
శివాజీనగర(బెంగళూరు): రోడ్డు దాటుతున్న బాలికపై బీబీఎంపీ చెత్త లారీ దూసుకెళ్లడంతో మృతి చెందిన దుర్ఘటన నగరంలో హెబ్బాళ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎయిర్‌పోర్టు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం 12:45 సమయంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో అండర్‌పాస్ నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు రోడ్డు మీదనే అటుఇటు రాకపోకలు సాగించారు.
అక్షయ (13) అనే 9వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసి వచ్చి రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వచ్చిన చెత్త లారీ బాలికపై దూసుకెళ్లి, బైక్‌ను కారును ఢీకొట్టింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. బైక్‌లు, కార్లు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. బీబీఎంపీ సిబ్బంది అండర్‌పాస్‌లో నీటిని తొలగించకపోవడమే ఘటనకు కారణమని విమర్శలొచ్చాయి.