని తెలిపారు. వ్యభిచారం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పడమే ఆ నాటకం ప్రధాన ఉద్దేశమని, సుబ్బిశెట్టి పాత్రతో అదే చెప్పించారని ఉమేశ్ వివరించారు. ఓ వర్గం పేరు ప్రతిబింబించేలా మీరెందుకు నాటకం ప్రదర్శిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ వర్గాన్ని మరో వర్గం కించపరిచేందుకు అనుమతినిస్తే పౌర యుద్ధానికి దారి తీస్తుందని తెలిపింది. త్రినాథ్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ, 2002లో ఈ నాటకంపై విధించిన నిషేధాన్ని ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తొలగించారని వివరించారు. ఈ నాటకం కల్పితమని, అభ్యంతరకర డైలాగుల్లేకుండా చూడాలని 2002లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిందన్నారు. నాటకం మొత్తంపై నిషేధం వల్ల కళాకారుల జీవనభృతి దెబ్బతిందన్న శ్రవణ్ కుమార్ వాదనతో ధర్మాసనం విభేదించింది. పూర్తిస్థాయి వాదనల సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామంది. -
చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నిరాకరించిన ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి : భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తామంటే ఊరుకోబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించేందుకు నిరాకరించింది. నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా అసభ్య డైలాగులు చెప్పిస్తూ ఆర్యవైశ్యులను కించపరిచేలా చూపుతున్నందున, దానిని నిషేధించాలన్న ఆర్యవైశ్య సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నాటకం ప్రదర్శనపై నిషేధం విధించింది. దీనిని సవాలు చేస్తూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, కళాకారుడు త్రినాథ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్ చంద్ర, ఆర్.వెంకటేశ్‌లు వాదనలు వినిపిస్తూ.. కళాకారుల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులున్నాయని అన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏ ఒక్క వర్గం మనోభావాలను కూడా కించపరచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చింతామణి నాటకంలో ఏముందో తెలుసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంది. నాటకంలో ఏముందో పరిశీలిస్తామని చెప్పింది. నాటకానికి సంబంధించిన ఒరిజినల్ పుస్తకం, దాన్ని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసిన కాపీని తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం) -
చింతామణి నిషేధం సవాలు వెనుక మీ ప్రయోజనాలేంటి?
సాక్షి, అమరావతి: చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేయడం వెనుక మీ ప్రయోజనాలు ఏమున్నాయని పిటిషనర్ రఘురామకృష్ణరాజును హైకోర్టు ప్రశ్నించింది. ఓవర్గం జీవనోపాధి మరోవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదని పేర్కొంది. అలా ఉంటే దానిపై తప్పక న్యాయసమీక్ష చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకరి చర్యలపై మరొకరు స్పందించేందుకు, వారి మనోభావాలను వ్యక్తం చేసేందుకు హక్కు ఉంటుందంది. చింతామణి నాటకంపై నిషేధం విషయంలో ఆర్యవైశ్యుల వాదనలు కూడా వింటామని పేర్కొంది. శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్యాన్నసత్రం కో ఆర్డినేటర్ గుబ్బా చంద్రశేఖర్ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది. ఇదే అంశంపై మరో 2 సంఘాలు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లు అవసరం లేదని, వీటిని అనుమతిస్తే మరికొన్ని దాఖలయ్యే అవకాశం ఉందని, ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది. దీంతో 2 సంఘాల తరఫు న్యాయవాదులు తమ ఇంప్లీడ్ పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. చింతామణి నిషేధం విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రశేఖర్‌ను కోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. నాటక కళాకారుడు త్రినాథ్ న్యాయవాది శ్రవణ్‌కుమార్.. తాము కూడా ఇదే అంశంపై రిట్ పిటిషన్ వేశామని కోర్టుకి చెప్పగా ఈ వ్యాజ్యంతో పాటు మిగిలిన వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాంçస్కృతిక, పర్యాటక, యువజనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ జీవో నంబరు 7 జారీ చేశారు. హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘాలు.. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆర్యవైశ్యులంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల పట్ల ప్రేమాభిమానాలు చూపి వెంటనే చింతామణి నాటక ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఆర్యవైశ్య వెల్ఫేర్ –డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ మరొక ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
క్యూట్ కపుల్.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’
సాక్షి, చింతామణి: ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న ఆంగ్ల సామెత ఈ జోడిని చూస్తే అర్థమవుతుంది. వరుడు బెంగళూరుకు చెందిన విష్ణు (28), వధువు కోలారుకు చెందిన జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ జంటను చూసిన వారంతా క్యూట్ కపుల్ అంటూ మురిసిపోతున్నారు. కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో ఆదివారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. (చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి..) -
కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..
ముదిగుబ్బ: మనమధ్య వివాదాలు ఎందుకు? కలిసిమెలిసి ఉందాం అని నచ్చజెప్పి భార్యను తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపేణ అతడి భార్యను కబళించింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లనంతపురం సమీపాన ఆదివారం రోడ్డు పక్కను వున్న కల్వర్టును కారు డీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చింతామణికి చెందిన రమేశ్‌బాబు, రుక్మిణమ్మ భార్యాభర్తలు. వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రుక్మిణమ్మ భర్తతో విబేధించింది. అనంతపురంలోని వారి బంధువుల ఇంటికి వచ్చి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భార్యకు నచ్చచెప్పి తిరిగి కాపురానికి తీసుకెళ్దామని రమేశ్‌బాబు భావించాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య రుక్మిణమ్మ వద్దకు వచ్చి మాట్లాడాడు. భర్త నచ్చచెప్పడంతో తిరిగి కాపురానికి ఆమె అంగీకరించింది. దీంతో అందరూ సంతోషంగా కారులో చింతామణికి బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు రాళ్లనంతపురం వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యింది. రుక్మిణమ్మ, డ్రైవర్ శివన్న (43) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌బాబు, లక్ష్మీదేవి, అభిషేక్ బాబులు తీవ్రంగా గాయపడడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
తండ్రీ కొడుకుల దారుణ హత్య
చింతామణి/కర్ణాటక: ఇంటి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవల్లో తండ్రీ కొడుకు హత్యకు గురయ్యారు. ఈ ఘటన పట్టణలోని శ్రీరామనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. శ్రీరామనగర్‌కు చెందిన అంజప్ప, అశ్వత్థనారాయణ అన్నదమ్ములు. ఇంటి పంపకాల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది. తరచూ అన్నదమ్ములు గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి కూడా గొడవ పడ్డారు. తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగడంతో అంజప్ప, అతని కుమారుడు విష్ణుప్రసాద్‌పై అశ్వర్థనారాయణ, అతని కుటుంబ సభ్యులు వేటకొడవళ్లతో దాడి చేశారు. దీంతో అంజప్ప కూడా ఎదురుదాడికి దిగి అశ్వత్థనారాయణపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన అంజప్ప(45)ను కోలారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. విష్ణుప్రసాద్(17) చింతామణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అశ్వత్థనారాయణ చిక్కబళ్లాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: మామతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డుతొలగించి.. కర్ణాటక: మరో రాసలీల వీడియో వైరల్ -
ప్రియుని భార్యను చంపడానికి కేసరిబాత్‌లో సైనేడ్..
చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మరణించడం, మరో 8మంది తీవ్ర అస్వస్థత పాలైన ఘటనలో మిస్టరీ వీడిపోయింది. అక్రమ సంబంధమే ఇంత పని చేయించిందని తేలింది. తమ ఆనందానికి ప్రియుని భార్య గౌరి, ఆమె తల్లి అడ్డుగా ఉందని వారిని మట్టుబెట్టడానికి ప్రియుడు లోకేష్ (30)తో కలిసి నిందితురాలు లక్ష్మీ (48) ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. స్వర్ణకారులు బంగారంపనిలో ఉపయోగించే సైనేడ్ విషాన్ని ప్రసాదంలో కలిపినట్లు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఐజీపీ దయానంద, ఎస్పీ కార్తీక్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీ, ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వివరాలు.. గత శుక్రవారం రాత్రి చింతామణి పట్టణంలో ఒక ఆలయం వద్ద ఇద్దరు మహిళలు పంచిన ప్రసాదం తిని కవిత (29), సరస్వతమ్మ (55) అనే ఇద్దరు మహిళలు మరణించారు. ఇది సంచలనం కలిగించింది. ఎస్పీ కార్తీక్‌రెడ్డి కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను పట్టుకుని విచారించగా లక్ష్మీ పాత్ర బయటపడింది. అడ్డు తొలగించుకోవాలని ఆలయం వద్ద ఎదురెదురు ఇళ్లలో ఉండే మహిళ లక్ష్మీతో యువకుడులోకేష్ అనైతిక సంబంధం ఉంది. రెండేళ్ల కిందట లోకేష్‌కు శిడ్లఘట్టకు చెందిన గౌరి అనే యువతితో పెళ్లయింది. లోకేష్ బండారం భార్యకు తెలిసిపోవడంతో లక్ష్మీతో గొడవలు పడింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పంచాయతీ జరిగాయి. నాలుగు నెలల కిందట లోకేష్ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. గౌరి పోలీసుస్టేషన్ మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ అజ్ఞాతం నుంచి లక్ష్మీ– లోకేష్ మధ్య సంబంధాలు కొనసాగాయి. గౌరిని చంపాలని పథకం పన్ని రెండుసార్లు ప్రయత్నించి విఫలయినట్టు లక్ష్మీ అంగీరించింది. ఈసారి పకడ్బందీగా గత శుక్రవారం పకడ్బందీగా అమలు చేశారు. లక్ష్మీ తన ఇంట్లో కేసరిబాత్‌ను తయారు చేసింది. ప్రసాదాన్ని రెండు భాగాలు చేసి ఇంటి పనిమనిషి అమరావతి, ఆలయం ముందర పూలు అమ్ముతున్న పార్వతీలను పిలిచి ప్రసాదాన్ని పంచాలని సూచించింది. అందులో సైనైడ్ కలిపి ఉన్న విషయం వారికి తెలియకపోవడంతో సరేనని అంగీకరించారు. ప్లాస్టిక్ కప్పులో పెట్టినది గౌరి, వారి తల్లి సరస్వతి గుడినుంచి రాగానే ఇవ్వాలని సూచింది. వారు సరిగ్గా గౌరి, తల్లి సరస్వతికి ఇచ్చి తినమని చెప్పారు. ఇంటికి వెళ్లాక సరస్వతి ఇంటిపక్కలవారికి పంచింది.తాను కొంత తిని, కూతురికి ఇవ్వగా ఆమె తినలేదు. కొంతసేపటికే ప్రసాదం తిన్న 10 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కవిత అనే మహిళ చనిపోగా, ఆమె భర్త రాజు, చిన్నారులు జాహ్నవి, చరణి , ఇతరులు నారాయణప్ప, వెంకటరమణ, సుధా, శశిదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మరొక నిందితుడు లోకేష్ కోసం గాలిస్తున్నామని ఐజీపీ చెప్పారు. దర్యాప్తు బృందానికి 50వేలు బహుమానాన్ని ప్రకటించారు. -
అతనికి 30, ఆమెకు 48..
కర్ణాటక, చింతామణి: అనైతిక సంబంధాల గొడవే చింతామణిలో విష ప్రసాదం ఘటనకు కారణమని జోరుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. తన ప్రియుని భార్య, అత్తను అడ్డుతొలగించుకోవడానికి ఒక మహిళ ప్రియునితో కలిసి కుట్ర చేసి ప్రసాదం పంచినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో అత్త సరస్వతి, పొరుగింటి మహిళ కవిత మరణించారు. స్థానికులు సమాచారం మేరకు... నరసింహపేటగంగమ్మ ఆలయం ఎదురుగా వున్న కైవారానికి చెందిన దంపతులు ఉంటున్నారు. అతనికి 30, ఆమెకు 48 వీరికి ఎదురుగా టైలర్ వెంకటస్వామి కొడుకు లోకేష్ నెట్‌సెంటర్ నడుపుతున్నాడు లోకేష్ (30)కు, ఎదురింటి మహిళ (48)కి మధ్య 8 ఏళ్ల నుంచీ వివాహేతర సంబంధం వున్నట్టు సమాచారం. ఆ మహిళ కూతురు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తోంది. లోకేష్‌కు శిడ్లఘట్ట తాలూకాకు చెందిన సరస్వతమ్మ కూతురు గౌరితో వివాహం జరిగింది. కొన్నాళ్ళు వీరి సంసారం బాగా సాగినా ఎదురింటి మహిళతో అక్రమ సంబంధం వల్ల గొడవలు పెరిగాయి. ఆ మహిళతో లోకేష్ భార్య, అత్త కూడా ఘర్షణ పడి పోలీసు స్టేషన్ వరకూ వెళ్లినట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంతో లోకేష్ నాలుగు నెలల కిందట ఇంటినుండి వెళ్లిపోయాడు. గౌరికి తోడుగా తల్లి సరస్వతమ్మ అక్కడే ఉంటోంది. శుక్రవారం రాత్రి సరస్వతమ్మ గుడికి వెళ్లగా, అక్కడ ప్రియుడు లోకేష్ సలహా మేరకు ఇతరులతో విషం కలిపిన ప్రసాదాన్ని సరస్వతమ్మకు అందజేసింది. సరస్వతమ్మ ఇంటికి వెళ్లి గౌరికి ఇచ్చినా తినకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. అమాయకులు బలయ్యారు. పోలీసుల అదుపులో మహిళ పోలీలు ఘటన జరిగిప్పటి నుండి ఆలయ పూజారితో పాటు చుట్టపక్కల వున్న 10 మందినిపైగా స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అనుమానిత మహిళ, ఆమె ఇంట్లో పనిచేసే బాలికను శనివారం రాత్రి వరకు ప్రశ్నించారు. ఆదివారం కూడా పోలీసులు వారిని కస్టడీలో ఉంచుకొని విచారిస్తున్నారు. లోకేష్ కోసం కూడా పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు. -
కుటుంబంలో పెను విషాదం
చింతామణి: సెలవు రావడంతో ఆనందంగా సొంతూరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం విరుచుకుపడింది. కారును సరుకు ఆటో డీ కొన్న ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్తతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి తాలూకా కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దండుపాళ్యం గేటు దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకొంది. మృతురాలిని లలితమ్మ (40)గా గుర్తించారు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీకి చెందిన రవీంద్రరెడ్డి, భార్య లలితమ్మ(40), కూతురు హారిక (18)తో కలిసి బెంగళూరు మహదేవపురలో నివాసం ఉంటున్నారు. రవీంద్రరెడ్డి సివిల్ ఇంజినీర్‌గా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్తుండగా... ఆదివారం సెలవు కావడంతో భార్య లలితమ్మ పుట్టినిల్లయిన తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డి గ్రామంలోని తల్లిదండ్రులను చూడటానికి బెంగళూరు నుంచి బయల్దేరారు. ఉదయం 10 గంటలప్పుడు చింతామణి మీదుగా వెళుతుండగా ఎదురుగా రాగుల లోడుతో వచ్చిన సరుకు ఆటో వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. లలితమ్మ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. రవీంద్రరెడ్డి తలకు తీవ్రకు గాయాలయ్యాయి, కూతురు నీహారికకు కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ఆటోలో వున్న వారు శ్రీనివాసపురం తాలూకా కూరకుల్లోపల్లి గ్రామానికి చెందని రైతులు నారాయణస్వామి, రామన్న, మూర్తి రాగులతో చింతామణి మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం సంభవించింది. వారికి కూడా గాయాలు తగిలాయి. ఆటోను మూర్తి నడుపుతున్నట్లు గుర్తించారు. కంచార్లపల్లి పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఏ తల్లిదండ్రుల కర్కశత్వమో ..
► రోడ్డు పక్కన ఆడశిశువు ► ఏ తల్లి కన్నబిడ్డో ► చింతామణిలో అమానుషం చింతామణి: వెచ్చగా కన్నతల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన శిశువు రోడ్డుపాలైంది. బొడ్డూడని పసికందు అప్పుడే అనాథగా మారింది. ఏ తల్లిదండ్రుల కర్కశత్వమో ఆమెను చెత్తకుప్ప పాలుజేసింది. ఒక రోజు కిందటే పుట్టిన ఆడశిశువును ఎవరో వదిలివెళ్లిన అమానవీయ సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడిహొసహళ్లి బస్సు క్రాసు దగ్గర శనివారం వెలుగు చూసింది. ప్రభుత్వాలు ఆడబిడ్డలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి సంరక్షణకు ఎంతో కృషి చేస్తున్నా ఆడపిల్లల పట్ల చులకనభావం తొలగిపోవడం లేదు. ఆడపిల్లంటే ఇంటికి లక్ష్మిదేవి అని ఆనందించాల్సింది పోయి గుండెలమీద కుంపటిలా కొందరు భావిస్తున్నారు. ఇలాంటిదే ఈ ఘటన. శనివారం ఉదయం హొసహళ్లి క్రాస్ దగ్గర ఉన్న దుకాణాన్ని తీయడానికి వచ్చిన యజమాని మునిరెడ్డి బస్సు షెల్టర్‌లో సంచి ఉండడం గమనించి దగ్గరకు వెళ్లి చూడగా, పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆయన, గ్రామస్థులు సంచి తీసి చూడగా నవజాత ఆడశిశువు కనిపించింది. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. చింతామణి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వచ్చి ప్రథమ చికిత్స నిర్వహించి, అనంతరం పిల్లల సంరక్షణ సహాయవాణి సిబ్బంది ఆంజప్ప, సునీత పాపను జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. పాప తల్లిదండ్రుల కోసం పోలీసులు, అధికారులు గాలిస్తున్నారు. -
వెయ్యి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయి
-
వెయ్యి గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. చింతామణిలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడు వాహనాలు కూడా పూర్తిగా దహనమయ్యాయి. గ్యాస్ ఎజెన్సీ శివారు ప్రాంతంలో ఉండటంతో పెద్ద ప్రాణ నష్టం నుంచి బయటపడినట్లయింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఓ పక్క మంటలు ఆర్పుతుండగానే పేలుళ్లు కొనసాగాయి. అయినప్పటికీ, ఎంతో కష్టపడి దాదాపు ఐదు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గత రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. -
లారీ - బైక్ ఢీ : ఇద్దరు మృతి
చింతామణి(కర్ణాటక): చింతామణి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ- బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఇద్దరు మృతి చెందారు. -
వ్యభిచార కూపంలో బాలిక
ఎట్టకేలకు విముక్తి పొంది తల్లి ఒడికి చేరిన వైనం బాగేపల్లి: ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలిక వ్యభిచార కూపంలో ఇరుక్కొని ఆపై అక్కడి నుంచి తప్పించుకుని తల్లి ఒడికి చేరిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న కర్ణాటకలోని బాగేపల్లి పోలీసులు చిన్నారితో వ్యభిచారం చేయిస్తున్న మహిళతోపాటు అమ్మాయిలను రవాణా చేస్తున్న తిరుపతికి చెందిన వ్యక్తిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా, యనగొండకుచెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయి రైల్లో ఏపీలోని తిరుపతికి చేరుకుంది. తిరుపతికి చెందిన సునీల్ పని కల్పిస్తానని మాయమాటలు చెప్పి బాలికను బాగేపల్లిలోని లత అనే మహిళ వద్ద విడిచిపెట్టాడు. ఆమె బాలికతో వ్యభిచారం చేయిస్తూ చిత్రహింసలకు గురిచేసేది. ఈ క్రమంలో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని చింతామణి వైపు వెళ్లే బస్సు ఎక్కింది. కండక్టర్ టికెట్ కోసం డబ్బు అడగ్గా తన వద్ద లేవంటూ అసలు విషయం వెల్లడించింది. దీంతో కండక్టర్ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, అనంతరం బాలిక తల్లికి సమాచారం ఇచ్చాడు. ఆమె బాగేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లత ఇంటిపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, సునీల్ ఆ బాలికను తెచ్చినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు తిరుపతికి వెళ్లి సునీల్‌ను అరెస్ట్ చేశారు. -
తల్లిని వదిలించుకున్నారు
కడుపున పుట్టిన బిడ్డలు ఏడిస్తే చలించిపోయే తల్లిని ముదిమి వయసులో చూసుకునే వారు కరువయ్యారు. అవసాన దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బిడ్డలు రోడ్డు పాలుచేసి చేతులు దులుపుకుంటే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో. ఈ ఘటన బి.కొత్తకోట మండలం శంకరాపురంలో శనివారం వెలుగులోకి వచ్చింది. బి.కొత్తకోట: శంకరాపురంలోని ఒక మంగలి షాపు వద్ద 95 ఏళ్ల వృద్ధురాలు పడుకుని ఉంది. శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజ మాని ఆమె ఎవరో ఏమిటో తెలియకపోవడంతో ఎదురుగా ఉన్న చింతచెట్టు కిం దకు చేర్చాడు. అప్పటి వరకు ఆమె విషయాన్ని పట్టించుకోని గ్రామస్తులు తర్వాత వివరాల కోసం ఆరా తీశారు. చర్మం ముడతలు పడి, కూర్చునేందు కు, లేచేందుకూ వీలులేని స్థితిలో వృద్ధురాలు దీనంగా కనిపిస్తోంది. ఆమె చిరునామా కోసం ప్రయత్నిస్తే సమాధానం చెప్పలేకపోతోంది. ఒకసారి మాత్రం అనంతపురం జిల్లా తనకల్లు అని చెప్పింది. వినికిడి సమస్య ఉన్న ఆమె ఇంకేమీ చెప్పలేకపోతోంది. వదిలేసి వెళ్లిపోయారు.. ములకలచెరువు నుంచి బి.కొత్తకోట మీదుగా కర్ణాటకలోని చింతామణికి వెళ్లే ప్రయివేటు బస్సులోంచి ఓ జంట గురువారం ఉదయం 10 గంటల సమయం లో శంకరాపురంలో వృద్ధురాలిని దించారని గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపక్కనే చాలా సమయం పడుకోబెట్టారని చె ప్పారు. స్థానికులు ప్రశ్నిస్తే శంకరయ్యస్వామి దర్శనం కోసం వచ్చామని సమాధానమిచ్చారు. సాధారణంగా స్వామి దర్శనానికి భక్తులు వస్తుంటా రు. వాళ్లనీ ఇలాగే భావించారు. ఆ తర్వాత కొంత సమయానికి ఆ జంట మాయమైంది. రెండు రోజులుగా ఆమె అక్కడే ఉంది. గురువారం, శుక్రవారం మంగలిషాపు మూసివేసి ఉండడం, శనివారం షాపు యజమాని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు ఎవరన్నది తెలియడం లేదు. చింతామణి బస్సులో రావడం చూస్తే ములకలచెరువు నుంచే తెచ్చినట్టు అర్థమవుతోంది. తిరుపతి వైపు నుంచి లేదా అనంతపురం వైపు నుంచి రైలులో ములకలచెరువు చేరుకుని అక్కడి నుంచి బస్సులో శంకరాపురంలో వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.