కర్ణాటక, చింతామణి: అనైతిక సంబంధాల గొడవే చింతామణిలో విష ప్రసాదం ఘటనకు కారణమని జోరుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. తన ప్రియుని భార్య, అత్తను అడ్డుతొలగించుకోవడానికి ఒక మహిళ ప్రియునితో కలిసి కుట్ర చేసి ప్రసాదం పంచినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో అత్త సరస్వతి, పొరుగింటి మహిళ కవిత మరణించారు. స్థానికులు సమాచారం మేరకు... నరసింహపేటగంగమ్మ ఆలయం ఎదురుగా వున్న కైవారానికి చెందిన దంపతులు ఉంటున్నారు.
అతనికి 30, ఆమెకు 48
వీరికి ఎదురుగా టైలర్ వెంకటస్వామి కొడుకు లోకేష్ నెట్‌సెంటర్ నడుపుతున్నాడు లోకేష్ (30)కు, ఎదురింటి మహిళ (48)కి మధ్య 8 ఏళ్ల నుంచీ వివాహేతర సంబంధం వున్నట్టు సమాచారం. ఆ మహిళ కూతురు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తోంది. లోకేష్‌కు శిడ్లఘట్ట తాలూకాకు చెందిన సరస్వతమ్మ కూతురు గౌరితో వివాహం జరిగింది. కొన్నాళ్ళు వీరి సంసారం బాగా సాగినా ఎదురింటి మహిళతో అక్రమ సంబంధం వల్ల గొడవలు పెరిగాయి. ఆ మహిళతో లోకేష్ భార్య, అత్త కూడా ఘర్షణ పడి పోలీసు స్టేషన్ వరకూ వెళ్లినట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంతో లోకేష్ నాలుగు నెలల కిందట ఇంటినుండి వెళ్లిపోయాడు. గౌరికి తోడుగా తల్లి సరస్వతమ్మ అక్కడే ఉంటోంది. శుక్రవారం రాత్రి సరస్వతమ్మ గుడికి వెళ్లగా, అక్కడ ప్రియుడు లోకేష్ సలహా మేరకు ఇతరులతో విషం కలిపిన ప్రసాదాన్ని సరస్వతమ్మకు అందజేసింది. సరస్వతమ్మ ఇంటికి వెళ్లి గౌరికి ఇచ్చినా తినకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. అమాయకులు బలయ్యారు.
పోలీసుల అదుపులో మహిళ
పోలీలు ఘటన జరిగిప్పటి నుండి ఆలయ పూజారితో పాటు చుట్టపక్కల వున్న 10 మందినిపైగా స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అనుమానిత మహిళ, ఆమె ఇంట్లో పనిచేసే బాలికను శనివారం రాత్రి వరకు ప్రశ్నించారు. ఆదివారం కూడా పోలీసులు వారిని కస్టడీలో ఉంచుకొని విచారిస్తున్నారు. లోకేష్ కోసం కూడా పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment