గుట్టు బయటపెడుతుందని అత్త హతం | Women Murder Case Reveals Karnataka Police | Sakshi
Sakshi News home page

గుట్టు బయటపెడుతుందని అత్త హతం

Published Wed, Feb 26 2020 8:48 AM | Last Updated on Wed, Feb 26 2020 8:48 AM

Women Murder Case Reveals Karnataka Police - Sakshi

నిందితురాలు సౌందర్య ,సౌందర్య ప్రియుడు నవీన్‌ జడేస్వామి

కర్ణాటక, యశవంతపుర: తమ గుట్టును బయటపెడుతుందని కోడలు ప్రియునితో ఏకంగా అత్తను అంతమొందించింది. తరువాత ఏమీ తెలియనట్లు నటించినా చివరకు దొరికిపోయారు. ఈ నెల 18న బ్యాటరాయనపుర మెయిన్‌ రోడ్డులో హత్యకు గురైన రాజమ్మ (60) అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె కొడుకు కుమార్, కోడలు సౌందర్యలు రాజమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 18న రాజమ్మ ఇంటిలో ఉండగా అపరిచిత వ్యక్తులు దాడి చేసి ఆమెను హత్య చేశారని కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేయగా అసలు విషయం బయట పడింది.  

ఇద్దరినీ చూడడంతో  
రాజమ్మను ఆమె కోడలు సౌందర్య, ఆమెతో ఆక్రమ సంబంధమున్న లైన్‌మ్యాన్‌ నవీన్‌ జడేస్వామి కలిసి హత్య చేసిన్నట్లు బయట పడింది. దీనితో నిందితులను బ్యాటరాయనపుర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 18న నవీన్‌ జడేస్వామి–సౌందర్యలు కలిసి ఇంటిలో ఉండటం రాజమ్మ చూసింది. దీనితో కోడలు సౌందర్యను మందలించింది. విషయంను భర్త కుమార్‌తో చెప్పి పంచాయతి పెడతానంటూ హెచ్చరించింది. దీంతో తమ బండారం బయటపడుతుందని భయపడిన సౌందర్య ప్రియుడు నవీన్‌తో కలిసి రాజమ్మ తలపై రాడ్‌తో బాదడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సౌందర్య ఏమీ తెలియనట్లు పక్క ఇంటీకీ వెళ్లగా, నవీన్‌ అక్కడ నుండి జారుకున్నాడు. 

కేకలు వేస్తూ ఏడుపు  
గంట తరువాత సౌందర్య ఇంటికెళ్లగా రాజమ్మ రక్తపు మడుగులో శవమై ఉంది. సౌందర్య గట్టిగా  కేకలు వేస్తూ అత్తను ఎవరో హత్య చేసినట్లు లబోదిబోమంటూ ఏడ్చింది. ప్యాక్టరీలో ఉద్యోగానికి వెళ్లిన కుమార్‌ను పోలీసులు పిలిపించారు. తన తల్లీని ఏవరో హత్య చేసిన్నట్లు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట రాజమ్మ వద్దనున్న బంగారం కోసం దొంగలు హత్య చేసి ఉంటరాని భావించారు. అయితే సౌందర్యపై అనుమానం రావటంతో స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కుమార్‌ లేనప్పుడు ఎవరెవరు ఇంటికీ వచ్చేవారని తమదైన శైలిలో విచారించటంతో విషయం చెప్పేసింది. రాజమ్మ వద్దకు నవీన్‌ జడేస్వామి అప్పుడప్పుడు తమలపాకు కోసం వచ్చేవాడు. సౌందర్యతోనూ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి రెండేళ్ల నుంచి అక్రమ సంబంధం నడుస్తోంది. తమ గురించి కొడుక్కి చెబుతుందనే కోపంతో రాజమ్మను ఇద్దరు కలిసి హత్య చేసినట్లు పోలీసులకు వివరించింది. ఇద్దరిని అరెస్ట్‌ చేసి జైలు పంపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement