వెయ్యి గ్యాస్‌ సిలిండర్లు ఒకేసారి పేలాయి | More than 900 cylinders blast near Chintamani last night | Sakshi
Sakshi News home page

వెయ్యి గ్యాస్‌ సిలిండర్లు ఒకేసారి పేలాయి

Published Mon, Dec 26 2016 9:37 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

వెయ్యి గ్యాస్‌ సిలిండర్లు ఒకేసారి పేలాయి - Sakshi

వెయ్యి గ్యాస్‌ సిలిండర్లు ఒకేసారి పేలాయి

బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. చింతామణిలోని హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలో భారీ అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనలతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడు వాహనాలు కూడా పూర్తిగా దహనమయ్యాయి.

గ్యాస్ ఎజెన్సీ శివారు ప్రాంతంలో ఉండటంతో పెద్ద ప్రాణ నష్టం నుంచి బయటపడినట్లయింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది ఓ పక్క మంటలు ఆర్పుతుండగానే పేలుళ్లు కొనసాగాయి. అయినప్పటికీ, ఎంతో కష్టపడి దాదాపు ఐదు గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గత రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement