నిందితుడు ఇళయరాజ , హతురాలు శాంతి (ఫైల్)
క్రిష్ణగిరి: సూళగిరి వద్ద మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం గొడవతో భర్తనే ఆమెను హత్య చేసినట్లు భర్త పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. విళుపురం జిల్లా శంకరాపురం తాలూకా వడపన్‌తరపి గ్రామానికి చెందిన ఇళయరాజ నిందితుడు. వివరాలు.. ఇతడు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు సూళగిరి సమీపంలోని చెంబరసనపల్లి గ్రామానికి చెందిన సేటు గతంలో సౌదీలో పనిచేస్తూ వచ్చాడు. అప్పుడు ఇద్దరికీ పరిచయమైంది. సేటు రెండేళ్ల కిందట ఉద్యోగం మానేసి స్వగ్రామానికొచ్చాడు. ఈ తరుణంలో సేటు, ఇళయరాజ భార్య శాంతి (28) మధ్య సంబంధం ఏర్పడింది.
దంపతుల మధ్య గొడవ
సేటు 15 రోజుల క్రితం శాంతిని సూళగిరి ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. సూళగిరిలోని ఓ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేర్పించాడు. రెండు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికొచ్చిన ఇళయరాజ సూళగిరిలోని భార్యవద్దకు వెళ్లాడు. ఈ సమయంలో సేటు, శాంతిల మధ్య వివాహేతర సంబంధాన్ని పసిగట్టాడు. స్వగ్రామానికి వెళ్లిపోదామని తెలిపాడు. దీనికి భార్య నిరాకరించడంతో గొడవ ఏర్పడింది. ఆవేశం చెందిన ఇళయరాజ సుత్తితో ఆమె తలపై బాదడంతో ఆమె స్పృహ తప్పింది. ఆమె గొంతుకు ఉరి బిగించి కిటికీకి వేలాడదీసి పరారయ్యాడు. శనివారం ఉదయం గమనించిన స్థానికులకు శాంతి మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనపై సూళగిరి పోలీసులు ఇళయరాజ కోసం గాలించి పట్టుకొన్నారు. సేటును కూడా అరెస్టు చేశారు. కేసు తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment