
ముదిగుబ్బ: మనమధ్య వివాదాలు ఎందుకు? కలిసిమెలిసి ఉందాం అని నచ్చజెప్పి భార్యను తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపేణ అతడి భార్యను కబళించింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలోని రాళ్లనంతపురం సమీపాన ఆదివారం రోడ్డు పక్కను వున్న కల్వర్టును కారు డీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చింతామణికి చెందిన రమేశ్‌బాబు, రుక్మిణమ్మ భార్యాభర్తలు.
వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రుక్మిణమ్మ భర్తతో విబేధించింది. అనంతపురంలోని వారి బంధువుల ఇంటికి వచ్చి భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భార్యకు నచ్చచెప్పి తిరిగి కాపురానికి తీసుకెళ్దామని రమేశ్‌బాబు భావించాడు. ఈ క్రమంలో ఆదివారం భార్య రుక్మిణమ్మ వద్దకు వచ్చి మాట్లాడాడు. భర్త నచ్చచెప్పడంతో తిరిగి కాపురానికి ఆమె అంగీకరించింది. దీంతో అందరూ సంతోషంగా కారులో చింతామణికి బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు రాళ్లనంతపురం వద్దకు రాగానే ప్రమాదానికి గురయ్యింది. రుక్మిణమ్మ, డ్రైవర్ శివన్న (43) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌బాబు, లక‌్ష్మీదేవి, అభిషేక్ బాబులు తీవ్రంగా గాయపడడంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా
Comments
Please login to add a commentAdd a comment